అనుమానాలన్నింటిని ఎన్నికల సంఘం తీర్చాల్సిందే..
ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన సమాచారం పౌరులందరికి అందుబాటులోకి తేవాలి
మహారాష్ట్ర ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి ఘోరంగా ఓడిపోవడం, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా పరాజయం పాలవడంతో రాజకీయ పార్టీలు మరోసారి ఈవీఎంలపై అనుమానాలను లెవనెత్తాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశ రాజధాని గత 11 సంవత్సరాలుగా అభివృద్ధిలో వెనకబడిందని దానిని తొలగించి కొత్త యుగాన్ని తీసుకురావాలని ఓటర్లను కోరారు.
అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని, ఢిల్లీ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు తమ దగ్గర పరిష్కారం ఉన్నాయని ఆయన చెప్పారు.
స్వతంత్య్ర పరిశీలకులు కావాలి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజక వర్గంలో స్వత్రంత్య పరిశీలకులు నియమించాలని లేఖలో పేర్కొంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని, ఢిల్లీ పోలీసులు తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని లేఖలో ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
తమ వారిని ఏకపక్షంగా అదుపులోకి తీసుకుంటున్నారని, ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ కూడా ఎన్నికల్లో అక్రమాలను పాల్పడేందుకు అని ఆపార్టీ ఆరోపణ. ‘‘ సున్నితమైన ప్రాంతాలలో పోలింగ్ ముందు రోజు రాత్రి పోలీసుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, చట్టవిరుద్దమైన నిర్బంధాలను ఆపడానికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను ఈసీ నియమించాలి’’ అని కేజ్రీవాల్ తను రాసిన లేఖలో కోరారు.
మరో వైపు కాంగ్రెస్ ఎన్నికల సంఘం (EC) ద్వారా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
దానికి ‘‘ ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ లీడర్స్ అండ్ ఎక్స్ పర్ట్స్ (ఈగల్) గా నామకరణం చేసింది. ఇలా విపక్షాలు ఈవీఎంలపై తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి సొంతంగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. అందుకే చాలామంది ప్రజాస్వామ్య ప్రేమికులు ఎన్నికల అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ కిరీటం కోసం ఎన్నికలు జరగబోతున్నాయి.
పారదర్శకత కావాలి
రాజకీయ పార్టీలు ఓటరు ఓటింగ్ కు సంబంధించి ప్రామాణీకరించబడిన రికార్డుతో సహా సంబంధిత అన్ని ఓటింగ్ రికార్డులు సకాలంలో ప్రచురించాలని పట్టుబడుతున్నాయి. ఓటింగ్ సమయాన నమోదు చేసిన రికార్డులకు, తరువాత ఎన్నికల సంఘం ప్రచురిస్తున్న డేటాకు మధ్య తేడాలుండటంతో అనేక అనుమానాలను పార్టీలు లేవనెత్తుతున్నాయి.
పౌరులకు ఓటింగ్ ప్రక్రియలో విశ్వాసాన్ని కలిగించాలి. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియల సమయంలో ప్రతి రికార్డును పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి.
ప్రతి ఓటరు కూడా జాగ్రత్తగా పారదర్శక పోలింగ్ కోసం డిమాండ్ చేయాలి. ఇది అతని హక్కు. ప్రిసైడింగ్ అధికారి పార్ట్ వన్ లోని ఫామ్ 17 సీ ని విధిగా సకాలంలో తయారు చేయాలి.
పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ స్టేషన్ లో ఓటరు ఓటింగ్ శాతం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ప్రకారం పోలైన ఓట్ల సంఖ్యను ఇది అధికారికంగా ధృవీకరిస్తుంది.
వెబ్ సైట్ లో అందుబాటులో..
పోలింగ్ ముగిసే సమయానికి హాజరైన ప్రతి పోలింగ్ ఏజెంట్‌కు ఈ చట్టబద్ధమైన ఫారమ్ కాపీ అందిస్తారు. ఆ పత్రం రిటర్నింగ్ అధికారికి కూడా ఇస్తారు. అన్ని పోలింగ్ స్టేషన్‌ల కోసం ఫారమ్ 17C పార్ట్ I, స్కాన్ చేయబడిన, స్పష్టమైన కాపీలను తప్పనిసరిగా పోలింగ్ రోజు 48 గంటలలోపు ECI వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలి.
అదనంగా, ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కౌంటింగ్ రోజున తయారు చేయబడిన ఫారం 17C (పార్ట్ II), ప్రతి అభ్యర్థికి నమోదైన ఓట్ల సంఖ్యను తెలియజేస్తుంది. అభ్యర్థులందరికీ నమోదైన మొత్తం ఓట్లు ఈవీఎంలో నమోదైన ఓట్ల సంఖ్యతో సరిపోలుతున్నాయో లేదో నిర్ధారించేది. పార్ట్ Iలో నింపిన సమాచారం అయితే ఇది కౌంటింగ్ రోజు 48 గంటల తర్వాత ECI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి.
అదేవిధంగా, ఫారమ్ 20 కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. ప్రతి అభ్యర్థికి ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో పోలైన ఓట్లను నమోదు చేసే ప్రతి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి రూపొందించిన ఫైనల్ రిజల్ట్ షీట్, పోస్టల్ బ్యాలెట్‌ల ద్వారా పోలైన ఓట్లను కూడా చూపెడుతుంది.
ఈ ఫారమ్ వెబ్‌సైట్‌లో అందుబాటలోకి తెస్తున్నప్పటికీ, చాలాసార్లు ఎన్నికల ఫలితాల తరువాతనే బయటకు వస్తుంది. ఫలితాలు ప్రకటించిన 48 గంటల్లోనే వెబ్ సైట్ లో ఫారం 20 ని ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని ప్రజాస్వామ్య ప్రేమికులైన మాలాంటి వారు కోరుతున్నారు.
క్యూలో నిలబడిన వారికి జారీ చేసిన స్లిప్పులు..
రెండవది, పోలింగ్ ముగిసే సమయంలో క్యూలో నిలబడిన ఓటర్లకు జారీ చేయబడిన స్లిప్పుల సమాచారాన్ని బహిర్గతం చేయడం. స్లిప్‌లు జారీ చేయబడిన, పోలింగ్ ముగిసే సమయానికి ఓటు వేయడానికి అనుమతించబడిన ఓటర్ల సంఖ్య సమాచారాన్ని ప్రిసైడింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని బహిర్గతం చేయడం వల్ల సవరించిన అంచనాలలో ఉన్న పోలింగ్‌లో ఏదైనా పెరుగుదల ఉన్నట్లయితే ఆ సందేహాలను ఈ ప్రక్రియ తొలగిస్తుంది.
సీనియర్ న్యాయవాదులతో పాటు, మాజీ కేంద్ర సమాచార కమిషనర్లలో నలుగురు (ఈ రచయిత ఎం శ్రీధర్ ఆచార్యులుతో సహా), పౌరులకు అనేక సందేహాలు ఉన్నాయి. అంజలి భరద్వాజ్, ప్రశాంత్ భూషణ్, అశోక్ శర్మ, అమృత జోహ్రీ, హర్ష్ మందర్, వజాహత్ హబీబుల్లా, స్మితా గుప్తా, అదితి మెహతా, షబ్నమ్ హష్మీ, దీపక్ సంధు, ఎం. ఎం. అన్సారీ, గౌహర్ రజా ఒక ప్రకటన విడుదల చేశారు.
“ఈసీ ఓటును అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తుందని మాకు తెలుసు. ఈ ప్రక్రియ కోసం అనేక సాధనాలను ఈసీ వాడుకుంటుంది. ఈ ప్రయత్నాలు ప్రశంసనీయం అయినప్పటికీ, ఎన్నికల ప్రక్రియలో రూపొందించబడిన ప్రామాణికమైన, ధృవీకరించబడిన రికార్డులను పౌరులు యాక్సెస్ చేయడం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనది.
ఎన్నికల నియమాల ప్రవర్తనలో ప్రజల సమాచార హక్కు కూడా గుర్తించబడింది. పైన పేర్కొన్న రికార్డులు ఏవీ నిబంధనలలోని రూల్ 93(1) ప్రకారం ప్రజలకు బహిర్గతం చేయకుండా మినహాయింపు ఇవ్వలేదు. ఎన్నికల సంఘం చురుకైన చర్యను తీసుకుని త్వరలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ప్రామాణికమైన రికార్డులను తన వెబ్ సైట్ లో బహిర్గతం చేస్తుందని ఆశిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసం, మన ప్రజాస్వామ్యం పటిష్టమైన పనితీరును నిర్ధారించడానికి ఇవి కీలకమైనవి’’.
Next Story