భారత దేశపు అత్యంత చెత్త ఎగుమతి మా దగ్గరికి వచ్చాడు: పాకిస్తాన్
x

భారత దేశపు అత్యంత చెత్త ఎగుమతి మా దగ్గరికి వచ్చాడు: పాకిస్తాన్

ప్రభుత్వ ఆహ్వానం మేరకు నెల రోజులుగా పాకిస్తాన్ లో పర్యటిస్తున్న జకీర్ నాయక్ పై అక్కడి ప్రజలు విసుగు ప్రదర్శిస్తున్నారు. నాయక్ ప్రసంగాల్లో విద్వేషం బుసలు..


తీవ్రవాద కార్యకలాపాలతో భారత్ సహ ప్రపంచంలోనే అనేక దేశాలలో కేసులు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్ ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటన చేయడంపై ఆదేశ ప్రజలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇస్లామాబాద్ ఆహ్వనంతోనే జకీర్ నాయక్ ఆ దేశంలో పర్యటిస్తున్నారు.

భారత్ దేశం అత్యంత చెత్త ఎగుమతి జకీర్ నాయక్ అని పాకిస్తాన్ అభివర్ణించింది. జర్నలిస్టు ముబాషర్ లుక్మాన్ మాట్లాడుతూ.. నాయక్ తన ప్రసంగాలలో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని, అతడికి బహిరంగ ఉపన్యాసాలు ఇవ్వడానికి అనుమతించకూడదని అన్నారు.

“ నేను ముస్లిం పండితులచే ప్రభావితమయ్యాను. ఆ పండితులు ప్రేమ, భాగస్వామ్యం, సామరస్యాన్ని మాత్రమే బోధించారు. నాయక్‌ మాటలు విన్న ప్రతిసారీ అతను ద్వేషాన్ని రెచ్చగొడుతున్నట్లు అనిపిస్తుంది. తను చిన్నతనంలో ఎవరో చేసి ఉండాల్సింది ఇప్పుడు బయటకు వస్తోంది. అతను బహిరంగ ఉపన్యాసాలు ఇవ్వడానికి అనుమతించకూడదు” అని లుక్‌మాన్ ఇండియా టుడేతో అన్నారు.
నాయక్‌ను పాక్ ప్రధాని ప్రశంసించారు
అక్టోబర్ 2న ఎక్స్ లో (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్‌లో, నాయక్ తాను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సంభాషించానని రాశారు. షరీఫ్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. నాయక్ ఎక్స్ ఖాతా భారతదేశంలో నిలిపివేశారు. "ఇస్లాం శాంతి మతం, ఇస్లాం నిజమైన సందేశాన్ని ప్రజలలో వ్యాప్తి చేయడం ద్వారా మీరు ఒక ముఖ్యమైన కర్తవ్యం చేస్తున్నారు" అని షరీఫ్ నాయక్‌తో అన్నారు.
నాయక్ ఉపన్యాసాలు "అత్యంత అంతర్దృష్టి, ప్రభావవంతమైనవి" అని యువ ప్రేక్షకులలో అతనికి గణనీయమైన ఫాలోయింగ్ ఉందని షరీపు చెప్పాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రేడియో పాకిస్తాన్ దీనిని నివేదించింది.
భారత్ ఖండన..
అక్టోబరు 4న, పాకిస్తాన్ నాయక్‌ను అభివర్ణించిన తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఉగ్రవాద దేశం ఇలాంటివి చేయడం పెద్ద ఆశ్చర్యం కలిగించలేదని తెలిపింది. మలేషియాలో నివసిస్తున్న నాయక్ అక్టోబర్ 1న దాదాపు నెల రోజుల పాటు పాకిస్థాన్ పర్యటనను ప్రారంభించారు.
“అతను (జకీర్ నాయక్) పాకిస్తాన్‌లో సన్మానించబడ్డాడనే వార్తలను మేము చూశాము. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
“పరారీలో ఉన్న భారతీయుడికి పాకిస్తాన్‌లో ఉన్నత స్థాయి స్వాగతం లభించడం మాకు ఆశ్చర్యం కలిగించదు. ఇది నిరుత్సాహకరమైనది, ఖండించదగినది కానీ అదే సమయంలో ఇది ఆశ్చర్యం కలిగించదు, ”అన్నారాయన.
నాయక్‌ను అప్పగించండి..
మనీలాండరింగ్, ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా తీవ్రవాదాన్ని ప్రేరేపించడం వంటి ఆరోపణలపై భారత అధికారులు నాయక్‌ పై కేసు పెట్టారు. అతను 2016లో భారతదేశాన్ని విడిచిపెట్టాడు. మహతీర్ మొహమ్మద్ నేతృత్వంలోని గత ప్రభుత్వం ఇస్లామిక్ బోధకుడికి మలేషియాలో శాశ్వత నివాసం మంజూరు చేసింది.
మలేషియా ప్రభుత్వానికి అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థన పెండింగ్‌లో ఉందని జైస్వాల్ చెప్పారు. "మేము మలేషియా ప్రభుత్వంతో అప్పగింతను కొనసాగిస్తున్నాము" అని అతను చెప్పాడు. ఆగస్టులో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా భారత్ ఈ అంశాన్ని లేవనెత్తినట్లు తెలుస్తోంది. నాయక్ ఏ పాస్‌పోర్ట్‌తో పాక్‌కు వెళ్లారనే దానిపై భారత్‌కు స్పష్టత లేదని జైస్వాల్ అన్నారు.


Read More
Next Story