యూఎస్ నుంచి స్వీయ బహిష్కరణకు గురైన భారత విద్యార్థిని
x

యూఎస్ నుంచి స్వీయ బహిష్కరణకు గురైన భారత విద్యార్థిని

హమాస్ కు మద్దతుగా నిరసనల్లో పాల్గొనడంతో విద్యార్థి వీసాను రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వం


కొలంబియా యూనివర్శిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ అమెరికా నుంచి స్వీయ బహిష్కరణకు గురైయ్యారు. హింస, ఉగ్రవాదం, హమాస్ కు మద్దతు ఇస్తున్నకారణంగా ఆమెకు ఆ దేశం వీసాను రద్దుచేసింది. తరువాత స్వీయ బహిష్కరణకు గురైనట్లు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.

మార్చి 11న రంజనీ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ హోమ్ యాప్ ను ఉపయోగించి స్వీయ బహిష్కరణకు గురైన వీడియోను విడుదల చేసింది.
ఎవరూ రంజనీ శ్రీనివాసన్..
భారత పౌరురాలు అయిన రంజనీ, కొలంబియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ప్లానింగ్ అండ్ ప్రిజర్వేషన్ లో అర్భన్ ప్లానింగ్ లో(జీఎస్ఏపీపీ) డాక్టరల్ విద్యార్థిగా ఉన్నారు. ఆమెకు ఎఫ్- 1 వీసా మంజూరు అయి ఉంది. అయితే దేశ వ్యతిరేక కార్యకలాపాలు, హింసను ప్రొత్సహించే అంశాలకు మద్దతు ఇస్తున్నట్లు గుర్తించడంతో మార్చి 5న విదేశాంగ శాఖ రంజనీ వీసాను రద్దు చేసింది.

జీఎస్ఏపీపీ ప్రకారం.. రంజనీ అర్బన్ ప్లానింగ్ లో ఎంఫిల్ హర్వర్డ్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ, అహ్మదాబాద్ లోని సీఈపీటీ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ డిగ్రీ చేశారు.
జీఎస్ఏపీపీ వెబ్ సైట్ ప్రకారం.. వాషింగ్టన్ లోని వాతావరణ మార్పుల వల్ల ప్రమాదంలో ఉన్న సరిహద్దు సమాజాలు అనే అంశంపై పర్యావరణ అనుకూల లాభాపేక్ష లేని సంస్థలలో, అలాగే మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పరిశోధకురాలిగా కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
స్వీయ బహిష్కరణ అంటే..
మార్చి 10న యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ దేశంలో అక్రమంగా ఉంటున్న వారి కోసం స్వీయ బహిష్కరణ రిపోర్టింగ్ ఫీచర్ తో సీబీపీ హోమ్ యాప్ ను ప్రారంభించింది. వీసా ఇతరత్ర కారణాలతో ఇక్కడ ఉండిపోయిన వారిని తిరిగి వారి మాతృదేశాలకు పంపడానికి ఈ యాప్ ను తీసుకొచ్చారు.
ఈ యాప్ ద్వారా వారు తిరిగి సొంత దేశాలకు వెళ్లిపోతే తిరిగి మరోసారి అమెరికా రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వారిని పోలీసులు కనుగొని బహిష్కరిస్తే జీవితంలో మరోసారి అమెరికా రావడానికి వీలుండని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది.
ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికి అనేక సేవలు ఉన్నాయి. వాటిలో ఒకటి ‘‘ఇంటెంట్ టు డిపార్ట్’’ అనే ఆప్షన్ ద్వారా దేశం నుంచి వెళ్లిపోవడానికి అవకాశం ఉంది.
స్వీయ డిపోర్ట్ ఎలా..
అమెరికా నుంచి వెళ్లాలనుకున్న ప్రయాణికుడు ఆప్ ఓపెన్ చేసి భాషను ఎంచుకుని ఫారమ్ పూర్తి చేయాలి. ఫొటో అప్ లోడ్ చేసి, తప్పనిసరిగా జీవితచరిత్రను అందించాలి. పాస్ పోర్ట్, వెళ్లడానికి అవసరమైన డబ్బు ఉందా వంటి వివరాలను నమోదు చేసి క్లిక్ చేయాలి.
ట్రంప్ కఠినచర్యలు..
కొలంబియా యూనివర్శిటీ డైవర్సీటీ పేరుతో యూదు విద్యార్థులను, హమాస్ ను వ్యతిరేకించే వారిని నిరంతం వేధిస్తోంది. దీనితో ట్రంప్ కొలంబియా విశ్వవిద్యాలయానికి 400 మిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్లు, కాంట్రాక్ట్ లను రద్దు చేసినట్లు గతవారం ప్రకటించారు.
చట్టవిరుద్దమైన నిరసనలు అనుమతించే క్యాంపస్ లు, యూదు వ్యతిరేక భావజాలం, వేధింపుల నుంచి విద్యార్థులను రక్షించడంలో విఫలమైన కళాశాల లేదా విశ్వవిద్యాలయాలు అమెరికా ప్రభుత్వ నిధులు కోల్పోయే అవకాశం ఉందని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.


Read More
Next Story