జైశంకర్ కు ఆహ్వనం పంపిన డొనాల్డ్ ట్రంప్.. ఎందుకంటే?
ప్రభుత్వంలోని కీలక అధికారులతో సమావేశం అవుతారన్న భారత విదేశాంగ శాఖ
అమెరికా 47 వ అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న ట్రంప్ కార్యక్రమానికి భారత్ తరఫున విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ హజరవుతున్నారు. విదేశాంగమంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఆయన ట్రంప్ మంత్రిమండలిలో ముఖ్యులతో సైతం సమావేశం కాబోతున్నారు.
భారత్ పట్ల కాబోయే అధ్యక్షుడు ట్రంప్ సానుకూల వైఖరిలో ఉన్నారని, ఆయనతో సానుకూల రాజకీయ దృక్ఫథాన్ని, లోతైన ద్వైపాక్షిక సంబంధాలను నిర్మించుకోవడానికి తమ ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోందని జైశంకర్ గత నెలలో జరిగిన ఓ సమావేశంలో అభిప్రాయపడ్డారు. అలాగే ఇతర దేశాల కంటే భారత్ కు ట్రంప్ మంత్రివర్గం ప్రయోజకర స్థితిని అందిస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 47 వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారంలో భారత ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ట్రంప్ - వాన్స్ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వనం పేర్కొంది. ట్రంప్ తరువాత జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
రష్యా - ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యం, సుంకాలు, వాతావరణ మార్పు, వంటి అంశాలపై అమెరికా విధానాన్ని ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా కు గతంలో కూడా అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్, తాజాగా రెండో సారి డెమోక్రాటిక్ తరఫున పోటీ చేసిన కమలా హ్యారిస్ ను ఓడించి రెండోసారి అధికారం ఎక్కారు.
జో బైెడెన్ సర్కార్ భారత్ ను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించింది. అంతకుముందు ఉన్న ట్రంప్ పరిపాలనతో పోలిస్తే డెమోక్రాటిక్ పార్టీ అనేక నేరపూరిత కేసులను భారత ప్రభుత్వంపైనే నమోదు చేసింది. అయితే న్యూఢిల్లీ వీటన్నింటిని ఖండిస్తూనే అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించించి.
కమలా హ్యారిస్ ఓటమి తరువాత తొలిసారిగా జార్జ్ సోరోస్, అమెరికా విదేశాంగ శాఖపై విమర్శలు గుప్పించింది. రాహుల్ గాంధీతో కూడిన విదేశీ శక్తులు భారత్ ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది.
Next Story