మోదీ ఆర్ధిక సలహాదారు, ఆర్ధిక వేత్త బిబేక్ దెబ్రాయ్ ఆకస్మిక మృతి
x

మోదీ ఆర్ధిక సలహాదారు, ఆర్ధిక వేత్త బిబేక్ దెబ్రాయ్ ఆకస్మిక మృతి

ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని ఆర్థిక సలహామండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిబేక్‌ దెబ్రాయ్‌ మరణించారు. ఆయన వయసు 69 ఏళ్లు.


ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్‌ దెబ్రాయ్‌ మరణించారు. ఆయన వయసు 69 ఏళ్లు. ప్రధాని ఆర్థిక సలహామండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిబేక్‌ నవంబర్ 1న ఆకస్మికంగా చనిపోయారు. 1955 జనవరి 25న జన్మించిన భారతీయ ఆర్థికవేత్త. ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌. పదవిలో ఉండగానే కన్నుమూశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ తలపెట్టిన బృహుత్తర కార్యక్రమం 'అమృత్ కాల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వర్గీకరణ, ఫైనాన్సింగ్ ఫ్రేమ్‌వర్ నిపుణుల కమిటీ'కి ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. గేమ్ థియరీ, ఎకనామిక్ థియరీ, ఆదాయం, సామాజిక అసమానతలు, పేదరికం, చట్ట సంస్కరణలు, రైల్వే సంస్కరణలు, ఇండాలజీ రంగాలలో దెబ్రాయ్ కి అపారమైన అనుభవం ఉంది. ఇటీవలే ఆయన ఇంకో రచయితతో కలిసి రాసిన ఇంక్డ్ ఇన్ ఇండియా బహుళ ఆదరణ పొందింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ లో సభ్యుడు. 2015లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2016లో నిర్వహించిన అమెరికా- ఇండియా బిజినెస్ సమ్మిట్ తో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. 2022లో, ఆస్ట్రేలియా ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఆయనకి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు బహుకరించింది. 2024 ఫిబ్రవరిలో ఆయన- దివాలా రంగంలో చేసిన సేవ, సహకారానికి గుర్తింపుగా ఇన్‌సాల్వెన్సీ లా అకాడమీ ఎమెరిటస్ ఫెలోషిప్‌ను పొందారు.
దెబ్రాయ్ బెంగాలీ. మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఓ బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించాడు. ఆయన తాతలు ఇప్పుడున్న బంగ్లాదేశ్‌లోని పైల్, హబీగంజ్, సిల్హెట్ నుంచి వలస వచ్చారు. ఆయన తండ్రి తరపు తాత, తండ్రి 1948 నాటికి వలస వచ్చారు. దెబ్రాయ్ తండ్రి భారతీయ ఆడిట్, అకౌంట్స్ సర్వీస్‌లో పని చేశారు.

బిబేక్ దేబ్రాయ్ తన పాఠశాల విద్యను నరేంద్రపూర్‌లోని రామకృష్ణ మిషన్ విద్యాలయంలో ప్రారంభించారు. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివారు. ట్రినిటీ కాలేజీ స్కాలర్‌షిప్‌పై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ తన గైడ్, ప్రముఖ బ్రిటిష్ ఆకవేత్త ఫ్రాంక్ హాన్‌ను కలిశాడు. హాన్ ఆధ్వర్యంలో దెబ్రాయ్..integrating information into a general equilibrium (సమీకృత సమాచారాన్ని సామాన్యుల దరిచేర్చడం) అనే అంశంపై పనిచేశాడు. చాలా సమగ్రంగానే పని చేసినా పీహెచ్డీ పూర్తికాకుండానే ఇండియాకి తిరిగి వచ్చారు.
దెబ్రాయ్‌ కొంతకాలం కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో పని చేశారు. పూణేలోని గోఖలే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌లో ఛాన్సలర్‌గా, దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత పలు ఇన్‌స్టిట్యూట్‌లలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2019 వరకు దెబ్రాయ్‌ నీతి అయోగ్‌లో సభ్యుడిగా ఉన్నారు. పలు పుస్తకాలు, కథనాలు రచించడంతో పాటు పలు వార్తాసంస్థలకు సంపాదకులుగా వ్యవహరించారు. ఆర్థికశాస్త్రంలో దెబ్రాయ్‌ చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. దెబ్రాయ్ మృతికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘డాక్టర్ దెబ్రాయ్‌ నాకు చాలాకాలంగా తెలుసు. ఆర్థికశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత ఇలా ఎన్నో విభిన్నరంగాల్లో ఆయనకు ఎంతో ప్రావీణ్యం ఉంది. ప్రజా విధానానికి ఆయన చేసిన కృషి అతీతం. ప్రాచీన గ్రంథాలపై పనిచేయడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. యువత కోసం వాటిని అందుబాటులోకి తెచ్చారు. ఆయన మృతి నన్ను ఎంతో బాధించింది. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని మోదీ పేర్కొన్నారు.
Read More
Next Story