మాజీ అధ్యక్షుడి ఆశలపై నీళ్లు చల్లిన మోదీ..
x

మాజీ అధ్యక్షుడి ఆశలపై నీళ్లు చల్లిన మోదీ..

ప్రపంచ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ తనను కలుస్తాడని ఆయన ప్రకటించారు. అక్కడి వార్తా ఛానెల్లు కూడా ఈ అంశానికి విస్తృత ప్రాధాన్యం ఇచ్చాయి. తీరా ఇప్పుడు..


అధ్యక్ష ఎన్నికలకు ముందు అంటే 2019 లో జరిగినట్లు యూఎస్ లో హౌడీ మోదీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆశపడిన అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థికి డొనాల్డ్ ట్రంప్ కు మోదీ షాక్ ఇచ్చారు. ఈ అమెరికా పర్యటనలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను మోదీ కలుసుకోవట్లేదని తెలిసింది.

అద్భుతమైన ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవడానికి అమెరికా వస్తారని ఒక ర్యాలీలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్ క్లెయిమ్ చేశారు. లాంగ్ ఐలాండ్‌లో ఆదివారం జరిగే ట్రంప్ ర్యాలీలో మోదీ పాల్గొంటారని ఫాక్స్ న్యూస్ వార్తలు ప్రసారం చేసింది కూడా. కానీ భారత్ దానిని ఖండించింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, అమెరికా మాజీ అధ్యక్షుడితో మోదీకి ప్రస్తుతానికి నిర్దిష్ట భేటీ లేదని స్పష్టం చేశారు.

ఈసారి "ట్రంప్ సర్కార్"కి..
గతంలో మోదీ ‘‘ అబ్కీకి బార్ ట్రంప్ సర్కార్’’ అని అని నినాదం చేశారు. ఇద్దరు నాయకులు ఒకే విధమైన మితవాద రాజకీయ సిద్ధాంతాలతో పాటు బలమైన వ్యక్తిగత బంధాన్ని పంచుకున్నారు. మోదీ తన "మేక్ ఇన్ ఇండియా" ప్రచారానికి అనుగుణంగా ట్రంప్ "అమెరికా ఫస్ట్" విధానాన్ని బహిరంగంగా ప్రశంసించారు.
2019లో హ్యూస్టన్‌లో జరిగిన “హౌడీ మోదీ” ర్యాలీ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ట్రంప్ అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. అతని రెండవ పర్యాయం కోసం పోటీ చేస్తున్నారు. మోదీ 50,000 మంది భారతీయ-అమెరికన్ల ముందు తన స్వంత ఎన్నికల నినాదాన్ని ప్రతిధ్వనిస్తూ " అబ్కీ బార్ , ట్రంప్ సర్కార్ " అని నినాదం ఇచ్చారు.
ట్రంప్‌ను తిట్టారా?
మరుసటి సంవత్సరం, ట్రంప్ అహ్మదాబాద్‌ను సందర్శించారు. “నమస్తే ట్రంప్” కార్యక్రమానికి 1,00,000 మంది సందర్శకులు వచ్చారు. అయితే ఈసారి ట్రంప్‌ను గానీ, డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌ను గానీ కలవకూడదని మోదీ నిర్ణయించుకున్నారు.
మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో జరిగిన ర్యాలీలో మోదీ తనను కలుస్తారని ట్రంప్ పేర్కొన్నప్పటికీ అది జరగలేదు. “అతను [మోడీ] అద్భుతమైనవాడు. నా ఉద్దేశ్యం, అద్భుతమైన మనిషి. ఈ నాయకులు చాలా మంది అద్భుతమైనవారు, ”అని ట్రంప్ తన మద్దతుదారులతో అన్నారు.
మూడు రోజుల అమెరికా పర్యటనలో, మోదీ విల్మింగ్టన్‌లో జరిగిన క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు హాజరయ్యారు. ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు, లాంగ్ ఐలాండ్‌లోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు, టెక్ మొగల్‌లను కలుసుకున్నారు. యుఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌లో ప్రసంగించారు.


Read More
Next Story