వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టులోకి తీసుకోండి: శశిథరూర్
x
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టులోకి తీసుకోండి: శశిథరూర్

జట్టులో తదుపరి సచిన్ అయ్యే అర్హత ఈ యంగ్ క్రికెటర్ కు ఉందన్నకాంగ్రెస్ ఎంపీ


భారత జట్టులో తదుపరి సచిన్ టెండూల్కర్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీనే అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. తిరువంతపురం ఎంపీ అయిన ఆయన 14 ఏళ్ల బుడతడిని పొగడ్తలతో ముంచెత్తారు. అతడిని వెంటనే జాతీయ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐని కోరారు. సూర్యవంశీ ప్రతిభను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో పోల్చాడు.

‘‘పద్నాలుగేళ్ల బాలుడు చివరిసారిగా ఇంత అద్భుతమైన క్రికెట్ ను ప్రదర్శించినది సచిన్ టెండూల్కర్ అది ఎలా జరిగిందో మనకు తెలుసు. మనం దేని కోసం ఎదురు చూస్తున్నాము? భారతదేశం కోసం వైభవ్ సూర్యవంశీ!’’ అని థరూర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. గౌతమ్ గంభీర్, బీసీసీఐ, సచిన్ టెండూల్కర్, అజిత్ అగార్కర్ లను ట్యాగ్ చేశాడు.
డిసెంబర్ 24న అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన విజయ్ హజారే ట్రోఫి 2025-26 ప్లేట్ లీగ్ మ్యాచ్ లో సూర్యవంశీ రికార్డులు సృష్టించాడు. పురుషుల లిస్ట్ ఏ క్రికెట్ లో సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడైన 14 సంవత్సరాల 272 రోజుల వయస్సులో సూర్యవంశీ రికార్డు సృష్టించాడు.
ఇది సీనియర్ క్రికెట్ లో అతని తొలి నాన్-టీ20 సెంచరీ. కేవలం 36 బంతుల్లోనే మూడంకెల స్కోర్ ను సాధించాడు. లిస్ట్- ఏ క్రికెట్ లో ఒక భారతీయుడు చేసిన మూడో వేగవంతమైన సెంచరీగా నిలిచింది. 2025 డిసెంబర్ ప్రారంభంలోనే మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ తరువాత ఏడో లిస్ట్ ఏ ప్రదర్శనలో ఈ ఇన్నింగ్స్ వచ్చింది.
ఏబీ డివిలియర్స్ రికార్డు బద్దలు..
పురుషుల లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన 150 పరుగుల రికార్డును సూర్యవంశీ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ బద్దలు కొట్టాడు. 59 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. 2015 లో వెస్టిండీస్ పై డివిలియర్స్ 64 బంతుల్లోనే నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.
చివరికి ఆ టీనేజర్ 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్సర్లతో 226.19 స్ట్రైక్ రేట్ తో 190 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బీహార్ వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్ లో సూర్యవంశీ అద్భుతమైన ఆటతీరుతో పాటు కెప్టెన్ సకిబుల్ జానీ 40 బంతుల్లో 128 పరుగులు, ఆయుశ్ లోహరుకా 56 బంతుల్లో 116 పరుగులు చేసి హ్యట్రిక్ సెంచరీలు చేశారు.
బీహార్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 574 పరుగులు చేసింది. ఇది లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్. అరుణాచల్ ప్రదేశ్ జట్టు 42.1 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో బీహార్ జట్టు 398 పరుగుల తేడాతో గెలిచింది.


Read More
Next Story