
సునీత విలియమ్స్ ను తీసుకువస్తున్న స్పెస్ క్యాప్సూల్
సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం మొదలైంది, ఎలాగంటే..
భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, మరో ముగ్గుర్ని తీసుకుని వస్తున్న క్యాప్సూల్ వేగంగా భూమి వైపు దూసుకొస్తోంది. మరికొన్ని గంటల్లో భూమిని తాకనుంది
ప్రస్తుతం ప్రపంచమంతటా వినిపిస్తున్న పేరు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఈ ఇద్దరు ఎట్టకేలకు భూమికి తిరిగి బయలుదేరారు. యావత్ ప్రజానీకం ఎదురుచూస్తున్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సునీత విలియమ్స్ భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి.
ఈ ఇద్దరు వ్యోమాగాములు ఎలా వస్తున్నారు, ఎలా తీసుకువస్తున్నారు, ఎక్కడ దిగుతారు, ఆ తర్వాత ఏమి జరుగుతుందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం.
వీరిని భూమి మీదకు తీసుకువచ్చే అద్భుత యాత్ర కొద్ది సేపటి కిందట మొదలైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు కూడా భూమి మీదకు వస్తున్నారు. వీరిని తీసుకురావడానికి అమెరికాలోని ప్లోరిడా నుంచి నాసా ఓ రాకెట్ ను అంతరిక్షానికి పంపింది. దానిలో నలుగురు వెళ్లారు. వాళ్లు అక్కడ ఉండి ఈ నలుగుర్ని తిరిగి భూమి మీదకు పంపుతున్నారు. మంగళవారం ఉదయం (మార్చి 18) వీళ్లను ఓ స్పెస్ క్యాప్యూల్స్ లోకి ఎక్కించారు. ఇది స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్. ఈ క్యాప్సూల్ పసిఫిక్ మహాసముద్రం మీదుగా 260 మైళ్ల (418 కి.మీ.) ఎత్తున కక్ష్యలో ఉండగానే విడిపోయి, వాతావరణ అనుకూలంగా ఉంటే సాయంత్రానికి ఫ్లోరిడా తీరానికి సమీపంగా సముద్రంలో దిగేందుకు ప్రణాళికను ఖరారు చేశారు.
మార్చి 17 రాత్రి 11.20 గంటలకు (ET), డ్రాగన్ క్యాప్సూల్ తలుపులు మూసివేశారు. దీంతో వారి తిరుగు ప్రయాణ ప్రక్రియ మొదలైంది. మార్చి 18 తెల్లవారుజామున 1.05 గంటలకు (ET) ఈ క్యాప్సూల్ ISS నుంచి దానంతట అదే విడిపోయింది. వ్యోమాగాముల ఇంటికి తిరిగే వచ్చే అధికారిక యాత్ర మొదలైంది.
దేశదేశాలలోని మీడియా సంస్థలు వీరి తిరుగు ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు నాసా సహకారంతో లైవ్ లు పెట్టాయి.
సునీత విలియమ్స్, విల్మోర్ ప్రయాణంపై నిరంతరం ఊహాగానాలు, విమర్శలు, ప్రతివిమర్శలు, ఖండన మండనల అనంతరం ఎట్టకేలకు వీరి భువి యాత్ర మొదలైంది.
వారిని "వదిలేశారు" "అక్కడే చిక్కుకుపోయారు" అనే ఆరోపణలను స్పెస్ ఎక్స్ సంస్థ, నాసా అధికారలు అనేకసార్లు ఖండించారు.
ఈ విషయమై సునీత విలియమ్స్, విల్మోర్ అంతరిక్షం నుంచే ఈ తరహా వార్తలను ఖండించారు. విధి లేని పరిస్థితుల్లోనే తామిక్కడ చిక్కుకుపోయామని సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ చెప్పారు.
ఇదే సమయంలో, సునీత విలియమ్స్ ఆరోగ్యంపై కూడా అనేక ఊహాగానాలు వచ్చాయి. ఆమె నడక మరిచిపోయారని, ఆమె బరువు తగ్గిపోయారని, ఆమె మొహకవళికలు మారిపోయాయని మీడియాలో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే వాటన్నింటినీ నాసా ఖండించింది. గతంలో కూడా ఇలా అనేక మంది వ్యోమగాములు అనుకోని పరిణామాలతో చిక్కుకుపోయి ఘటనలను ఉదహరించింది.
వీరిని భూమికి తీసుకువచ్చే విషయంలో స్పెస్ ఎక్స్అధినేత ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై కూడా విమర్శలు వచ్చాయి. Crew-9 మిషన్ రాజకీయ వివాదంగా మారింది.
ఏమిటీ Crew-9 మిషన్?
సునీత విలియమ్స్, విల్మోర్ ను అంతరిక్షంలోకి పంపేందుకు పంపిన ఉపగ్రహం. NASA-స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా ఆ మిషన్ ను చేపట్టాయి. వాళ్లను తిరిగి తీసుకువచ్చేందుకు Crew-9 మిషన్ ప్రారంభమైంది. ఇప్పుడది తిరుగు ప్రయాణం చేపట్టింది.
ISSలో సిబ్బంది అందుబాటులో ఉండేలా నాసా ప్రణాళికను రూపొందించింది. Crew-10 మిషన్ లో నలుగురు అంతరిక్షంలోకి వెళ్లారు. నలుగురు తిరిగి వస్తున్నారు. వారిలో సునీత విలియమ్స్, విల్మోర్ ఉన్నారు. ఇది ప్రత్యేకమైన, ఖరీదైన రీటర్న్ మిషన్. సుమారు ఏడాదిన్నర కాలానికి పైగా దీనిపై కసరత్తు సాగింది.
అయితే, ఈ నిర్ణయాన్ని స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. బిడెన్ ప్రభుత్వంపైన, NASA ప్రణాళికపైన ఆరోపణలు చేశారు.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బిడైన్ ప్రభుత్వం ఓడిపోయింది. ట్రంప్ గెలిచిన తర్వాత కూడా వాళ్లిద్దర్నీ తీసుకురావడం ఆలస్యం కావడంతో వీళ్లు సైతం విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ విషయంపై విల్మోర్ స్పందిస్తూ, "ఇలాంటి ప్రతిపాదన గురించి నాకు తెలియదు. కానీ, మస్క్ చెప్పిన దానికి నేను నమ్మకం ఉంచుతాను" అని అన్నారు. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ మిషన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ సారా వాకర్ కూడా మస్క్ చెప్పిన చర్చల్లో తాను భాగం కాలేదని చెప్పారు.
అత్యంత వేగంగా వస్తున్న క్యాప్సూల్..
అంత సవ్యంగా సాగితే సాయంత్రం 5 గంటల సమయంలో (ET) క్రూ డ్రాగన్ క్యాప్సూల్ రీఎంట్రీ కోసం ఇంజిన్లు ఆన్ కానున్నాయి. భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో వ్యోమనౌక విపరీతమైన వేగంతో కదలుతుంది. శబ్ద వేగానికి 22 రెట్లు అధిక వేగంతో కక్ష్య ప్రవేశించడంతో క్యాప్సూల్ బయట వైపు 3,500°F (1,926°C) పైగా వేడెక్కుతుంది.
ఈ దశ చాలా కీలకమైంది. ఆ వేడిని తట్టుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక్కో సందర్భంలో క్యాప్సూల్స్ పేలిపోతుంటాయి. హై టెంపరేచర్, ప్రెజర్ కారణంగా కొన్ని నిమిషాలు కమ్యూనికేషన్ బ్లాక్ అవ్వవచ్చు. నాసా కేంద్రం నుంచి క్యాప్సూల్స్ కి మధ్య ఎటువంటి సమాచార సంబంధాలు ఉండవు. ఈ దశ దాటితే క్యాప్సూల్ క్షేమంగా భూమికి చేరినట్టే అని చెబుతుంటారు.
తర్వాత, క్యాప్సూల్ భూ వాతావరణంలో తిరుగుతున్నప్పుడు రెండు దశల్లో పారాషూట్ల ఓపెన్ అవుతాయి. క్యాప్సూల్ కి ఇవి గొడుగులా ఉంటాయి. దీనివల్ల గరిష్ట వేగం 17,000 mph (27,359 km/h) నుండి 20 mph (32 km/h)కు తగ్గుతుంది.
నిర్ధేశిత ప్రణాళిక ప్రకారం సునీత విలియమ్స్, విల్మోర్, హేగ్, గోర్బునోవ్ లను ఫ్లోరిడా తీరంలో సుమారు 5:57 PM ET సమయంలో సురక్షితంగా దిగాలి. అయితే, ఈ సేఫ్ ల్యాండింగ్ అనేది వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సమయం కూడా అటు ఇటు మారవచ్చు.
సముద్రంలో ల్యాండింగ్ అయిన వెంటనే, స్పేస్‌ఎక్స్ రికవరీ టీమ్ క్యాప్సూల్‌ను వెలికి తీసి, సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమాగాములను బయటకి తీసుకువస్తారు. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. హలికాఫ్టర్లతో పహారా కాస్తున్నారు. పెద్ద సంఖ్యలో ట్రక్కులను మోహరించారు. అంబులెన్స్ లు సిద్ధం చేశారు.
NASA, మిషన్ డీ-ఆర్బిట్ బర్న్ ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
Next Story