జగన్‌కు దమ్ముంటే CEC జ్ఞానేశ్వర్‌పై అభిశంసనకు మద్దతు ఇవ్వాలి
x
వైఎస్ షర్మిల

జగన్‌కు దమ్ముంటే CEC జ్ఞానేశ్వర్‌పై అభిశంసనకు మద్దతు ఇవ్వాలి

ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల డిమాండ్


చీఫ్ ఎలక్షన్ కమీషనర్ (CEC) జ్ఞానేశ్వర్ కుమార్‌పై ఇండియా బ్లాక్ ఎంపీలు తీసుకొచ్చిన అభిశంసన తీర్మానానికి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ప్రకటించాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల డిమాండ్ చేశారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె విజయనగరంలో మాట్లాడారు.

“జగన్‌కు నిజమైన ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఇండియా బ్లాక్ ఎంపీలతో కలిసి సంతకాలు చేయాలి. వైఎస్సార్సీపీ ఎంపీలు ఈ అభిశంసన తీర్మానానికి బహిరంగ మద్దతు తెలపాలి. ఇది జగన్ మోదీకి ‘దత్తపుత్రుడు’ కాదని నిరూపించుకునే అవకాశం” అని షర్మిల స్పష్టం చేశారు.

గతంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఎన్నికల్లో EVMలు మారిపోయాయని, దొంగ ఓట్లు వేశారని, “నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఎక్కడ పోయాయో” అని బీద ఏడుపులు ఏడ్చారని గుర్తుచేస్తూ, షర్మిల మాట్లాడారు. “కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదు, దొంగతనంగా ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పారు కదా? ఇప్పుడు ఆ ఆరోపణలను నిజం చేసుకోవడానికి ఇదే సమయం” అని ఆమె విమర్శించారు.

దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని చేతుల్లో పెట్టుకున్నదని, CEC జ్ఞానేశ్వర్ అవసరమైన చోట దొంగ ఓట్లు జోడిస్తున్నారని, అవసరం లేని చోట ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ షర్మిల వ్యాఖ్యానించారు. “ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విరుద్ధంగా పని చేస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ నిజాయితీగా వ్యవహరిస్తే ఇండియా కూటమి తీర్మానానికి మద్దతు ఇవ్వాలి” అని ఆమె పేర్కొన్నారు.

Read More
Next Story