మీ తల్లితండ్రులను వెంటనే ‘ఆయుష్మాన్’ లో చేర్పించడం ఎలా?
సీనియర్ సిటిజన్ల ఆరోగ్య రక్షణ కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ కింద వారి పేర్లను ఎలా నమోదు చేయాలి, ఇంతకుముందు పేర్లు నమోదు చేసుకున్న వారు...
దేశంలో 70 ఏళ్ల పై బడ్డ వృద్దుల కోసం కేంద్ర ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఇక నుంచి ‘ఆయుష్మాన్ భారత్’ ను విస్తరించనున్నట్లు వెల్లడించింది. ఆదాయంతో సంబంధం లేకుండా వృద్ధులందరికి ఇందులో చోటు కల్పించున్నట్లు పేర్కొంది. ఇంతకుముందు ఈ పథకంలో పేదలు, తక్కువ ఆదాయ ఉన్న ఉద్యోగస్తులు అంటే ఆశ వర్కర్లు వంటి వారికి మాత్రమే అవకాశం ఉండేది. అయితే ఈ నిబంధనలను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సడలించింది. ఈ పథకంలో రిజిస్టర్ అయిన వృద్ధులకు రూ. 5 లక్షల వరకూ ఆరోగ్య రక్షణ బీమా లభిస్తుంది.
పేర్లను ఎలా నమోదు చేయాలంటే..
ఆధార్ కార్డ్ ప్రకారం వయస్సు 70 సంవత్సరాలు లేదా దాటితే www.beneficiary.nha.gov.in అనే వెబ్ సైట్లో లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఆయుష్మాన్ ఆప్’ డౌన్ లోడ్ చేసుకుని తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. మొదట లబ్ధిదారులు ఎవరైన వారి గుర్తింపును కేవలం ఆధార్ ఈ - కేవైసీ ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలి. తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
కుటుంబ సభ్యులు ఎవరైన పేర్లను నమోదు చేయవచ్చా..
అవును.. చేయవచ్చు, తమ తల్లిదండ్రులు ఈ పథకానికి అర్హులు అని అనుకుంటే వెట్ సైట్ లోని ‘ బెనిఫిషియరీ ’ అనే ఐచ్చికంలోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. అయితే దీనికి లబ్ధిదారుడి ఫోన్ నంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. తరువాత మొబైల్ కి వచ్చే ఓటీపీ ద్వారా తదుపరి ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద నమోదైన ఆస్పత్రిలో కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వెళ్లి వారి కుటుంబ సభ్యుల పేరును నమోదు చేసుకోవచ్చు.
‘ఆయుష్మాన్ భారత్’ సమస్యలను పరిష్కరిస్తుందా?
ఈ పథకం కింద నగదురహిత సేవలను అందించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్ రోల్ అయిన ఆస్పత్రులకు సూచించింది. చికిత్సకు అయిన ఖర్చలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అలా కాకుండా ఆస్పత్రులపై ఏవైన ఫిర్యాదులు చేయాలనుకుంటే వెబ్ సైట్ లో గ్రీవెన్స్ అనే ఐచ్చికం ఉంది. అంతేకాకుండా ట్రోల్ ఫ్రీ నెంబర్ 14555 కి కాల్ చేయవచ్చు. మెయిల్, లేఖలు, ఫ్యాక్స్ ద్వారా నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును పరిశీలించి ఆరు గంటల లోపు పరిష్కరించేలా సమయాన్ని నిర్దేశించారు.
ఇంతకుముందు పేర్లు నమోదు చేసుకున్నా, మరోసారి ధృవీకరించుకోవాలా?
ఇంతకుముందే ఈ పథకంలో తమ పేర్లను నమోదు చేసుకున్న లబ్ధిదారులు మరోసారి తమ పేరును ఆధార్ ఈ కేవైసీ ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.
ఆయుష్మాన్ భారత్ లో చేరిన ఆస్పత్రులను గుర్తు పట్టడం ఎలా ?
ఆయుష్మాన్ భారత్ కింద పేర్లను నమోదు చేయబడిన ఆస్పత్రుల జాబితాను ‘ www.dashboard.pmjay.gov.in’లో చూడవచ్చు. సెప్టెంబర్ 30 నాటికి ఈ పథకం కింద సేవలు అందించడానికి 30 వేల ఆస్పత్రులు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. ఇందులో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు సైతం ఉన్నాయి. ఈ పథకాన్ని పూర్తిగా నేషనల్ హెల్త్ అథారిటీ పర్యవేక్షిస్తుంది. ఆరోగ్యం అనేది పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన అంశమని రాజ్యాంగ చెబుతోంది. అయితే స్టేట్ హెల్త్ ఏజెన్సీలు కచ్చితంగా ఆయుష్మాన్ భారత్ కింద తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
చికిత్స ఖర్చు రూ. 5 లక్షల కంటే ఎక్కువ మొత్తం అయితే పరిస్థితేంటీ?
లబ్ధిదారుడు మొదట ఆస్పత్రిలో చేరే సమయంలోనే తన వ్యాధికి చికిత్స చేస్తుందో లేదో కనుగొనాలి. మొదటి దశలోనే చికిత్స మొత్తం ప్రభుత్వం రూ. 2 లక్షలుగా నిర్ణయించింది. చాలా అనారోగ్య సమస్యలకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇంతకు మొత్తం మించితే ఎలాగూ రూ. 5 లక్షల కవరేజీ వస్తుంది. ఖర్చు అంతకుమించితే రాష్ట్రీయ ఆరోగ్య నిధి కింద రూ. 15 లక్షల వరకూ ఆర్థికసాయం తీసుకునే వెసులుబాటు ఉంది.
Next Story