
మార్కాపురం వద్ద 15 మంది ప్రయాణీకుల సజీవ దహనం
మార్కాపురం సమీపంలో పెను విషాదం: టిప్పర్-బస్సు ఢీకొని 15 మంది సజీవ దహనం
కర్నూలు రోడ్డు ప్రమాద ఘటన మరువక మునుపే, మార్కాపురం జిల్లాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ బలంగా ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. ఇందులో సుమారు 15 మంది ప్రయాణీకుల సజీవ దహనం మంది సజీవ దహనం అయ్యారు. గురువారం ఉదయం 6:00 నుండి 6:30 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
అతివేగంగా వస్తున్న టిప్పర్, మలుపు తిరుగుతున్న బస్సును ఢీకొనడం వల్ల మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుండి పామూరు వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు, మరో టిప్పరు ఢీ కొన్నాయి.
15 మంది ప్రయాణీకులు సజీవ దహనం సజీవ దహనం అయ్యారు. అనేక మంది గాయపడ్డారు. వీరిని మార్కాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంటల ధాటికి బస్సు, టిప్పర్ రెండు కూడా పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్లు సమాచారం. బస్సు వెనుక భాగంలో కూర్చున్న వారు మంటల నుండి బయటపడలేక మరణించగా, ముందు భాగంలో ఉన్నవారు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మార్కాపురం జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల్లో ఎక్కువ మంది కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు పూర్తి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

