లాస్ ఏంజెల్స్ భారీ అగ్నిప్రమాద దయనీయ దృశ్యాలు
x

Photo source: PTI

లాస్ ఏంజెల్స్ భారీ అగ్నిప్రమాద దయనీయ దృశ్యాలు

కౌంటీలోని ప్యాలిసేడ్స్, ఈటన్‌ ప్రాంతాల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చనిపోయారని అధికారులు వెల్లడించారు.


అమెరికాలోని లాస్‌ఏంజెల్స్(Los Angele), కాలిఫోర్నియా(California) ప్రాంతాల్లో కార్చిచ్చు(wildfire) సంభవించి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. తొలుత దక్షిణ కాలిఫోర్నియాలో అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు లాస్ ఏంజిల్స్‌ నగరానికి వ్యాపించాయి. వెయ్యికి పైగా భవంతులు దగ్నమయ్యాయి. సుమారు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజా సమాచారం మేరకు (జనవరి 14వ తేదీ దాకా) ఈ భారీ అగ్ని ప్రమాదంలో కనీసం 25 మంది మరణించినట్లు అధికారులు తేల్చారు. ఇంకా చాలా మంది జాడ తెలియాల్సి ఉందని చెప్పారు.

బాధితులకు అండగా గవర్నర్

కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ అగ్నిప్రమాద బాధితులకు బాసటగా నిలిచారు. అగ్నిప్రమాద బాధితులను లక్ష్యంగా చేసుకొని వాళ్ల నివాసాలను మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు ఇళ్లను కొనుగోలు చేసేందుకు యత్నించే రియల్ ఎస్టేట్ దళారీలకు అడ్డుకట్ట వేశారు. మూడు నెలల పాటు ఇళ్లకు తక్కువ ధర ఆఫర్ చేయకుండా ఆయన ఆర్డర్ పాస్ చేశారు.

అగ్నిప్రమాదాల అనంతరం అక్కడి పరిస్థితులపై ‘ది ఫెడరల్ తెలంగాణ’ ఫోటో ఫీచర్‌ మీ కోసం..


ప్యాసిఫిక్ ప్యాలిసేడ్స్ పక్కన ఉన్న అగ్నిప్రమాదం తర్వాత..


మండెవిల్లే కన్యాన్ ప్రాంతంలో ప్యాలిసేడ్స్ అగ్నిప్రమాదాన్ని ఆర్పేందుకు యత్నిస్తున్న ఫైర్ ఫైటర్స్


అగ్నిప్రమాదం కారణంగా కోల్పోయిన ఇంటిన చూసి కన్నీరు పెడుతున్న వ్యక్తి..


గ్రెనడా హిల్స్ ప్రాంతంలో..


పసిఫిక్ ప్యాలిసేడ్స్ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని చూపించే మరొక చిత్రం


హాలీవుడ్ హిల్స్ ప్రాంతంలో హెలికాప్టర్ నుంచి నీళ్లు వదులుతున్న హెలికాప్టర్


కాలిఫోర్నియాలోని ఆల్టాడీనా వద్ద ఈటన్ అగ్నిప్రమాదాన్ని నియంత్రించేందుకు ఎయిర్ ఫైటర్


మండెవిల్లే కన్యాన్‌లో ప్యాలిసేడ్స్ అగ్నిప్రమాదాన్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ ఫైటర్


మాలిబు ప్రాంతంలో కాలిపోయిన ఇళ్లు


ప్యాసిఫిక్ ప్యాలిసేడ్స్ బౌల్ మొబైల్ ఎస్టేట్స్ వద్ద ప్యాలిసేడ్స్ అగ్నిప్రమాదం పూర్తిగా కాలిపోయిన ఇళ్లు, వాహనాలు

Read More
Next Story