హైరిస్క్‌ కేసుల హెల్త్‌ స్క్రీనింగ్‌
x

హైరిస్క్‌ కేసుల హెల్త్‌ స్క్రీనింగ్‌

జులై నాటికి 66 లక్షల మందికి పరీక్షలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం.


రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వినూత్న ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంది. సోమవారం సచివాలయంలో జనాభా నిర్వహణ, పౌష్టికాహారం, సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జులై నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్‌ను పూర్తి చేయాలని టార్గెట్ విధించారు.

సంజీవని’– ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయాలని సీఎం సూచించారు. కేర్ అండ్ గ్రో విధానం ద్వారా తల్లీబిడ్డల పెరుగుదల, టీకాలు, ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల (Normal Deliveries) సంఖ్య పెరిగేలా అవగాహన కల్పించాలని, అనవసర సిజేరియన్లను నియంత్రించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ఎయిడ్స్ ఫ్రీ స్టేట్ గా ప్రకటించేలా కఠినమైన కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు.

జూన్ నాటికి సమగ్ర ఫ్యామిలీ కార్డులు

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలను పారదర్శకంగా అందించేందుకు ఫ్యామిలీ కార్డు బెనిఫిట్ సిస్టమ్ ను తీసుకువస్తున్నారు. జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఫ్యామిలీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనివల్ల సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరం కానుంది.

పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ – విజన్ 2047

వృద్ధాప్య సమస్యలను ముందే గుర్తించిన సీఎం, జనాభా సమతుల్యత దెబ్బతినకుండా మార్చి నాటికి ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని తీసుకువస్తామని ప్రకటించారు. 60 ఏళ్లు దాటితే ఏ పనీ చేయలేము అనే ప్రజల ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలని, వృద్ధులను కూడా సమాజంలో భాగస్వాములను చేయాలని చెప్పారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని విద్యాశాఖకు దిశానిర్దేశం చేశారు.

Read More
Next Story