సగం మంది భారతీయులు టీవీల ముందే, ఎందుకంటే..
x
ప్రత్యక్ష ప్రసారం చూసిన వారు సంఖ్య

సగం మంది భారతీయులు టీవీల ముందే, ఎందుకంటే..

క్రికెట్ ఇప్పుడు కేవలం ఆట మాత్రమే కాదు, కోట్ల మంది భారతీయుల జాతీయ భావోద్వేగమైందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.


టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో టీమ్ ఇండియా సృష్టించిన విధ్వంసం మైదానంలోనే కాదు, డిజిటల్ స్క్రీన్ల పైనా రికార్డులను తిరగరాసింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు దేశం మొత్తం ఒక్కటైనట్టు కనిపిస్తోంది.

77.8 కోట్ల మంది లైవ్ వ్యూయర్‌షిప్: సరికొత్త రికార్డు!

భారతదేశ జనాభా సుమారు 130 కోట్లు అనుకుంటే, అందులో సగం మంది అంటే దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.


జియో హాట్ స్టార్ లైవ్ స్క్రీన్ పై చూపిన అధికారిక ప్రసార కర్తల గణాంకాల ప్రకారం, రాత్రి 10.20 గంటలకు 73 కోట్ల మంది (Concurrent Viewers) ఈ మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించారు. రాత్రి11 గంటల ప్రాంతంలోనూ 77.8 కోట్ల మంది చూస్తున్నారు. ఈ లెక్క ప్రతి నిమిషానికీ పెరుగుతూ వచ్చింది. 9.45 గంటలకు 62 కోట్లు ఉన్నది పావుగంటలో 65 కోట్లు దాటింది.

ఇది గతంలో ఉన్న అన్ని వ్యూయర్‌షిప్ రికార్డులను బద్దలు కొట్టింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లేదా గత ఐపీఎల్ ఫైనల్స్ రికార్డులను ఈ సంఖ్య సునాయాసంగా అధిగమించింది.

జియో హాట్ స్టార్ లైవ్ స్క్రీన్ పై చూపిన అధికారిక ప్రసార కర్తల గణాంకాల ప్రకారం, రాత్రి 10.20 గంటలకు 69.9 కోట్ల మంది (Concurrent Viewers) ఈ మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించారు. ఈ లెక్క ప్రతి నిమిషానికీ పెరుగుతూ వచ్చింది. 9.45 గంటలకు 62 కోట్లు ఉన్నది పావుగంటలో 65 కోట్లు దాటింది. వీక్షకుల సంఖ్య ప్రతి పది నిమిషాలకూ పెరుగుతూనే వచ్చింది.
ఇది గతంలో ఉన్న అన్ని వ్యూయర్‌షిప్ రికార్డులను బద్దలు కొట్టింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లేదా గత ఐపీఎల్ ఫైనల్స్ రికార్డులను ఈ సంఖ్య సునాయాసంగా అధిగమించింది.
ఎందుకీ ఉత్కంఠ?
భారత యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడటం, నాకౌట్ మ్యాచుల్లోనే అత్యంత వేగంగా (7.2 ఓవర్లలో) వంద పరుగుల మార్కును అందుకోవడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. సంజు శాంసన్ వరుసగా మూడో హాఫ్ సెంచరీ సాధించడం, ఇషాన్ కిషన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడుతుండటంతో భారత్ ఈసారి కప్పు గెలవడం ఖాయమనే నమ్మకంతో సగం భారతం టీవీల ముందే తిష్ట వేసింది.
డిజిటల్ విప్లవానికి అద్దం
ఒకప్పుడు రేడియోల్లో కామెంటరీ విన్న భారతీయులు, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు మరియు స్మార్ట్ టీవీల ద్వారా సెకనుకు 62 కోట్లకు పైగా వ్యూస్‌తో అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ విప్లవాన్ని చాటుతున్నారు. మ్యాచ్ ముగిసే సమయానికి ఈ సంఖ్య 70 కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు భావించారు.
గతంలో ఎన్నడూ లేనంతగా...
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల వ్యూయర్‌షిప్ రికార్డులు ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటాయి. కానీ వాటిని అధిగమించి తాజా లెక్కలు చూపుతున్నాయి. గతంలో జరిగిన ప్రధాన మ్యాచ్‌ల లైవ్ వ్యూయర్‌షిప్ ను మించి ఇప్పుడు జనాలు ప్రత్యక్ష ప్రసారం చూశారు.
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌ల లైవ్ వ్యూయర్‌షిప్ రికార్డులు..
2025 ఛాంపియన్స్ ట్రోఫీ (ఇటీవలే జరిగింది)
దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జియో హాట్‌స్టార్ (JioHotstar) ప్లాట్‌ఫామ్‌పై ఏకకాలంలో 60.2 కోట్ల మంది వీక్షించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. విరాట్ కోహ్లీ తన 51వ సెంచరీ పూర్తి చేసి విన్నింగ్ షాట్ కొట్టిన సమయంలో ఈ రికార్డు నమోదైంది.

ప్రఖ్యాత ఐరిష్ నాటకకర్త, నోబెల్ విజేత జార్జ్ బెర్నార్డ్ షా ఒకప్పుడు క్రికెట్ పై విసిరిన వ్యంగ్యాస్త్రం "క్రికెట్ అనేది 11 మంది మూర్ఖులు ఆడే ఆట.. దానిని 11 వేల మంది మూర్ఖులు చూస్తారు". ఇప్పుడు దానికీ దీనికి పోటీ లేదు, పొంతనా లేదు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, కోట్ల మంది భారతీయుల జాతీయ భావోద్వేగమని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
Read More
Next Story