
నేటీ నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ సవరణ రేట్లు
చవకగా లభించనున్న కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు
జీఎస్టీ తరువాత తరం సంస్కరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచి దేశంలో సవరించిన జీఎస్టీ దేశంలో అమలుకానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా ఆత్మనిర్భరతకు, స్వదేశీకి తొలి అడుగు ఈ సవరణ.
తగ్గించిన కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశీయ బడ్జెట్ లో ఇచ్చిన ఆదాయపన్ను మినహాయింపును రూ. 12 లక్షలకు పెంచడంతో పాటు జీఎస్టీ పొదుపు పండగ లాంటి రెండు డబుల్ బొనాంజ ప్రజలకు లభించిందని ఆయన అన్నారు.
‘‘ఇప్పుడు జీఎస్టీలో 5 శాతం, 18 శాతం పన్ను స్లాబ్ లు మాత్రమే ఉంటాయి. చాలా రోజువారీ వస్తువులు చౌకగా మారతాయి. ఆహారపదార్థాలు, మందులు, సబ్బు, బ్రష్, పేస్ట్, ఆరోగ్యం, జీవిత బీమా వంటి అనేక వస్తువులు, సేవల వంటివి పన్ను రహితంగా ఉంటాయి. వీటిపై కేవలం 5 శాతం జీఎస్టీ మాత్రమే వసూలు చేస్తారు’’ అని ప్రధాని మోదీ అన్నారు.
జీఎస్టీ రేట్ల తగ్గింపు ఐటీ మినహయింపు పరిమితి పెంపు వల్ల కుటుంబాలు ఏటా రూ. 2.5 లక్షల కోట్లు ఆదా చేయవచ్చని మోదీ అన్నారు.
‘‘ఇప్పుడు పేదలు, మధ్య తరగతి వారు రెట్టింపు బోనాంజా పొందుతారు. జీఎస్టీ తగ్గింపుతో వారు తమ కలలను నెరవేర్చుకోవడం సులభం అవుతుంది’’ అని మోదీ అన్నారు.
రెండు పన్ను శ్లాబులు..
కేంద్ర, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ నవరాత్రి మొదటి రోజు అయిన సెప్టెంబర్ 22 నుంచి వస్తువులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించాలని నిర్ణయించింది.
సవరించిన జీఎస్టీ రేట్ల ప్రకారం.. వంటగదిలోని ప్రధాన వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ దాదాపు 375 వస్తువులు చౌకగా మారనున్నాయి. నెయ్యి, పన్నీర్ వెన్న, నామ్ కీన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీములు వటి సామూహిక వినియోగ వస్తువులు, టీవీ, ఎసీ, వాషింగ్ మెషిన్లు వంటి ప్రజలకు చౌవకగా మారతాయి. జీఎస్టీ సవరణ దృష్ట్యా అనేక ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఇప్పటికే ధరల తగ్గింపులు ప్రకటించాయి.
చాలామందులు, ఫార్ములేషన్లపై జీఎస్టీ గ్లూకో మీటర్లు, డయాగ్నిస్టిక్ కిట్ లు వంటి వైద్యపరికరాలపై 5 శాతానికి తగ్గించారు. అలాగే సిమెంట్ పై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీనితో గృహ నిర్మాణదారులు ప్రయోజనం పొందుతారు.
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను ప్రజలకు కచ్చితంగా బదిలీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఫార్మాసిస్టులు తమ ఎంఆర్పీ ని సవరించాలని లేదా తక్కువ రేటుకు విక్రయించాలని ఆదేశించింది.
సేవలకు సంబంధించి హెల్త్ క్లబ్ లు, సెలూన్ లు, ఫిట్ నెస్ సెంటర్లు, యోగా మొదలైన వాటితో సహ అందం, శారీరక శ్రేయస్సు సేవలపై జీఎస్టీని ఇన్ పుట్ క్రెడిట్ లపై 18 శాతం పై 5 శాతానికి తగ్గించారు.
హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్ లు వంటి రోజువారీ వినియోగ ఉత్పత్తులపై పన్నును 12-18 శాతం నుంచి 5 శాతానికి చేరాయి.
టాల్కమ్ పౌండర్, ఫేస్ పౌడర్, షేవింగ్ క్రీమ్, ఆఫ్టర్ షేవ్ లోషన్ వంటి ఇతర రోజువారీ వినియోగ వస్తువల ధరలు కూడా 18 శాతం 5 శాతానికి తగ్గే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి స్వదేశీ పిచ్..
ప్రధానమంత్రి ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇందులో స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని అన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి శక్తినిచ్చిన విధంగానే దేశ శ్రేయస్సుకు అవసరమైన బలాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
‘‘మనం ప్రతి ఇంటిని స్వదేశీ కేంద్రంగా మార్చుకోవాలి. ప్రతి దుకాణాన్ని స్వదేశీ వస్తువులతో అలంకరించాలి’’ అని ఆయన అన్నారు. తన ప్రభుత్వం రూ. 12 లక్షల వరకూ వార్షిక ఆదాయంపై ఆదాయ పన్ను మినహాయింపును పెంచిన తరువాత వెంటనే జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడం ప్రజలకు డబుల్ బోనాంజ అని ఆయన అన్నారు. ఖర్చులు తగ్గించడం, పొదుపును పెంచడం ద్వారా వారి కలలను సాకారం చేసుకోవడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేసినప్పుడూ ‘స్వావలంబన భారత్’ అనే కల సాకారం అవుతుందని, తయారీ పెంచాలని పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన రాష్ట్రాలను కోరారు.
నాగరిక్ దేవో భవ మంత్రం..
భారత్ లో తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా ప్రతి భారతీయుడి స్ఫూర్తిగా ఉండాలని అది దేశ అభివృద్ది వేగాన్ని పెంచుతుందని ప్రధానమంత్రి చెప్పారు.
ఆయన జాతినుద్దేశించి 19 నిమిషాలకు పైగా ప్రసంగించారు. సవరించిన జీఎస్టీ రేట్లు తన ప్రభుత్వ ‘‘నాగరిక్ దేవో భవ’’ (పౌరులు దేవుళ్లలాంటి వారు) మంత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయని, ఇది నిర్మాణ, ఆరోగ్య రంగాలలో ఖర్చులను తగ్గించడంతో పాటు రోజువారీ వస్తువుల ధరలను తగ్గిస్తుందని మోదీ అన్నారు. రేపటి నుంచి ఇది జీఎస్టీ పొదుపు పండుగలా ఉంటుందని, ఇది ప్రతి కుటుంబంలో ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు.
‘‘నవరాత్రి మొదటి రోజున దేశం ఆత్మ నిర్భర భారత్ కోసం ఒక ముఖ్యమైన పెద్ద అడుగు వేయబోతోంది. రేపు సూర్యోదయంతో, తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తాయి. రేపటి నుంచి పొదుపు పండగ ప్రారంభం అవుతుంది’’ అన్నారు.
తదుపరి జీఎస్టీ సంస్కరణలకు ఆయన అందరినీ అభినందించారు. ‘‘ఈ సంస్కరణలు భారత వృద్ది కథను వేగవంతం చేస్తాయి. వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతాయి. పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి’’ అని మోదీ అన్నారు.
ఒకే దేశం.. ఒకే పన్ను..
జీఎస్టీ అనేది ఒకే దేశం- ఒకే పన్ను కలను సాకారం చేసిందని ఆయన అన్నారు. పన్నులు వ్యాపారాలు, వినియోగదారులకు ఎలా కష్టాలు సృష్టించిందో మోదీ హైలైట్ చేశారు.
జీఎస్టీ ఎంఎస్ఎంఈలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని చెప్పారు. దేశంలో తయారైన వస్తువులు, దేశ ఆర్థిక శక్తి వల్ల సరిగా ఉపయోగించుకోలేకపోయామని, దేశీయ వ్యాపార వైభవాన్ని తిరిగి సాధించడానికి కృషి చేయాలని కోరారు.
భారత సూక్ష్మ, చిన్న, కుటీర పరిశ్రమలు స్వావలంబన భారత్ ను నిర్మించడంలో కీలకపాత్ర పోషించాయి. దేశంలో వీలైనంత ఎక్కువ తయారీకి ప్రధాని పిలుపునిచ్చారు.
ప్రజలు వస్తువులను సెలెక్ట్ చేసుకునే ముందు స్పృహాతో ఉండాలని కోరారు. ప్రజలు తరుచుగా ఉపయోగించే దువ్వెనల మూలం గురంచి వారు తెలుసుకోరని అన్నారు.
విదేశీ మూలాల వస్తువులు తెలియకుండానే ప్రజల రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారాయని, స్వదేశీ నేపథ్యం ఉన్న వస్తువులను మాత్రమే కొనాలని అన్నారు. జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలను వ్యాపార రంగం ప్రజలకు బదిలీ చేయడంపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
ఆర్థిక వ్యవస్థకు రెండు లక్షల కోట్లు...
సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చే జీఎస్టీ విధానం వల్ల ఆర్థిక వ్యవస్థలోకి రెండు లక్షల కోట్లు చొప్పిస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
ప్రజల చేతిలో నగదు మిగిలిపోతుందని, పాత విధానం వలన ఇవి పన్నులా మారిపోయే ఉండేదని అన్నారు. ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ స్లాబ్ కింద ఉన్న 99 శాతం వస్తువులు 5 శాతానికి మారతాయి. ఈ సవరణ వల్ల 28 శాతం పన్ను స్లాబ్ కింద ఉన్న 90 శాతం వస్తువులు 18 శాతం స్లాబ్ లోకి వస్తాయి.
Next Story