ట్రంప్ 2.0.. అదో బిలియనీర్ల క్లబ్.. ఎవరు వారు.. వారి పాత్ర ఏంటీ?
x

ట్రంప్ 2.0.. అదో బిలియనీర్ల క్లబ్.. ఎవరు వారు.. వారి పాత్ర ఏంటీ?

ఎన్నికల్లో మల్టీనేషనల్ కంపెనీలను ఎదురించిన బిలియనీర్ల బృందం


అమెరికా 47 అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన ప్రమాణ స్వీకారంలో చాలా మంది బిలియనీర్లు ముందు వరుసలో కనిపించారు. వారంతా మున్ముందు ఆయన పరిపాలనలో భాగం కాబోతున్నారు. ఎన్నికల సందర్భంగా చాలా ఎంఎన్సీలు డెమోక్రాటిక్ పార్టీకి అండగా నిలబడగా, కొంతమంది బిలియనీర్లు మాత్రం ట్రంప్ కు అండగా ఉన్నారు. అయితే వీరు అమెరికన్ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి పనిచేస్తారా? శ్రామిక కుటుంబాలకు సాయం చేయడానికి విధానాలను రూపొందిస్తారా అనే ప్రశ్నలు కొంతమంది లేవనెత్తుతున్నారు.

విపత్తు రెసీపీ..
బిలియనీర్లు శ్రామిక కుటుంబాల కోసం ఆర్థిక విధానాన్ని రూపొందించడం విపత్తు రెసీపీ అని అమెరికన్స్ ఫర్ టాక్స్ ఫెయిర్ నెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ కాస్ అన్నారు. సంపన్నులు, మంచి అనుబంధం ఉన్నవారికే ప్రయోజనం చేకూర్చడానికి ఆర్థిక వ్యవస్థను అనుకూలంగా వక్రీకరిస్తారన్నారు.
అలాగే సామాజిక భద్రత మెడికేర్, మేడికేడ్, హౌసింగ్, విద్య ఇతర సేవలు సగటు అమెరికన్లకు ముఖ్యమైనవి. ట్రంప్ ప్రతిపాదిత సాలిడ్ గోల్డ్ ఆర్థిక బృందం తమ కోసం, వారి స్నేహితుల కోసం దాదాపు 5 ట్రిలియన్ల అదనపు రుణం పెంచడానికి చర్యలు తీసుకుంటుందన్నారు.
ట్రంప్ బృందం..
ఇలాన్ మస్క్: ట్రంప్ గ్రూపులో అత్యంత ప్రముఖుడు ఇలాన్ మస్క్, ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుడు. ఆయన ట్రంప్ కోసం 260 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం టెస్లా సీఈఓ, వివేక్ రామస్వామితో పాటు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో కొత్త డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియోన్సీని పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారు.
వివేక్ రామస్వామి: భారతీయ అమెరికన్ అయినా రామస్వామి బయోటెక్ వ్యవస్థాపకుడు. రచయిత, అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. వివేక్ హార్వర్డ్, యేల్ యూనివర్శిటీల్లో చదువుకున్నారు. బయోటెక్ ను స్థాపించడానికి ముందు పెట్టుబడి బ్యాంకింగ్ లో తన కేరీర్ ను ప్రారంభించారు. ప్రస్తుతం మస్క్, రామస్వామికి డీఓజీఈకి అధిపతిగా బాధ్యతలు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన ఓహియో గవర్నర్ పదవి కోసం ప్రచారాన్ని ప్రారంభించవచ్చని తెలుస్తోంది.
హోవార్డ్ లుట్నిక్: వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్.. కాంటర్ ఫిట్జ్ గెరాల్డ్ చైర్మన్, సీఈఓ లుట్నీక్ ను వాణిజ్య కార్యదర్శి పదవికి ట్రంప్ నామినేట్ చేశారు. అలాగే ట్రంప్ పరివర్తన బృందానికి కో -చైర్ గా పనిచేశాడు. ట్రంప్ ప్రతిపాదిస్తున్న విదేశీ సుంకాలను ఆయన గట్టి మద్దతుదారుడి ఉన్నారు. అతని నికర సంపద 2 బిలియన్ డాలర్లు.
స్కాట్ బెసెంట్: ఒక బిలియన్ నికర సంపద కలిగిన హెడ్జ్ ఫండ్ మేనేజర్, బెసెంట్ ట్రేజరీ సెక్రటరీ పదవికి నామినేట్ అయ్యారు. ఆయన రాబోయే నాలుగు సంవత్సరాలలో ఫెడరల్ వార్షిక బడ్జెట్ లోటును సగానిపైగా లేదా సుమారు ట్రిలియన డాలర్లకు తగ్గించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు.
పాల్ అట్కిన్స్: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ కమీషన్ చైర్ కు ట్రంప్ నామినేట్ అయ్యాడు. ఆయన ఒక సంపన్న కుటుంబంలో వివాహాం చేసుకోవడం ద్వారా బిలియనీర్ అయ్యాడు. క్రిప్టో కరెన్సీకి బలమైన మద్దతుదారు. వ్యాపారాలు, మార్కెట్లను నియంత్రించడానికి గతంలో ఎస్ఈసీకి కమిషనర్ గా పని చేశాడు.
కెల్లి లోఫ్ఫర్ల్ : కెల్లి ఆమె భర్త న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాతృసంస్థలో 500 మిలియన్ల వాటా ఉంది. ప్రస్తుతం ఆయనను స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అధిపతిగా ట్రంప్ నామినేట్ చేశారు.
ఇతర మద్ధతుదారులు..
తిమెతి మిల్లన్: ఓ శతాబ్ధానికి పైగా అమెరికన్ సంపదకు వారసుడు. లో ఫ్రొఫైల్ ను నిర్వహిస్తారు. ట్రంప్ కు 76. 5 మిలియన్ల విరాళంగా ఇచ్చారు.
లిండా మెక్ మాన్: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్ మెంట్ నిర్వహిస్తారు. దాన్ని బిలియన్ డాలర్ల వ్యాపారంగా తీర్చిదిద్దిన వ్యక్తులు. ట్రంప్ ప్రచారానికి 16 మిలియన్ డాలర్లు అందించారు.
డయాన్ హెండ్రీక్స్: అమెరికాలో అత్యంత ధనిక మహిళా. తన సొంతంగా వ్యాపార సామ్రాజ్యం నిర్మించింది. వార్షిక టర్నోవర్ 20 బిలియన్ డాలర్లుగా ఉంది. ట్రంప్ కోసం 6. 3 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు.
వీరే కాకుండా మిరియం అడెల్సన్, కెల్సీ వారన్, రాబర్ట్ ఉడీ జాన్సన్, కామెరాన్ అండ్ టైలర్ వింక్లెవోస్ వంటి బిలియనీర్లు ట్రంప్ బృందంలో ఉన్నారు.


Read More
Next Story