పేకాట బాకీ, పేలిన తుపాకీ..
x
ప్రతీకాత్మక చిత్రం

పేకాట బాకీ, పేలిన తుపాకీ..

చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. పేకాట బాకీ వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది.


చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. పేకాట బాకీ వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని చిత్తూరు రూరల్ మండలం పరిధిలో ఉన్న తుమ్మిందపాళ్యంలో చోటుచేసుకుంది.

సమాచారం ప్రకారం, గ్రామంలో పేకాట ఆడుతున్న సమయంలో ఇద్దరు స్నేహితుల మధ్య పాత బాకీ విషయంలో వాగ్వాదం ప్రారంభమైంది. మాటమాట పెరిగి ఘర్షణగా మారింది. ఆగ్రహంతో ఢిల్లీ బాబు నాటు తుపాకీతో సాయికుమార్‌పై కాల్పులు జరిపాడు.

తీవ్రంగా గాయపడిన సాయికుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పేకాట బాకీ వివాదమే హత్యకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More
Next Story