
అమరావతిలో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్-2
నిర్మాణం కోసం రూ.595.01 కోట్లకు పోస్ట్-ఫాక్టో ఫైనాన్స్ అనుమతి.
అమరావతిని ముంపు నుంచి రక్షించేందుకు రెండో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి పోస్ట్-ఫాక్టో ఫైనాన్స్ అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి 2025 నవంబర్‌లో రూ.595.01 కోట్లకు ప్రభుత్వం ఆడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. కానీ ఫైనాన్స్ శాఖ అంగీకారం లేకుండా ఈ ఆదేశాలు అప్పట్లో ఇచ్చింది. ఫైనాన్స్ అనుమతులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినందున బిల్లులు చెల్లించేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో అమరావతి అభివృద్ధి సంస్థ (ADCL) అభ్యర్థన మేరకు ప్రత్యేక జీవో జారీ అయింది. ఇది కొన్ని షరతులతో (ధరల సర్దుబాటు, టెండర్ ప్రీమియం వంటివి నియంత్రించడం) ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలో ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్-2 సామర్థ్యం: 8400 క్యూసెక్స్. నిర్మాణం కోసం ప్యాకేజ్ XXXXX కింద రూ.595.01 కోట్లకు గతంలోనే ఆడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. ఈ మొత్తం సర్వే, ఇన్వెస్టిగేషన్, డిజైన్, నిర్మాణ, టెస్టింగ్, కమిషనింగ్, 15 సంవత్సరాల ఆపరేషన్, మెయింటెనెన్స్‌తో కూడుకున్నది.
సాధారణంగా ప్రభుత్వ వ్యవహారాల్లో ఇలాంటి అనుమతులు అత్యవసర సందర్భాల్లో లేదా పొరపాటున ముందు అనుమతి తీసుకోకపోతే వస్తాయి. కానీ చట్టబద్ధంగా ఆ తర్వాత సరిచేస్తారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (CRDA) మంత్రిత్వ శాఖ జీ.ఓ.ఆర్టీ నెం.184, తేది.16.02.2026 ద్వారా ఈ ఆదేశాలు జారీ చేశారు. గతంలో 12.11.2025న జీ.ఓ.ఆర్టీ.నెం.1231 ద్వారా ఈ సాంక్షన్ మంజూరైంది. అయితే ఫైనాన్స్ శాఖ కన్‌కరెన్స్ లేకుండా ఆదేశాలు జారీ కావడంతో పనుల బిల్లుల చెల్లింపుల సాఫీగా కొనసాగించడానికి ADCL చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఫైనాన్స్ కన్‌కరెన్స్ కోసం అభ్యర్థించారు.
ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత పోస్ట్-ఫాక్టో ఫైనాన్స్ కన్‌కరెన్స్ మంజూరు చేసింది. ఈ అనుమతి కింది కొన్ని షరతులు విధించింది.
ఎస్టిమేట్ దశలో ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ కోసం ఎల్‌ఎస్ (లంప్ సమ్) ప్రొవిజన్ చేర్చరాదు.
ప్రారంభ ఎస్టిమేట్స్‌లో టెండర్ ప్రీమియం కోసం ఎల్‌ఎస్ ప్రొవిజన్ చేర్చరాదు.
ఎల్‌ఎస్ ఐటెమ్స్‌పై ఖర్చు నిజమైన ఖర్చులకు మాత్రమే పరిమితం చేయాలి. సేవింగ్స్‌ను మరెక్కడికీ మళ్లీచరాదు.
నాన్-ఎస్‌ఎస్‌ఆర్/ఎస్‌ఒఆర్ ఐటెమ్స్ రేట్లను నిర్మాణం మొదలుపెట్టే ముందు సమర్థ అధికారి ఆమోదించాలి.
అన్ని డిజైన్లు, డ్రాయింగ్‌లను నిర్మాణానికి ముందు సమర్థ అధికారి ఆమోదం తప్పనిసరి.
ఈ ఆర్డర్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ U.O. Note.FIN01-FMU/77/2025-FMU-EFS-MAUD (కంప్యూటర్ నం: 3069269), తేది.13.02.2026 ద్వారా కన్‌కరెన్స్‌తో జారీ అయింది.

