మృతదేహాలతో కువైట్‌ నుంచి కొచ్చి చేరుకున్నప్రత్యేక విమానం
x

మృతదేహాలతో కువైట్‌ నుంచి కొచ్చి చేరుకున్నప్రత్యేక విమానం

కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో ప్రత్యేక విమానం కొచ్చి చేరుకుంది.


కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృత దేహాలను తీసుకుని భారత వైమానిక దళ ప్రత్యేక విమానం శుక్రవారం కొచ్చిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ 31 మృతదేహాలను అప్పగించాక, అదే విమానం న్యూఢిల్లీకి బయలుదేరింది. 31 మృతదేహాల్లో 23 మంది కేరళీయులు, ఏడుగురు తమిళులు, కర్ణాటకకు చెందిన ఒకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కావడంతో విమానం ఢిల్లీకి వెళ్లిపోయింది.

ఘటన ఎలా జరిగింది?

కువైట్‌లోని మంగాఫ్‌ ప్రాంతంలో ఉన్న భవనంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 195 మంది కార్మికులు ఉంటున్న ఈ భవనంలో ఓ వంట గదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో మొత్తం 42 మంది భారతీయులు చనిపోయారు. వీరిలో కేరళ, తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారితో పాటు ఉత్తరాల రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. మరికొంత మంది పాకిస్తాన్, ఫిలిపినో, ఈజిప్షియన్. నేపాల్ దేశాలకు చెందిన వారు.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం..

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా మృతుల కుటుంబసభ్యులకు రూ. 5 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ. లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేరళలోని ప్రముఖ వ్యాపారులు MA యూసుఫ్ అలీ, రవి పిళ్లై ఉదారతను చాటుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను యూసుఫ్ అలీ రూ. 5 లక్షల చొప్పున, రవి పిళ్లై రూ. 2 లక్షలు చొప్పున అందజేయనున్నారు.

Read More
Next Story