
ఒడిశా: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం
ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల అరెస్టు
ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. కేంద్రపారా జిల్లాలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఉపాధ్యాయులు విద్యార్థినిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. 7వ తరగతి చదువుతున్న బాధితురాలు విషయం కుటుంబసభ్యులకు చెప్పడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐదుగురిని అరెస్టు చేశారు.
ప్రతిపక్ష బీజేడీ పార్టీ కేంద్రపారా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story

