ఫెడరల్ భారత్ హిందీ ఎడిషన్ ప్రారంభం
x

ఫెడరల్ భారత్ హిందీ ఎడిషన్ ప్రారంభం

రాష్ట్రాల వార్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పాటు అయిన ది ఫెడరల్, తాజాగా హిందీ ఎడిషన్ ను..


డిజిటల్ మీడియాలో దూసుకుపోతున్న ఫెడరల్ తాజాగా తన ఐదో ఎడిషన్ లో భాగంగా ఢిల్లీ కేంద్రంగా హిందీ వెబ్ సైట్ ను ప్రారంభించింది. దీనిపేరు ‘ఫెడరల్ భారత్’ గా యాజమాన్యం నిర్ణయించింది. ఫెడరల్ ఇంగ్లీష్ ను ఐదు సంవత్సరాల క్రితం చెన్నై కేంద్రంగా వెబ్ సైట్ ను ప్రారంభించింది. తరువాత తెలుగు, కన్నడ లో ప్రారంభించి విజయపథంలో దూసుకుపోతోంది. ఇది ప్రముఖ తమిళ టీవీ ఛానెల్ పుతియ తలైమురై కి సంబంధించిన న్యూ జనరేషన్ మీడియా ద్వారా నిర్వహించబడుతోంది. ఇది రాష్ట్ర- కేంద్ర వార్తలు దేశ రాజధానిలో పరిణామాలకు సరైన ప్రాధాన్యత ఇస్తుందని ప్రకటించింది.

ఐదో ఎడిషన్
ఫెడరల్ పేరుకు తగినట్లుగానే రాష్ట్రాల వార్తలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. రాష్ట్రాల వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో 2019 మార్చిలో చెన్నై కేంద్రంగా ప్రారంభం అయింది. ఇప్పటికే ‘ది ఫెడరల్ తెలంగాణ, ది ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్, ది ఫెడరల్ కర్నాటక’ ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఫెడరల్ భారత్ పేరు పై జాతీయ స్థాయిలో వెబ్ సైట్ ప్రారంభించింది. గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర యూనిట్లు క్లాసిక్ జర్నలిజం ఆధారంగా ప్రజల్లో విశ్వసనీయతను పొందాయి.
క్లాసిక్ జర్నలిజం
‘‘వార్తలకు సంబంధించిన అన్ని కోణాలను వెలికితీయడంలో ఫెడరల్ మంచి పురోగతిని ప్రదర్శిస్తోంది. నిర్దిష్ట రాజకీయాలు, ప్రభుత్వం, వ్యక్తులకు వంతపాడకుండా స్వతంత్ర్యంగా జర్నలిజం చేస్తున్నాం’’ అని ది ఫెడరల్ ఎడిటర్ ఇన్ ఛీప్ ఎస్ శ్రీనివాసన్ అన్నారు.
మాకు వార్తలే హీరో. వార్త కథనాన్ని ప్రదర్శించే సమయంలో అన్ని దృక్కోణాలను పాఠకులకు అందిస్తామని అన్నారు. ది ఫెడరల్ లో ప్రచురింపబడిన కథనాలు, అభిప్రాయాలు చాలా వైవిధ్యంగా ఉంటాయని, వాదనలన్నీ కూడా సహేతుకంగా ధృవీకరించిన వాస్తవాలను అనుబంధంగా ఉంటాయని ఎడిటర్ పేర్కొన్నారు.
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సమగ్రమైన ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు అందించడానికి స్వతంత్ర జర్నలిస్టులు ఉన్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రారంభించబడిన ఢిల్లీ జట్టుకు బహుముఖ అనుభవజ్జుడు జర్నలిస్ట్ సౌరభ్ కుమార్ గుప్తా నాయకత్వం వహిస్తారని ప్రకటించారు.
దేశంలోనే అతిపెద్ద మార్కెట్
జాతీయ భాష అయిన హిందీని దేశంలోని పది రాష్ట్రాల్లో మాట్లాడతారు. మార్కెట్ పరంగా అత్యధిక వాటా కలిగిన ప్రదేశం. దీనిని ముఖ్యమైన మైలురాయిగా ది ఫెడరల్ భావిస్తోంది. ఎందుకంటే ఇది వార్తల నిజాయితిని, విశ్లేషణలను ఒకదానికొకటి కలిపి ప్రచురిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఫెడరల్ ఎడిటోరియల్, మేనేజ్ మెంట్ సిబ్బంది భారత్ ఎడిషన్ అవకాశాల పై ఉత్సాహంగా ఉన్నారు.


Read More
Next Story