దేశాన్ని ఏలుతున్నదంతా తప్పుడు సమాచారమే...
x

దేశాన్ని ఏలుతున్నదంతా తప్పుడు సమాచారమే...

మన దేశాన్ని తప్పుడు సమాచారం ఏలుతోందని, ప్రసారమవుతున్న వార్తల్లో 51 శాతం తప్పుడు వార్తలే. దీన్ని ప్రపంచమంతా గుర్తించింది. వివరాలు



మన దేశాన్ని తప్పుడు సమాచారం ఏలుతోందని, ప్రసారమవుతున్న వార్తల్లో 51 శాతం తప్పుడు వార్తలేనని అంతర్జాతీయ సంస్థలు విశ్లేషించాయని శాసన మండలి మాజీ ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. ’దేశం నిజంగా వెలిగిపోతోందా???’ అన్న అంశంపై తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిగిన సదస్సుకు బాలసుబ్రమణ్యం అధ్యక్షత వహించి ప్రసంగించారు.


మనమేమో ‘సత్యమేవజయతి’ అని రాసుకున్నాం కానీ, ఇప్పుడు సత్యం గల్లంతైందని, సత్యం కంటే అసత్యమే అందమైందిగా కనిపిస్తోందని అన్నారు. ‘ఈ దేశమే ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు, ఈ దేశమే విశ్వగురువు, పేదరికం పోయింది, సాధారణ ప్రజలు 5 శాతం మాత్రమే ఉన్నారు’ అని కంగనా రౌనత్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. ‘తొమ్మిదేళ్ళలో దేశం మారిపోయింది. 2014 తరువాతే చరిత్ర ప్రారంభమైంది. స్వాతంత్ర్యం దేశాన్ని ఏలుతున్న తప్పుడు సమాచారం
-శాసన మండలి మాజీ ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రమణ్యం
మన దేశాన్ని తప్పుడు సమాచారం ఏలుతోందని, ప్రసారమవుతున్న వార్తల్లో 51 శాతం తప్పుడు వార్తలేనని అంతర్జాతీయ సంస్థలు విశ్లేషించాయని శాసన మండలి మాజీ ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. ’దేశం నిజంగా వెలిగిపోతోందా???’ అన్న అంశంపై తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిగిన సదస్సుకు బాలసుబ్రమణ్యం అధ్యక్షత వహించి ప్రసంగించారు.
మనమేమో ‘సత్యమేవజయతి’ అని రాసుకున్నాం కానీ, ఇప్పుడు సత్యం గల్లంతైందని, సత్యం కంటే అసత్యమే అందమైందిగా కనిపిస్తోందని అన్నారు. ‘ఈ దేశమే ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు, ఈ దేశమే విశ్వగురువు, పేదరికం పోయింది, సాధారణ ప్రజలు 5 శాతం మాత్రమే ఉన్నారు’ అని కంగనా రౌనత్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. ‘తొమ్మిదేళ్ళలో దేశం మారిపోయింది. 2014 తరువాతే చరిత్ర ప్రారంభమైంది. స్వాతంత్ర్యం 2014 తరువాతే వచ్చింది.’ అన్న కంగనా రౌనత్ మాటలను గుర్తు చేస్తూ, ఏది నిజమో, ఏది అబద్దమో తెలియడం లేదని వ్యంగంగా అన్నారు. నిజం చెప్పాలనే లక్ష్యంతో పరకాల ప్రభాకర్ మేధావి పాత్ర పోషిస్తున్నారని , అందుకే ఈసదస్సును ఏర్పాటు చేశామని అన్నారు.
సదస్సులో అతిథిగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ మాట్లాడుతూ, పజ్జెనిమిది నెలల ఎమర్జెన్సీ రోజులకంటే ఈ పదేళ్ళ పరిపాలనలో పౌరహక్కులు చాలా దిగజారాయని అన్నారు. రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కుల అమలుకు అనేక ప్రభుత్వమే ఆటంకాలు కల్పిస్తోందని, బీమా కోరెగావ్ కేసులో 16 మంది మేధావులను ఏళ్ళ తరబడి అక్రమంగా జైళ్ళలో నిర్బంధిచారని గుర్తు చేశారు. జర్మనీలో జరిగిన మ్యూనిచ్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి వెళ్ళకుండా అరుంధతీ రాయ్ ని కేంద్రం అడ్డుకుందని, కశ్మీర్ కు చెందిన ఒక మహిళా ఫొటో జర్నలిస్టుకు పులిడ్జర్ అవార్డు వస్తే, అది తీసుకోవడానికి అమెరికా వెళ్ళకుండా ఢిల్తీ ఎయిర్ పోర్టు లోనే ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు.
పత్రికలపైన దాడులు చేయడం, లోబర్చుకోవడం మామూలైపోయిందని, నిజాలు రాస్తున్న ‘దవైర్’ ‘న్యూస్ క్లిక్’ వంటి న్యూస్ వెబ్ సైట్లపై కూడా దాడులు చేసిందని గుర్తు చేశారు. ఎంతో ఘనమైన సంస్కరణ ఉద్యమాలను, పోరాటాలను నడిపిన చరిత్రగల ఆంధ్రపదేశ్ లో నేడున్న రాజకీయ పార్టీలు ఢిల్లీ పాదుషాకి సామంతులుగా, బానిసలుగానో వ్యవహరించడం బాధాకరమని అన్నారు.
టెంకాయల దామోదరం ఆహ్వానం పలికిన ఈ సభలో న్యాయవాది హేమచంద్రారెడ్డి, ఎస్. సోం ప్రకాష్ తదితరులు ప్రసం గించారు. దేశానికి స్వాతంత్య్రం 2014 తరువాతే వచ్చింది.’ అన్న కంగనా రౌనత్ మాటలను గుర్తు చేస్తూ, ఏది నిజమో, ఏది అబద్దమో తెలియడం లేదని వ్యంగంగా అన్నారు. నిజం చెప్పాలనే లక్ష్యంతో పరకాల ప్రభాకర్ మేధావి పాత్ర పోషిస్తున్నారని , అందుకే ఈసదస్సును ఏర్పాటు చేశామని అన్నారు.

సదస్సులో అతిథిగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ మాట్లాడుతూ, పజ్జెనిమిది నెలల ఎమర్జెన్సీ రోజులకంటే ఈ పదేళ్ళ పరిపాలనలో పౌరహక్కులు చాలా దిగజారాయని అన్నారు. రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కుల అమలుకు ప్రభుత్వమే అనేక ఆటంకాలు కల్పిస్తోందని, బీమా కోరెగాన్ కేసులో 16 మంది మేధావులను ఏళ్ళ తరబడి అక్రమంగా జైళ్ళలో నిర్బంధిచారని గుర్తు చేశారు. జర్మనీలో జరిగిన మ్యూనిచ్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి వెళ్ళకుండా అరుంధతీ రాయ్ ని కేంద్రం అడ్డుకుందని, కశ్మీర్ కు చెందిన ఒక మహిళా ఫొటో జర్నలిస్టుకు పులిడ్జర్ అవార్డు వస్తే, అది తీసుకోవడానికి అమెరికా వెళ్ళకుండా ఢిల్లీ ఎయిర్ పోర్టు లోనే ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు.

పత్రికలపైన దాడులు చేయడం, లోబర్చుకోవడం మామూలైపోయిందని, నిజాలు రాస్తున్న ‘దవైర్’ ‘న్యూస్ క్లిక్’ వంటి న్యూస్ వెబ్ సైట్లపై కూడా దాడులు చేసిందని గుర్తు చేశారు. ఎంతో ఘనమైన సంస్కరణ ఉద్యమాలకు, పోరాటాలను నడిపిన చరిత్రగల ఆంధ్రపదేశ్ లో నేడున్న రాజకీయ పార్టీలు ఢిల్లీ పాదుషాకి సామంతులుగా, బానిసలుగానో వ్యవహరించడం బాధాకరమని అన్నారు.

టెంకాయల దామోదరం ఆహ్వానం పలికిన ఈ సదస్సులో న్యాయవాది హేమచంద్రారెడ్డి, ఎస్. సోం ప్రకాష్ తదితరులు ప్రసం గించారు.



Read More
Next Story