ప్రతి పైసాకు లెక్క తేలాల్సిందే
x
సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ప్రతి పైసాకు లెక్క తేలాల్సిందే

సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల కీలక సమీక్షా సమావేశం జరిగింది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించడమే కాదు.. పారదర్శకతలో దేశానికే సరికొత్త పాఠాలు నేర్పే దిశగా కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శుల కీలక సమీక్షా సమావేశం అధికారులకు ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. కేవలం బడ్జెట్ కేటాయింపులు, పథకాల ప్రకటనలతో కాలం గడిపే రోజులు చెల్లిపోయాయని.. ఇకపై ప్రతి పైసాకు లెక్క తేలాల్సిందేనని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు అధికారులకు స్పష్టం చేశారు. ఖర్చు పెట్టే ప్రతి పైసా క్షేత్రస్థాయిలో కనిపించాలని, అలా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించని పక్షంలో ఉదాసీనతను ఉపేక్షించేది లేదని అధికారులకు సూచించారు.


పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..

ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం అధికారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని, అదే సమయంలో జవాబుదారీతనాన్ని నింపింది. గ్రామీణ వికాసమే ధ్యేయంగా ’పల్లె పండగ 2.0' కోసం గతంతో పోలిస్తే భారీగా నిధులను పెంచామని ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా పల్లె పండగ 2.0 కోసం రూ.5,700 కోట్లు, అడవితల్లి బాట కోసం రూ.1,005 కోట్లు, సాస్కి కింద రూ.2,123 కోట్లు మొత్తంగా రూ.11,328 కోట్ల భారీ నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. మేము కేవలం నాలుగు గోడల మధ్య కూర్చుని నిర్ణయాలు తీసుకునే వ్యక్తులం కాదు.. కేటాయించిన ప్రతి రూపాయి క్షేత్రస్థాయిలో పని రూపంలో కనిపించాల్సిందే అని పవన్ అధికారులకు గట్టిగా నొక్కి చెప్పారు. అభివృద్ధి పనుల అమలులో ఎలాంటి ఉదాసీనతను సహించేది లేదని హెచ్చరిస్తూ, ఈ ప్రాజెక్టుల పారదర్శకతపై తాను, ముఖ్యమంత్రి స్వయంగా జవాబుదారీతనం (Accountability) తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.


ఏఐ టూల్స్.. రియల్ టైమ్ గవర్నెన్స్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో టెక్నాలజీ ఆధారిత పాలనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 'స్వర్ణాంధ్ర 2047' లక్ష్య సాధనే ధ్యేయంగా నిర్దేశించుకున్న పది సూత్రాల అమలుపై ఆయన లోతుగా చర్చించారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగా, పాలనలో ఏఐ (AI) టూల్స్ , అవేర్ (AWARE) సిస్టమ్‌ను వినియోగించడం ద్వారా పారదర్శకతను పెంచాలని సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌తో క్షేత్రస్థాయి ఫలితాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ అనే వినూత్న పాలసీని సీఎం సమీక్షించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం ద్వారానే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపగలమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


సమీక్షకు హాజరైన మంత్రులు, కార్యదర్శలు

Read More
Next Story