
రక్త పరీక్షలో అడ్డంగా దొరికిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్
మూత్రం ఇవ్వడానికి నీళ్లు ఇచ్చాడా? అందుకే బ్లడ్ టెస్ట్ చేశారా? అసలు కథేంటీ?.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌యాదవ్‌కు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. శనివారం రాత్రి ఫామ్‌హౌస్‌పై దాడి జరిగిన వెంటనే నిర్వహించిన ప్రాథమిక ’ర్యాపిడ్ టెస్ట్‘ లో ఆయనకు నెగిటివ్ అని వచ్చినప్పటికీ, పోలీసులు అనుమానంతో నిర్వహించిన లోతైన 'రక్త పరీక్ష' (Blood Test)లో అసలు నిజం బయటపడింది. రక్త నమూనాల విశ్లేషణలో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని ఎస్పీ గిరిధర్ అధికారికంగా ధ్రువీకరించారు. మూత్ర పరీక్షకు ఆయన యూరిన్ ఇవ్వడానికి బదులు సీసాలో నీళ్లు పట్టి తెచ్చిఇచ్చినట్టు హైదరాబాద్ లో ప్రచారం జరిగింది.
రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఈగల్ మెరుపు దాడి
రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో శనివారం అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. తెలంగాణ ఈగల్ బృందం రాత్రి 11 గంటల సమయంలో మెరుపు దాడులు నిర్వహించగా, అక్కడ ఒక మహిళ సహా మొత్తం 11 మంది ప్రముఖులు పట్టుబడ్డారు. అక్కడ దొరికిన ఆధారాలు, నమూనాలను బట్టి ఇది పక్కాగా ప్లాన్ చేసిన డ్రగ్స్ పార్టీ అని పోలీసులు నిర్ధారించారు.
ఎంపీతో పాటు మరో ఐదుగురికి పాజిటివ్
ఈ కేసులో కేవలం ఏలూరు ఎంపీ మాత్రమే కాకుండా, ఫామ్‌హౌస్ యజమాని, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా వచ్చింది. వీరితో పాటు పార్టీలో పాల్గొన్న రితేశ్‌రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిలకు కూడా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. పట్టుబడిన వారిలో అందరూ ఉన్నత స్థాయి వ్యక్తులు కావడంతో ఈ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
దర్యాప్తు ముమ్మరం .. డ్రగ్స్ మూలాలు ఎక్కడ
ఏలూరు ఎంపీ సహా ప్రముఖులకు పాజిటివ్ రావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసలు ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి? సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్ ఏంటి? అనే కోణంలో ఈగల్ బృందం దర్యాప్తు వేగవంతం చేసింది. నివేదికల ఆధారంగా తదుపరి అరెస్టులు, కఠిన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Next Story

