ఎలాన్ మస్క్ స్టార్ షిప్ కకావికలు, వీడియో వైరల్
x

స్పెస్ ఎక్స్ ప్రయోగించిన రాకెట్ (ఎడమ) ఆకాశంలో పేలిపోయిన దృశ్యం (కుడి)

ఎలాన్ మస్క్ స్టార్ షిప్ కకావికలు, వీడియో వైరల్

అంతరిక్షంపై పట్టుసాధించాలన్న ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. స్పెస్ ఎక్స్ ప్రయోగించిన మరో రాకెట్ విఫలమైంది..


ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కి చెందిన స్పెస్ ఎక్స్ అంతరిక్ష ప్రయోగానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్‌ ప్రయోగం విఫమైంది. దక్షిణ ఫ్లోరిడా-బహామాస్‌ సమీపంలో రాకెట్‌ పేలిపోయి శిథిలాలు చెల్లాచెదురుగా కిందపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. టెక్సాస్‌లోని బొకాచికా అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 6 గురువారం సాయంత్రం 5:30 గంటలకు స్టార్‌షిప్‌ రాకెట్‌ను ప్రయోగించారు. నిప్పులుచిమ్ముకుంటూ రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అంతలోనే అంతరిక్షంలో పేలిపోయింది. అంతే వేగంగా శిథిలాలు కిందకు వచ్చి పడ్డాయి.
దీంతో అంతరిక్ష రంగంపై పట్టు సాధిస్తున్న ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ప్రణాళికకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించిన స్టార్‌షిప్‌ (Starship Rocket) మెగా రాకెట్‌ విఫలమైంది. ఇది నిజంగా ఆ సంస్థకు పెద్ద కుదుపు.
రాకెట్‌ పేలిపోవడంపై స్పేస్‌ఎక్స్ (SpaceX) స్పందించింది. ఇటీవల నిర్వహించిన ప్రయోగం సైతం ఇలాగే జరిగినట్లు తెలిపింది. వీటినుంచి పాఠాలు నేర్చుకుంటామని ప్రకటించింది. ఇక, రాకెట్‌ పేలిపోవడంతో దాని నుంచి భారీగా శకలాలు కిందికి దూసుకొచ్చాయి. ఫ్లోరిడా, బహమాస్‌ ప్రాంతాల్లోని ఆకాశంలో ఈ శకలాలు తారాజువ్వల్లా కనిపించాయి. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇది రెండోసారి..
జనవరిలోనూ స్పేస్‌ఎక్స్ నిర్వహించిన పునర్వినియోగ భారీ రాకెట్‌ స్టార్‌షిప్‌ విఫలమైంది. సాంకేతిక కారణాల వల్లే రాకెట్ పేలిపోయినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఆ రాకెట్‌కు సంబంధించిన శకలాలు కరేబియన్‌ సముద్రంలో పడ్డాయి. అయితే, బూస్టర్‌ క్షేమంగా లాంచ్‌ ప్యాడ్‌ పైకి చేరింది. రెండు నెలల తర్వాత చేపట్టిన ఈ ప్రయోగం కూడా ఫెయిల్యూర్‌ అయింది. ఈ రెండు ప్రయోగాలు కూడా అంతరిక్షంలో పేలిపోయాయి.
ప్రస్తుత ప్రమాదం తర్వాత కరేబియన్‌ ప్రాంతంలోని అనేక విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. శిథిలాలు కిందకు దూసుకురావడంతో మయామి, ఫోర్ట్‌ లాడర్‌డేల్‌, పామ్‌ బీచ్‌, ఓర్లాండో విమానాశ్రయాల్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. జనవరిలో కూడా ఒక ప్రయోగం విఫలమైంది. వాటి శకలాలు కింద పడిపోయాయి.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్న ఎలాన్ మస్క్ కి చెందిన స్పెస్ ఎక్స్ కంపెనీ చేస్తున్న ఈ ప్రయోగాలు విఫలం కావడంతో గగనతలంలో ఆయన కంపెనీ చేసే ప్రయోగాలపై ఆందోళన పెరిగింది.
గత స్టార్‌షిప్ వైఫల్యంపై సమీక్ష పూర్తి కాక మునుపే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఫిబ్రవరి 6న సరికొత్త ప్రయోగానికి అనుమతి ఇచ్చింది. జనవరిలో జరిగిన ప్రయోగం విఫలంపై ఇంకా సమీక్ష పూర్తి కాలేదు. శిథిలాలను ఇంకా పరీక్షిస్తున్నారు. టర్క్స్, కైకోస్ దీవుల్లో దొరికిన శిథిలాలను ఇంకా పరీక్ష చేస్తూ ఉండగానే ఈ ప్రయోగం విఫలమైంది.
నిజానికి అంతరిక్ష రాకెట్లను మోసుకువెళ్లే వాహక నౌక విశ్వసనీయతను పెంచే లక్ష్యంతో SpaceX ప్రయోగాలు చేస్తోంది. అందుకు అనుగుణంగా అనేక మార్పులు కూడా చేసింది. అయినా ప్రయోగించిన 40 నిమిషాల తర్వాత SpaceX ప్రయోగం విఫలమైంది.
403 అడుగుల (123 మీటర్లు) ఎత్తులో ఉన్న స్టార్‌షిప్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్. అంగారక గ్రహాన్ని తమకు అనువైన స్థలంగా మార్చాలనే మస్క్ దీర్ఘకాలిక ప్రణాళికకు అనుగుణమైంది. ఈ దశాబ్దంలో వ్యోమగాములను చంద్రునిపైకి తిరిగి పంపడం లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టెమిస్ కార్యక్రమం కోసం నాసా స్టార్‌షిప్ ఈ వాహక నౌకలపై ఆధారపడుతోంది.
ఈ ప్రయోగం విఫలం కావడంతో స్పేస్‌ఎక్స్‌ను మస్క్ నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ఎదురుదెబ్బ తగిలినప్పటికీ తమ ప్రయత్నాలు ఆగబోవని స్పెస్ ఎక్స్ ప్రకటించడం గమనార్హం.
Read More
Next Story