శ్రీలంక అధ్యక్షుడి ఎన్నికకు తేదీ ఖరారు..బరిలో ఇప్పటికే పలువురు
x

శ్రీలంక అధ్యక్షుడి ఎన్నికకు తేదీ ఖరారు..బరిలో ఇప్పటికే పలువురు

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 21న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది.


శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 21న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. 2022లో ఆర్థిక సంక్షోభం తర్వాత శ్రీలంకలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. నామినేషన్లను ఆగస్టు 15న స్వీకరిస్తామని, సెప్టెంబర్ 21న ఎన్నికలు ఉంటాయని శుక్రవారం ప్రభుత్వ గెజిట్ విడుదల చేసింది.

ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పదవీకాలాన్ని పొడిగించేందుకు ఎన్నికలను వాయిదా వేస్తారనే ఊహాగానాలు నెలరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికలు జరగకపోవచ్చని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలం కావడంతో మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలని 2022 ప్రారంభంలో వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. చివరకు రాజపక్సే 2022 జూలై 9న దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. ఆ సమయంలో ప్రధానమంత్రిగా ఉన్న విక్రమసింఘే పార్లమెంటు ద్వారా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 75 ఏళ్ల విక్రమసింఘే సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పూనుకున్నారు. తిరిగి ఆయనే అధ్యక్షుడిగా పోటీ చేస్తారని భావిస్తున్నారు. అయితే విక్రమసింఘే ఇంకా తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

శ్రీలంక మాజీ ఆర్మీ చీఫ్, LTTE వినాశనానికి దారితీసిన సైనిక దాడికి రూపశిల్పి అయిన ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా గురువారం అధికారికంగా ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షం సమాగి జన బలవేగయ (ఎస్‌జేబీ) నాయకుడు సాజిత్ ప్రేమదాస, మార్క్సిస్ట్ జేవీపీ నాయకుడు అనురా కుమార దిసానాయక, న్యాయ శాఖ మంత్రి విజయదాస రాజపక్షే కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు.

Read More
Next Story