ఒకరో ఇద్దరో కాదు ఏకంగా వందకు పైగా ప్రజాప్రతినిధులపై ఆ కేసులు..
x

ఒకరో ఇద్దరో కాదు ఏకంగా వందకు పైగా ప్రజాప్రతినిధులపై ఆ కేసులు..

మన డెమోక్రసీ లో పాలకులు ఎటువంటి వారో చెప్పే ఓ నివేదికను ఏడీఆర్ సంస్థ విడుదలు చేసింది. ఏకంగా 151 మంది ప్రజాప్రతినిధులపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసులు నమోదు..


చట్ట సభల్లోకి ఎన్నికైన 151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు పాల్పడిన తీవ్రమైన కేసులు ఉన్నాయని, ఇందులో పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఎక్కువ సంఖ్యలో కేసులు ఉన్నాయని ఏడీఆర్ సంస్థ నివేదిక వెల్లడించింది.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ 2019- 2024 మధ్య ఎన్నికల సమయంలో భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన సిట్టింగ్ MPలు, MLAల 4,809 అఫిడవిట్‌లలో 4,693 ఈ సంస్థ పరిశీలించింది. ఇందులో మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న 16 మంది MPలు, 135 మంది ఎమ్మెల్యేలను సంస్థ గుర్తించింది.
మహిళలపై నేరాలకు సంబంధించి 25 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 21, ఒడిశా 17 మందితో తరువాత స్థానంలో ఉంది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనల మధ్య ఈ నివేదికను సంస్థ బయటపెట్టింది.
ఇందులో తీవ్రమైన నేరంగా పరిగణించే భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376 ప్రకారం అత్యాచారానికి సంబంధించిన కేసులు ఉన్న ప్రజాప్రతినిధులు 16 మంది ఉన్నారు, ఇది కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, జీవిత ఖైదు పడే సెక్షన్లు. ఇందులో ఇద్ధరి ప్రజాప్రతినిధులపై పదే పదే ఇవే సెక్షన్లు నమోదు అయ్యాయి.
రాజకీయ పార్టీలలో, భారతీయ జనతా పార్టీ (బిజెపి) మహిళలపై నేరాలకు సంబంధించి డిక్లేర్డ్ కేసులతో అత్యధిక సంఖ్యలో ప్రతినిధులను (54 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు) కలిగి ఉంది, ఆ తర్వాత కాంగ్రెస్ 23, తెలుగుదేశం పార్టీ (టిడిపి) 17 మందితో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ ఫలితాలకు ప్రతిస్పందనగా ADR బలమైన సిఫార్సులను జారీ చేసింది. నేర నేపథ్యం ఉన్న అభ్యర్థులకు, ముఖ్యంగా మహిళలపై అత్యాచారం, ఇతర నేరాలకు పాల్పడిన అభ్యర్థులకు రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వకుండా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, పోలీసుల ద్వారా వృత్తిపరమైన, సమగ్ర దర్యాప్తు జరిగేలా చూడాలని నివేదిక కోరింది. ఇలాంటి ఆరోపణలతో అభ్యర్థులను ఎన్నుకోవద్దని ADR ఓటర్లను కోరింది.


Read More
Next Story