రిలయన్స్ ఆస్తులను అటాచ్ మెంట్ చేసిన ఈడీ
x
అనిల్ అంబానీ

రిలయన్స్ ఆస్తులను అటాచ్ మెంట్ చేసిన ఈడీ

యెస్ బ్యాంకును మోసం చేసిన కేసులో కేసు ఫైల్ చేేసిన సీబీఐ


రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన రూ. 3 వేల కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న ఆయన వాటిని వ్యాపారం కోసం ఉపయోగించకుండా వేరే ఖాతాలకు మనీలాండరింగ్ ద్వారా మళ్లించినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది.

అటాచ్ చేసిన ఆస్తుల కేసులో అనిల్ అంబానీకి చెందిన ముంబైలోని ఆయన నివాసం, గ్రూప్ సంస్థల యాజమాన్యంలోని ఇతర నివాస, వాణిజ్య ఆస్తులు అటాచ్ చేస్తూ తాత్కాలిక ఉత్తర్వూలను జారీ చేసినట్లు దర్యాప్తు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీలోని మహారాజా రంజిత్ సింగ్ మార్గ్ లోని రిలయన్స్ సెంటర్ కు చెందిన భూమి, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పూణే, థానే, హైదరాబాద్, చెన్నై, ఆంధ్రపదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అనేక ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. జాతీయ మీడియా ప్రకారం ఈ అటాచ్ చేయబడిన ఆస్తుల విలువ సుమారు 3,084 కోట్లు.
మనీలాండరింగ్ కేసు..
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ వివిధ బ్యాంకుల నుంచి రుణం తీసుకుని వాటిని ఇతర ప్రయోజనాల కోసం మనీలాండరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2017-19 మధ్య యెస్ బ్యాంకు 2,965 కోట్లు, మరోసారి 2,045 కోట్లను ఆ సంస్థలను రుణం మంజూరు చేసింది. అయితే 2019 లో ఇవి నిరర్థక పెట్టుబడులుగా మారాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 1,353 కోట్లు, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ 1984 కోట్లు బకాయి పడ్డాయి. దీనితో ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
రూ. 17 వేల కోట్ల రుణాలపై కూడా..
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ప్రాస్ట్రక్చర్ సహ అనేక గ్రూప్ కంపెనీలు రూ. 17 వేల కోట్లకు పైగా విలువైన రుణాలను మళ్లించాయని కేసు సైతం నమోదైంది. ఈ ఏడాది జూలై 24న ముంబైలోని 50 కంపెనీలలో ఈడీ సోదాలు నిర్వహించింది.
అలాగే డైరెక్టర్లు సహ 25 మందిని ప్రశ్నించింది. ఆగష్టులో అనిల్ అంబానీని దర్యాప్తు సంస్థ విచారించింది. ఈడీ మనీలాండరింగ్ కేసును సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ నుంచి బదిలీ అయింది. ప్రభుత్వ బ్యాంకులలో కోటి రూపాయల మోసానికి సంబంధించిన కేసులు ఆటోమోటిక్ గా ఈడీ పరిధిలోకి వెళ్లిపోతాయి.


Read More
Next Story