బ్యాలెట్ బాక్సుకు తిరిగి రాకపోవచ్చు: మాజీ సీఈసీ కృష్ణమూర్తి
ఈసీకి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని అభిప్రాయం
మోనిషా. ఆర్
కొద్ది రోజుల క్రితం ఎన్నికల సంఘం పారదర్శకతకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక నుంచి ఎన్నికలకు సంబంధించిన కీలక పత్రాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్ లో అందరికి కాకుండా కేవలం అభ్యర్థులకు మాత్రమే అందుబాటులో ఉండేలా సవరణ చేశారు.
పంజాబ్ - హర్యానా హైకోర్టు డాక్యుమెంట్లను న్యాయవాదీ మహ్మద్ ప్రోచాకు అందించాలని ఆదేశించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సవరణ నిర్ణయం పై కాంగ్రెస్ ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై మాజీ ఎన్నికల చీఫ్ కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి తో ‘ ది ఫెడరల్ ’ మాట్లాడింది.
ప్రశ్న: పోలింగ్ వీడియోల అనుమతిని సాధారణ పౌరులకు లేకుండా చేయడం చెల్లుబాటు అవుతుందా?
పోలింగ్ బూత్ వీడియో ఫుటేజీని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేయకూడదని అనుకుని ఎన్నికల కమిషన్ కు అలాంటి చర్య తీసుకునే అధికారం ఉంది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పెండింగ్ లో ఉంది. పరిమితి విధించడానికి ఈసీకి సరైన కారణాలు పేర్కొంది. ఇవి కోర్టుకు సమర్పించారు. ఈసీ ఉద్దేశం మొత్తం పౌరుల హక్కులను తిరస్కరించడం కాదు.. కేవలం కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటే వాటిని కావాల్సిన వారికి అందించే వెసులుబాటు ఉంది.
ప్రశ్న: న్యాయవాదీ మహ్మద్ ప్రాచాకు వీడియో ఫుటేజ్ ను ఇవ్వాలని పంజాబ్ - హర్యానా ఆదేశించిన తరువాత ఈ నిబంధనలను సవరించారు.. దీనిపై మీ అభిప్రాయం ఏంటీ?
ఈసీ ఒక స్వతంత్య్ర రాజ్యాంగ సంస్థ. అత్యవసర పరిస్థితుల్లో దానికి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. అయితే ప్రస్తుతం సమయానుకూలంగా లేదు. పోలింగ్ ఫుటేజీని దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు కొన్ని చర్యలు తీసుకోవచ్చు.
నేడు సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో వీడియోలు మార్పుకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం పసిగట్టి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంది కావచ్చు. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈసీకి సమాచారాన్ని దాచే లక్ష్యంతో పనిచేయదు. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించవచ్చు. అది తీసుకునే నిర్ణయాలు తప్పు పట్టాల్సిన పనిలేదు. వారు మంచి నిర్ణయాలు తీసుకునే స్థితిలోనే ఉన్నారు.
ఈసీ తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే రాజకీయ పార్టీలకు ఉంది. అలాగే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్ఫక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత పోల్ ప్యానెల్ పై ఉంది. కాబట్టి ఈసీ తన నిబంధనలు దుర్వినియోగం కావడాన్ని అనుమతించదు. కాబట్టి అక్రమాలు అరికట్టాల్సిన బాధ్యత దానిపైనే ఉంది.
ప్రశ్న: కాంగ్రెస్ వాదిస్తున్న పేపర్ బ్యాలెట్ కు తిరిగి వస్తామా?
పేపర్ బ్యాలెట్ కు తిరిగి వచ్చే బదులు ఈవీఎంలను మెరుగుపరచడానికి సూచనలు ఇవ్వవచ్చు. దేశంలోని పేపర్ బ్యాలెట్ వల్ల కొన్ని అక్రమాలు జరిగాయి. తాజాగా చండీగఢ్ లో జరిగిన మేయర్ ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ ఓట్లు దుర్వినియోగం అయ్యాయి.
ఇది కూడా కేవలం 30 నుంచి 40 ఓట్లు వేసిన దీంట్లోనే జరిగిన వివాదం మనకు తెలుసు. . ఇక దేశవ్యాప్తంగా పేపర్ బ్యాలెట్లు ప్రవేశపెడితే జరిగే గందరగోళాలు ఒక్కసారి ఊహించుకోండి. నకిలీ బ్యాలెట్లు ముద్రించి పోలింగ్ బాక్సుల్లో వేసే పరిస్థితి ఏంటీ? పైగా అది సాధ్యం కూడా. కాబట్టి పేపర్ బ్యాలెట్లు ఎంపిక సరైన ఎంపిక కాదు. నా అభిప్రాయం ప్రకారం ఈవీఎంలు అత్యంత విశ్వసనీయమైనవి. వాటి సమగ్రతను అనుమానించడానికి ఎటువంటి కారణం లేదు.
ప్రశ్న: కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కదా? ఎలాంటి నిర్ణయం వెలువడుతుందని అనుకుంటున్నారు?
ఈ అంశాన్ని పలుమార్లు సుప్రీంకోర్టులో లెవనెత్తారు. కొన్ని రోజుల క్రితం ఈవీఎం విశ్వసనీయతను ప్రశ్నించి కోర్టుకెక్కిన వాళ్లే తిరిగి అదే ఈవీఎంలతో గెలిచి ముఖ్యమంత్రులయ్యారు. ఇక ఇప్పుడు ఈవీఎంల పారదర్శకత గురించి మాట్లాడరు. సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది రాజకీయపార్టీల ముందు ఉన్న ఏకైక ఎంపిక. దీనిపై ఎన్నికల సంఘం కచ్చితంగా సమాధానం ఇస్తుంది.
ప్రశ్న: కొత్త నిబంధనల ప్రకారం ఏ ఫారమ్ లను అనుమతి కోరవచ్చు?
ఈసీ పుటేజీకి సంబంధించి కొన్ని వీడియోలను యాక్సెస్ డినై చేసింది. అవి తప్ప వాటికి ఈసీ అనుమతి అవసరం లేదు.
ప్రశ్న: ఈ నిబంధనలలో సవరించే సమయంలో ఈసీ ప్రతిపక్షాలను సంప్రదించలేదన్నదీ మరో వాదన.. దీనిపై మీ స్పందన ఏంటీ?
సాధారణంగా ఎన్నికల నియమాలలో మార్పులు ఎల్లప్పుడూ రాజకీయ పార్టీలు, ఇతర వాటాదారులతో సంప్రదించవు. కానీ ఏదైన అవసరం ఉంటే ముందస్తుగా నోటీసు ఇస్తారు. వీడియో రికార్డులను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసీ వేగంగా చర్యలు తీసుకునేలా ప్రేరేపించింది. ఈ సమస్యను కూడా ఈసీ పరిష్కరించే అవకాశం ఉంది.
Next Story