ఈ శాంతి స్థాపకుడి మాటల్లో, చేతల్లో అవేవీ కనిపించట్లేదు ఎందుకనీ?
తన విధానాలతో ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వెంటనే ప్రపంచాన్ని తన దృష్టితో చూడటం ప్రారంభించారు. అమెరికా ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ప్రపంచమే కారణమని ఆయన భావన. తన దేశంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు లేవనెత్తి ఇతర దేశాల అనుసరిస్తున్న వైఖరే దీనికి కారణమని ఆయన అక్కడ ప్రజలను నమ్మిస్తున్నారు. ఈ విషయాన్ని నిరూపించడానికి అనుకూలంగా ఉన్న ఏ సమాచారాన్ని అయినా ఉపయోగించడానికి ట్రంప్ వెనకాడలేదు.
తన దేశం ఇక్కడ ఉన్న పేదలకు ఆహారం అందించడానికి కష్టపడుతుంటే ఇతర దేశాలు మాత్రం అమెరికా నుంచి భారీగా వాణిజ్య లాభాలు పొందుతున్నాయని తన ప్రారంభ ప్రసంగంలో ట్రంప్ ఆరోపించారు. ఇలా తమ దేశం నుంచి భారీ లాభాలు పొందుతున్న చైనా, బ్రెజిల్, భారత్ వంటి కొన్ని ఎంపిక చేసుకున్న దేశాలపై భారీగా దిగుమతి సుంకం విధిస్తామని ఆయన హెచ్చరించారు.
బాధ్యులెవరూ?
కానీ అమెరికా తన ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి అత్యధికంగా దిగుమతి చేసుకున్న వస్తువులపైనే ఆధారపడుతోంది. పెట్టుబడిదారి దేశమైన అమెరికాను నిర్దేశించేది పారిశ్రామికవేత్తలే. కొన్ని దశాబ్ధాలు వారు తమ దేశంలో కంటే విదేశాలలో వస్తువులు తయారు చేయించి ఇక్కడ అమ్ముకుంటే చౌకగా, లాభాదాయకంగా ఉందని కనుగొన్నారు. కాబట్టి వారు అమెరికా కార్మికుల ప్రయోజనాలు పట్టించుకోకుండా ఉత్పత్తిని ఇతర దేశాలకు మార్చారు.
ఇందులో చైనా ప్రధాన లబ్ధిదారుడిగా ఉంది. అలాగే కొన్ని ఆగ్నేయాసియా దేశాలు కూడా లాభపడుతున్నాయి. భారత్, ఫిలిప్ఫైన్స్ రెండు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తంలో సాప్ట్ వేర్ టెక్నాలజీని అమెరికాకు అందిస్తూ లాభాలు పొందుతున్నాయి. నేడు చైనా, అమెరికాను సవాల్ చేసే స్థాయికి ఎదిగిందంటే దానికి కారణం అమెరికా పారిశ్రామికవేత్తల పుణ్యమనే చెప్పాలి.
సహజంగానే యూఎస్ తయారీ, సాప్టేవేర్ ప్రొగ్రామింగ్ లో దాని పౌరులకు సరైన ఉపాధి అవకాశాలను అందించలేకపోతోంది. ఇతర దేశాలు పనిగట్టుకుని అమెరికన్లను నిరుద్యోగులుగా మార్చలేదు. ఇది యూఎస్ పెట్టుబడిదారి విధానం, అమెరికా పునాది.
యూఎస్ జోక్యం..
నేడు ట్రంప్ చెప్పినట్లుగా అమెరికా క్షీణదశలో ఉందని ఊహిస్తే మిగిలిన ప్రపంచం కూడా అలాగే ఉంది. యూఎస్ తో పోలిస్తే జర్మనీ, ఫ్రాన్స్, యూకే వంటి పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు యూరప్ లోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు అపూర్వమైన క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలో నేడు అనేక ఎత్తుపల్లాలు, వైషమ్యాలు ఉన్నాయంటే కారణం దానికి అమెరికానే. దాని ప్రత్యక్ష జోక్యం ఫలితమే.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం.. ఇది అమెరికా ప్రోత్సాహం ఫలితమే. కీవ్ నాటోలో చేరడానికి ప్రయత్నించకపోతే అసలు యుద్ధం అనే మాటే ఉండదు. ఉక్రెయిన్ కు నాటో లో సభ్యత్వం ఇవ్వాలని మాజీ యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ పట్టుబట్టినప్పుడూ దాని ఆపడానికి వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై దాడికి పాల్పడ్డారు. ఫలితంగా యుద్దం మూడో సంవత్సరానికి చేరుకుంది.
ఐరోపా ఆర్థికంగా అత్యంత దారుణంగా దెబ్బతినడంతో యుద్ధం కీలక పాత్ర పోషించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీన పరిచింది. యూఎస్ దాని యూరప్ మిత్రదేశాలతో కలిసి ఉక్రెయిన్ కు బిలియన్ డాలర్ల నిధులను అందించారు. ఇది దాదాపుగా 175 బిలియన్ డాలర్లు గా ఉందని లెక్కలు ఉన్నాయి.
గాజాలో..
గాజాలో 15 నెలల పాటు గాజాలో హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇందులో చాలామంది టెర్రరిస్టులతో సహ అనేక మంది పాలస్తీనియన్లు మరణించారు. దీనిలో ప్రత్యక్షంగా అమెరికా పాలుపంచుకుంది. నిధులు, ఆయుధాలను ఇజ్రాయెల్ కు అందించింది అమెరికానే.
దాదాపు రెండు మిలియన్ల జనాభా మొత్తం వారి ఇళ్ల నుంచి స్థాన భ్రంశం చెంది గుడారాలతో నివసించడానికి కారణం వారే. యూఎన్ భద్రతామండలిలో ఇజ్రాయెల్ దాడిని ఆపాలని కోరుతూ కనీసం నాలుగుసార్లు తీర్మానాలు రాగా వాటిని అమెరికా వీటో చేసింది. ప్రస్తుతం అక్కడ కాల్పుల విరమణ అమలులో ఉంది.
శాంతి స్థాపకుడు..
ట్రంప్ మాట్లాడుతూ.. తనను శాంతికర్తగా గుర్తుంచుకోవాలని కోరారు. కానీ మాటలకు విరుద్ధంగా అతని చర్యలు ఉన్నాయి. అందులో మొదటిది అమెరికా నిర్మించిన పనామా కాల్వను మెక్సికో నుంచి తిరిగి తీసుకుంటామని ప్రకటించారు. గల్ప్ ఆఫ్ మెక్సికో పేరును గల్ప్ ఆఫ్ అమెరికా గా మార్చారు.
ఇవి శాంతి స్థాపకుడి మాటలు కావు. పారిస్ ఒప్పందం, డబ్ల్యూహెచ్ఓ నుంచి నిష్రమణ, కెనడాను 51 వ రాష్ట్రంగా రావాలని కోరడం ఇవనీ కూడా ఆయన మాటలకు విరుద్దమైనవి. తాను అధికారంలోకి వచ్చిన ఒక్కరోజులోనే యుద్ధాన్ని ముగించేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ యుద్ధం ఆపిన దాఖలా లేదు.
అక్రమ వలసదారుల బహిష్కరణ..
యూఎస్ లోకి అక్రమంగా వలస వచ్చినవారిని వారి సొంత దేశాలకు సామూహికంగా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఇందులో భారతీయులు దాదాపు 7,25 వేల మంది ఉండవచ్చు. మెక్సికన్లు, సాల్వడోరియన్ల తరువాత అతిపెద్ద అక్రమ వలసదారులు మనవారే అని ప్యూ రీసెర్చ్ సెంటర్ 2022 లో అంచనా వేసింది.
అక్టోబర్ 2024 లోనే వందల మంది అక్రమ భారతీయ వలసదారులు విమానాల ద్వారా తిరిగి దేశానికి వచ్చారు. ఒక్కో విమానంలో వందమంది దాకా పత్రాలు లేని వ్యక్తులు ఉన్నారు.
గత ఏడాది సెప్టెంబర్ నాటికి బీబీసీ నివేదిక ప్రకారం.. 1000 మందికి పైగా భారతీయులు అదే విధంగా వెనక్కి వచ్చారు. ఏడు లక్షల మందికి పైగా భారతీయులను తిరిగి వెనక్కి పంపడానికి అమెరికా భారీ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే మెక్సికో, సాల్వేడార్ వలసదారుల విషయంలోనూ తాను ఇదే అమలు చేస్తానని ట్రంప్ చెప్పారు. అలాగే వాణిజ్య యుద్దం, సరిహద్దులను విస్తరించడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ శాంతి స్థాపకుడి మనస్సులో అది తప్పా మిగిలినవన్నీ ఉన్నాయి.
Next Story