
చిరంజీవి సినిమాకు టికెట్ ధర ఎంతో తెలుసా?
సినిమా విడుదలైన మొదటి పది రోజుల వరకు టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లు కలిసి చేస్తున్న సందడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి భారీ మద్దతు లభించింది. అటు మెగా అభిమానులు, ఇటు వెంకీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి అదిరిపోయే బూస్టింగ్ ఇస్తూ టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రత్యేక ప్రీమియర్ షోలతో పాటు, భారీ ధరలతో బాక్సాఫీస్ వద్ద మెగా వేట మొదలుకానుంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో చిరింజీవి, వెంకటేష్ తో పాటు చిత్ర యూనిట్ అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు.
ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 500
అధికారికంగా సినిమా విడుదల కావడానికి ఒకరోజు ముందు, అంటే జనవరి 11న రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్య నిర్వహించే స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 500గా ప్రభుత్వం నిర్ణయించింది.
మొదటి 10 రోజులు పెరిగిన ధరలు
సినిమా విడుదలైన మొదటి పది రోజుల వరకు టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సింగిల్ స్క్రీన్లలో: సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ. 100 (GSTతో కలిపి) పెంచుకోవచ్చు.
మల్టీప్లెక్స్‌లలో: సాధారణ ధరపై అదనంగా రూ. 125 (GSTతో కలిపి) పెంచుకునే అవకాశం కల్పించారు.
ఐదు షోలకు అనుమతి
విడుదలైన మొదటి రోజున రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ కావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Next Story

