ఉపాధ్యాయుల ధర్నా
x
ఎస్టీయూ ఆధ్వర్యంలో ధర్నా

టెన్త్ ఎగ్జామ్ డ్యూటీలపై టీచర్లకు డీజీఇ ఇచ్చిన హామీ ఏమిటంటే..

డీఇవో స్థాయిలో పునఃసమీక్షఉంటుందని ఎస్టీయూ నాయకత్వానికి హామీ


ఎస్.ఎస్.సి పరీక్షల విధుల కేటాయింపులపై ఉపాధ్యాయులకు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (డిజిఇ) శుభవార్త చెప్పారు. అనారోగ్యంతో బాధ పడేవారికి ఇన్విజిలేషన్ డ్యూటీ వేయబోమని డీజీఇ కెవి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చినట్టు ఎస్టీయూ నాయకులు తెలిపారు. ఒక పాఠశాలలో ఎక్కువమంది ఉపాధ్యాయులకు డ్యూటీ కేటాయిస్తే ఆ విషయాన్ని రివ్యూ చేసి మార్పులు చేస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చారు.
కొందరు ఉపాధ్యాయులకు సుదూర ప్రాంతాల్లో డ్యూటీ కేటాయించడంపై, ఆ డ్యూటీలను కూడా మార్చనున్నట్లు చెప్పారు.
ఆరోగ్య సమస్యలతో ఉన్న ఉపాధ్యాయులను డ్యూటీ నుంచి మినహాయించే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో స్కూల్ అసిస్టెంట్లను చీఫ్ సూపరింటెండెంట్ విధులు, ప్రధానోపాధ్యాయులను డిపార్ట్మెంటల్ ఆఫీసర్ విధులు కేటాయించిన విషయాన్ని కూడా రివ్యూ చేసి మార్పు చేస్తామన్నారు.
డీఇవో స్థాయిలో పునఃసమీక్ష
పై సమస్యలతో పాటు ఇతర సమస్యలను డిఈఓ స్థాయిలో పునఃసమీక్ష చేసి, విధులను సవరించేందుకు చర్యలు తీసుకుంటామని డిజిఇ హామీ ఇచ్చినట్టు ఎస్.టి.యు అధ్యక్షులు మల్లు రఘునాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి లంకలపల్లి సాయి శ్రీనివాస్ తెలిపారు. ఇతరత్రా ఏవైనా ఇబ్బందులు ఉంటే, వాటిని డీఇవో దృష్టికి తీసుకెళ్లాలని ఉపాధ్యాయులకు సూచించారు.
జిల్లా స్థాయిలో పరీక్ష విధుల కేటాయింపును, రాష్ట్రస్థాయిలో ఉత్తర్వులు జారీ అయ్యేలా అధికార కేంద్రీకృత విధానాన్ని ఎస్.టి.యు వ్యతిరేకిస్తోంది. రేపు జరిగే సి.ఎస్సి సమావేశంలో ఈ అంశాలను చర్చిస్తామని చెప్పారు. ఈ అంశాల పరిష్కారంలో జిల్లా శాఖల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సహకరించాలని ఎస్.టి.యు నాయకత్వం కోరింది.
Read More
Next Story