భారత్ లో తగ్గిపోతున్న స్వదేశీ ముడి చమురు ఉత్పత్తి
x

భారత్ లో తగ్గిపోతున్న స్వదేశీ ముడి చమురు ఉత్పత్తి

2022 కంటే ముందు మాస్కో నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు 0.2 శాతమే


ప్రసన్న మొహంతి

రష్యా చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు దేశ చమురు భద్రతపై ప్రభావం చూపుతాయని చాలామంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఇది నిజం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయ్యే ముందు న్యూఢిల్లీ, మాస్కో నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు శాతం కేవలం 0.2 శాతం మాత్రమే.
యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలు తత్ఫలితంగా చవక ధరకు భారత్ కు ముడి చమురు లభించింది. దీనివల్ల ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు వాటా గణనీయంగా పెరిగింది.
జూన్ 2025 నాటికి రష్యన్ చమురువాటా దేశీయ అవసరాలలో 44 శాతానికి చేరుకుంది. అక్టోబర్ 2025 మొదటి రెండు వారాలలో ఇది 35 శాతంగా ఉన్నట్లు గ్లోబల్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అనలిటిక్స్ ప్రొవైడర్ కెప్లర్ డేటా తెలియజేస్తోంది.
రష్యా చమురు లేకుండా భారత్ నడుస్తుంది..
ఇంతకుముందు గణాంకాల ప్రకారం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోకపోయిన భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకోగలదు. సాధారణ భారీతీయులకు దాని గురించి కూడా తెలియదు.
రిటైల్ ఇంధన ధరలు మారకపోవడంతో సామాన్యులకు ఎలాంటి ప్రభావం లేదు. ఇది చమురు శుద్ది కర్మాగారాలు, ప్రయివేట్ సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టింది. (దీనిపై విదేశాంగ మంత్రి పార్లమెంట్ లో మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో లక్షయాభై వేల కోట్ల బాండ్లను జారీ చేసి, వాటిని పది సంవత్సరాలలో తీరుస్తుందనే హమీ ఇచ్చిందని వివరణ ఇచ్చారు)
ఈ సంవత్సరం ఆగష్టులో ఫైనాన్షియల్ టైమ్స్ ఓ ఆర్టికల్ ప్రకారం.. ‘‘భారతీయ శుద్ది కర్మాగారాలు డిస్కౌంట్ చేయబడిన రష్యన్ చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా 16 బిలియన్ల అదనపు లాభాలను పొందాయి.
అందులో 6 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 50 వేల కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు వెళ్లాయి’’ అని వార్తలు ప్రచురించింది. ఇక్కడ ఆందోళన పడాల్సిన విషయం ఏంటంటే.. దేశీయ ముడిచమురు ఉత్పత్తిని తగ్గిస్తోంది. దాని దిగుమతులపై ఆధారపడటం ఇప్పుడు ఏకంగా 90 శాతానికి చేరుకుంది.
2015 లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని 2022 నాటికి 67 శాతానికి తగ్గిస్తామని హమీ ఇచ్చారు. ఇది 2014 నాటికి 77 శాతంగా ఉంది. 2021 నాటికి 87.6 శాతానికి చేరుకుంది.
దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై శ్రద్ధ పెట్టపోవడం ఆయన గత ప్రభుత్వాలను నిందించారు. ఇప్పుడు స్వయంగా ఆయనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రింది మూడూ గ్రాఫ్ లను కేంద్రం ముడి చమురుపై ఎలా పట్టును కోల్పోయిందో తెలియజేస్తాయి.

తగ్గిపోతున్న స్వదేశీ క్రూడ్ ఆయిల్ దిగుమతి



ఈ గ్రాఫ్ 2004-05 నుంచి 2013-25 లలో ముడి శుద్ది ఉత్పత్తులు, సహజ వాయువు ఉత్పత్తిలో సగటు వృద్దిని తెలియజేస్తుంది.




ఈ గ్రాఫ్ లు ఎన్డీఏ కంటే మునుపటి యూపీఏ ప్రభుత్వం సొంతంగా ఉత్పత్తి చేయడంలో ముందంజలో ఉంది.


Read More
Next Story