భారీ పతనాన్ని చవిచూస్తున్న డీ మార్ట్ షేర్లు.. ఎందుకు?
x

భారీ పతనాన్ని చవిచూస్తున్న డీ మార్ట్ షేర్లు.. ఎందుకు?

సూపర్ మార్కెట్ లో దూసుకుపోతున్న డీ మార్ట్ సోమవారం స్టాక్ మార్కెట్ లో బ్రేకులు పడ్డాయి. అనుకున్నంత మేర లాభాలు రాకపోవడం, వ్యయాలు పెరగడంతో షేర్లు ‘బేర్’ మన్నాయి.


దేశంలో సూపర్ మార్కెట్ ల రారాజుగా వెలుగొందుతున్న డీ మార్ట్ షేర్ ధరలు భారీగా పతనం చవిచూశాయి. సోమవారం నాటి స్టాక్ మార్కెట్ లావాదేవీలు ప్రారంభం కాగానే డీ మార్ట్ షేర్లు తన కనిష్ట స్థాయికి చేరుకుంది. ఓక్కో షేరుకు రూ. 4,143. 60 లకు చేరింది. దాని విలువులో దాదాపు 9. 37 శాతం మేర క్షీణించాయి. కంపెనీ త్రైమాసిక ఫలితాలు అంచనాల మేరకు రాణించకపోవడంతో ఈ క్షీణత నమోదయినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేశారు.

సెప్టెంబర్ త్రైమాసికం ప్రకారం నికర లాభం పెరిగింది. ఇంతకుముందు ఇదే సంవత్సరం ఫలితాల్లో డీ మార్ట్ 623. 6 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది లాభాలు 5.8 శాతం పెరిగి 659. 6 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం ఏడాదికి 14. 4 శాతం పెరిగి 14, 444 కోట్లకు చేరుకుంది. అయినప్పటిప్పటి వృద్ధి మందగమనంలో ఉండటంతో ఆశించిన లాభాలు రాకపోవడంతో కంపెనీ షేర్లు పతనం చవి చూస్తున్నాయి.
అలాగే కంపెనీ ఆదాయంలో ఎక్కువ భాగం వడ్డీలు, తరుగుదల, రుణాలు కు వెచ్చించాల్సి వచ్చింది. ఈ వ్యయాలు 29.3 శాతం పెరిగి 1090 కోట్లకు చేరాయి. గత సంవత్సరంలో ఇదే సమయంలో వ్యయాలు రూ. 846 కోట్లుగా ఉన్నాయి. వ్యయాలు పెరగడం కూడా షేర్ల పతనానికి మరో కారణంగా చెప్పవచ్చు.
తగ్గిన రేటింగ్ లు..
ఆర్థిక సంస్థలు, కంపెనీలకు రేటింగ్ ఇచ్చే విదేశీ సంస్థలు డీ మార్ట్ కు రేటింగ్ లు తగ్గించాయి. మోర్గాన్ స్టాన్లీ అవెన్యూ సూపర్ మార్కెట్లను అండర్ వెయిట్ కు తగ్గింది. అలాగే ఒక్కో షేరు ధరను రూ. 3,702 కి తగ్గించింది. భవిష్యత్ లో ఇది మరింత డీ రేటింగ్ కు దారి తీస్తుందని పేర్కొన్నారు.
జేపీ మోర్గాన్ కూడా ‘ఓవర్ వెయిట్’ నుంచి ‘న్యూట్రల్’ కు డీ మార్ట్ రేటింగ్ ను తగ్గించింది. దాని ధరను రూ. 5,400 నుంచి 4,700 కి తగ్గించింది. రెండవ త్రైమాసికంలో డీ మార్ట్ పనితీరు అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో రేటింగ్ తగ్గించినట్లు సంస్థ ప్రకటించింది. అలాగే గోల్డ్ మన్ సాక్స్ కూడా తన రేటింగ్ ను డీ మార్ట్ విషయంలో తగ్గించింది. వాణిజ్యం వేగవంతమైన విస్తరణ కారణంగా అవెన్యూ మార్ట్ లపై ప్రభావం పడుతుందని,వాటి వృద్ధి మందగిస్తుందని అంచనా వేసింది.



Read More
Next Story