భారత జట్టులో యంగ్ గన్స్ ఎందుకు లేరు?
x

భారత జట్టులో యంగ్ గన్స్ ఎందుకు లేరు?

వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేయడంలో అందరూ సెలెక్టర్లు అయిపోతారు. ఫలానా ఆటగాడు జట్టులో లేరని పెదవి విరుస్తున్నారు. జరిగివన్నీ చూస్తే అంతా మనమంచికే..


దేశంలో వంద కోట్లమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారని ఓ అంచన. టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక అయినట్లు ప్రకటన రాగానే అందరూ ఫలానా ఆటగాడి పేరు లేదని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారత జట్టు ఎంపిక విషయానికి వస్తే అందరూ సెలెక్టర్లు అయిపోతారు. ముఖ్యంగా జట్టులో ఫినిషర్ పాత్ర పోషించడానికి సరైన వ్యక్తి లేరని, ముఖ్యంగా రింకూ సింగ్ పేరు లేకపోవడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన విషయాలను పరిశీలిస్తే అన్నిసరిగా ఉన్నాయని చెప్పవచ్చు.

ముఖ్యంగా రింకూ సింగ్ పేరు లేకపోవడం అతని దురదృష్టంగా భావించాలి. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రింకూ 82 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. అతని స్థానంలో శివమ్ దూబే జట్టులోకి వచ్చాడు. దూబే, చెన్నై సూపర్ కింగ్స్‌కు నంబర్ 4 వద్ద బ్యాటింగ్ చేయడం ద్వారా మంచి అవకాశాలు లభించాయి. వాటిని అతను ఉపయోగించుకున్నాడు కూడా. సెలక్షన్ కమిటీ లాజిక్‌ను తప్పుపట్టడం కష్టం, ముఖ్యంగా విరాట్ కోహ్లీ 147లో స్ట్రైక్-రేట్‌తో 500 పరుగులు సాధించాడు.
యంగ్ గన్స్ ఎందుకు లేరు..
ఐపీఎల్ లో ప్రదర్శన ఆధారంగా సెలెక్టర్లు సీనియర్లను పక్కనపెట్టి జట్టును ఎలా ఎంపిక చేస్తారు. సీనియర్లు, యువకులతో కలిసి వెళ్లడానికే ఏ సెలెక్టర్ అయినా ప్రయత్నిస్తారు. ప్రస్తుతం జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శశాంక్ సింగ్, రియాన్ పరాగ్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేస్తే ఒకవేళ వాళ్లు అంచనాలను అందుకోకపోతే పరిస్థితి ఏంటీ?
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 700 పరుగులు చేసి, టీ20 లో దేశం తరఫున అమోఘమైన రికార్డుకలిగి ఉన్న యశస్వి జైశ్వాల్ ను కాదని, ఇప్పుడు ఐపీఎల్ లో అదరగొడుతున్న అభిషేక్ శర్మను తీసుకుంటే.. అదిసమంజసం అవుతుందా? ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను తిలక్ భర్తీ చేయగలరా? శశాంక్ మెరుఫులు ప్రపంచకప్ లో కంటిన్యూ కాకపోతే.. ఇటీవల రియాన్ పరాగ్ ప్రారంభంలో ఐపీఎల్ లో దూకుడు ప్రదర్శించగా ఇటీవల కాస్త నెమ్మదించాడు. 2013లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి అందుకున్నాక ఇండియా మరే ఇతర టైటిల్ అందుకోలేకపోయింది. 2014లో టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక చేతిలో పరాజయం, కోహ్లి నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి ఫైనల్ లో పాకిస్తాన్ తో ఓటమి, 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి ఎదురైంది.
2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి T20 ప్రపంచ కప్‌లో మాత్రమే భారత్ పూర్తిగా యువకులతో బరిలోకి దిగింది. అప్పుడు టీ20 ప్రారంభ దశలో ఉంది. అప్పటి వరకూ భారత్ కేవలం ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడింది. అంతకుముందు కరేబియన్ దీవులలో జరిగిన వన్డే ప్రపంచకప్ లో భారత్ అవమానకరంగా వెనుదిరిగింది.
బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడి నిష్క్రమించాక సచిన్ టెండూల్కర్, రాహూల్ ద్రావిడ్, సౌరబ్ గంగూలీ ఈ సిరీస్ కు అందుబాటులో లేకుండా పోయారు. అయితే ఎలాంటి అంచానాలు లేకుండా బరిలోకి దిగిన ధోని సేన అనూహ్యంగా టైటిల్ ఎగరేసుకువచ్చింది. అచ్చు 1983 నాటి వన్డే వరల్డ్ కప్ విజయాన్ని గుర్తు చేస్తూ.. 2007 లో దిలీప్ వెంగ్ సర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిషన్ కొత్త కెప్టెన్ కోసం అప్పుడు శోధిస్తే ధోని వారి టార్గెట్ లో నిలిచాడు.
యువతతో పాటు అనుభవం
బ్యాటింగ్ త్రయం లేనప్పటికీ, ధోనీతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, దినేష్ కార్తీక్ బ్యాటింగ్ భారాన్ని మోశారు. ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, ఆర్పీసింగ్, అగార్కర్, హర్భజన్ సింగ్ బౌలింగ్ వనరులుగా ఉన్నారు. అప్పుడు రోహిత్ శర్మ, పీయూష్ చావ్లా, జోగిందర్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్ యువకులు. అప్పుడు వీరికి ఎలాంటి అనుభవం లేదు. అయినప్పటికీ అవకాశాలు రాగానే ప్రతిభ చూపారు.
ఆ తరువాత భారత్ ప్రపంచ టీ20 క్రికెట్ రాజధానిగా మారింది. ఇది ఐపీఎల్ వల్లే అని చెప్పవచ్చు. అయితే ఆ తరువాత భారత్ ఒక్క టీ20 టైటిల్ కూడా గెలవలేదు. 2007 నాటి టైటిలిస్టులు అయినా రోహిత్, అగార్కర్ ఈ సారి జట్టు ఇలా ఉంటేనే గెలుస్తుందని అంచనా వేశారు.
ఈసారి ఫలితం కొత్తగా ఉంటుందని ఆశిస్తున్నారు. గత వరల్డ్ కప్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. ఐపీఎల్ లో కూడా ఇదే విధంగా తన ఆటతీరును కొనసాగిస్తున్నాడు. కోహ్లి కూడా తన ఆటతీరుతో అలరిస్తున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లో అతడే లీడ్ రన్నర్. అయితే ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఐపీఎల్ లో అట్టడుగున ఉన్నాయి. గత కొంతకాలంగా, భారత బ్యాటింగ్ ఈ ఇద్దరు దిగ్గజాల చుట్టూ తిరుగుతుంది, అయితే సూర్యకుమార్, దూబే, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ మిడిల్ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నారు.
సంజు- పంత్
ఈ ఐపీఎల్ లో సంజూ శాంసన్ అత్యద్బుత స్ట్రోక్ మేకింగ్ తో అలరిస్తున్నాడు. ఇప్పటి వరకూ చూడని పరిపక్వత ప్రదర్శిస్తున్నాడు. ఆర్ ఆర్ తరఫున ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వస్తున్న శాంసన్.. కర్నాటక బ్యాట్స్ మెన్ కేఎల్ రాహూల్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అయితే జట్టులో సంజూ చోటు దక్కించుకున్నారు. అయితే పంత్ ఉండగా శాంసన్ తుది జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి. లోయర్ ఆర్డర్ లో శాంసన్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
పాండ్యా, దూబే, వారి మీడియం పేస్‌తో, స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలింగ్ త్రయం అయిన జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లను బ్యాకప్ చేయగలరు. అయితే యుఎస్, కరేబియన్‌లోని పిచ్‌లు ఎలా ప్రవర్తిస్తాయని తెలియక స్పిన్నర్లను ఎంపిక చేసింది. ఇందులో కుల్చా ద్వయంతో పాటు జడేజా, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. దాదాపు ఎనిమిది నెలల తరువాత చాహల్ తిరిగి భారత జట్టులోకి వచ్చారు. మిడిల్ ఓవర్లో చాహల్ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే రోహిత్, కోచ్ ద్రావిడ్ తుది జట్టులో ఎలాంటి కూర్పును ప్రదర్శిస్తారో చూడాలి.


Read More
Next Story