ఎల్‌పీజీ కొరత ప్రభావం: అయోధ్య రామాలయంలో సాయంత్రం భోజనం నిలిపివేత
x

ఎల్‌పీజీ కొరత ప్రభావం: అయోధ్య రామాలయంలో సాయంత్రం భోజనం నిలిపివేత

భక్తులకు ఇక రోజుకు ఒక్కసారి మాత్రమే ఉచిత భోజనం..


Click the Play button to hear this message in audio format

ఎల్‌పీజీ (వంట గ్యాస్) కొరత ప్రభావం ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంపై పడింది. గ్యాస్ కొరత కారణంగా రోజుకు రెండు సార్లు వడ్డించే ఉచిత భోజనాన్ని ఒక్కసారి మాత్రమే అందిస్తున్నారు.

ఆలయానికి దగ్గరలోని ‘రామ్ రసోయి’ భోజన శాలలో భక్తులకు ఉచితంగా భోజనం పెడతారు. సాధారణంగా రోజూ సుమారు 10వేల భక్తులకు ఉదయం, సాయంత్రం భోజనం వడ్డిస్తారు. అయితే ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సాయంకాలం పూట మాత్రమే భోజనం వడ్డించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు భక్తులకు సమాచారం కూడా ఇచ్చారు

సాధారణంగా భక్తులకు పూరి-సబ్జీ, దాల్-చావల్, కధీ-చావల్ వడ్డిసారు. వీటి తయారీకి ఎల్‌పీజీనే ప్రధానంగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం నిల్వ ఉన్న గ్యాస్ సిలిండర్లు ఎక్కువకాలం రావని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే ఒక్క పూట భోజనం మాత్రమే భోజనం పెట్టనున్నారు.

పరిస్థితి మెరుగైతే సేవలు పునఃప్రారంభం..

పరిస్థితి మెరుగుపడితే రెండు పూటల భోజన సేవలను మళ్లీ ప్రారంభిస్తామని ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి సయాన్ కునాల్ తెలిపారు.

Read More
Next Story