‘‘కాంగ్రెస్ ప్లాన్‌ను అడ్డుకుంటాం ’’
x

‘‘కాంగ్రెస్ ప్లాన్‌ను అడ్డుకుంటాం ’’

కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాసి, ముస్లిం వర్గాలకు కోటా వర్తింపజేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.


కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాసి, ముస్లిం వర్గాలకు కోటా వర్తింపజేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

బాగల్‌కోట్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. “మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం గురించి వారు (కాంగ్రెస్) తమ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. కాని అలా జరగనివ్వం.కర్ణాటకలో మా పార్టీకి చెందిన ఎంపీలంతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి చెందినవారే’’నని అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడపడం కష్టమై పోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని రోజులు ఎంతో దూరంలో లేవు’’ అని మోదీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మోదీ ప్రసంగిస్తూ.. “హుబ్బళ్లిలో మా కుమార్తెలలో ఒకరిని పలుమార్లు కత్తితో పొడిచినప్పుడు, ఇక్కడి పాలకులు తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఆమె పరువుపై దాడి మొదలెట్టారు. కర్ణాటకలో ఛాందసవాదులు పెరిగిపోయారని, తన దుకాణంలో 'హనుమాన్ చాలీసా' వింటున్న దుకాణదారుడిపై కూడా దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి.. “మీ ఓటు మోదీని బలపరుస్తుంది.భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి దోహదపడుతుంది. దేశాన్ని తయారీ కేంద్రంగా, నైపుణ్య కేంద్రంగా మార్చాలన్నది మా సంకల్పం. ఇవన్నీ సెలవులను ఆస్వాదించేవారు చేయలేరు’’ అని పేర్కొన్నారు.

తన ప్రభుత్వ విజయాల గురించి మోదీ మాట్లాడుతూ.. “గతంలో 18,000 కంటే ఎక్కువ గ్రామాలకు విద్యుత్ లేదు. ఇప్పుడు దేశంలో కరెంటు రాని గ్రామం లేదు. మేము జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించాం. దీనికి ముందు 16% ఇళ్లకు మాత్రమే నీటి కనెక్షన్ ఉంది.ఇప్పుడు గత 5 సంవత్సరాలలో 75%కి పెరిగింది.

తప్పుడు ప్రచారం చేయడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని కోరారు. “ఎన్నికల్లో ఓడిపోయిన వారు నకిలీ వీడియోలు తయారు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి నా వాయిస్‌లో వీడియోలు సృష్టిస్తున్నారు. అలాంటి వాటి గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లండి’’ అని మోదీ ఓటర్లను కోరారు.

Read More
Next Story