పెట్టుబడి దారుల్లో కూటమి ప్రభుత్వం విశ్వాసం నింపుతుంది
x
గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

పెట్టుబడి దారుల్లో కూటమి ప్రభుత్వం విశ్వాసం నింపుతుంది

గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.


కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతుందని కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారుల్ని బెదిరించి కోర్టులకు ఈడ్చి ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వేధించకుండా అండగా నిలుస్తుందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాముల్ని చేయాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్యానించారు.

దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో ఇది కీలక మైలురాయి అని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలపడమే లక్ష్యం అని పేర్కొన్నారు. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ బలమైన అడుగు అని వివరించారు. ప్రభుత్వాలు మారినా పాలనా విధానాలు స్థిరంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు రూ.15,600 కోట్ల పెట్టుబడితో 495 ఎకరాల్లో విస్తరిస్తుందని ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యం అని తెలిపారు. నిర్మాణ దశలో 8 వేల మందికి ఆపరేషన్ దశలో 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి పరోక్షంగా వేల మందికి అవకాశాలు సృష్టించబడతాయని చెప్పారు. ఏఎం గ్రీన్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి మహేష్ లకు అభినందనలు తెలిపారు.


గ్రీన్ అమ్మోనియా కంపెనీ అధిపతితో మాట్లాడుతున్న సీఎం, డిప్యూటీ సీఎం

క్లీన్ ఎనర్జీ పాలసీతో విధానపరమైన స్పష్టత ఇచ్చామని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ ను దేశంలో మొదటి స్థానంలో నిలపాలని లక్ష్యం అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 రాష్ట్రాన్ని భవిష్యత్ పునరుత్పాదక ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దుతుందని వివరించారు. గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి అనుకూల వాతావరణం కల్పిస్తుందని పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలని కూటమి విధానం అని స్పష్టం చేశారు. ఏఎం గ్రీన్ సంస్థ కాకినాడలో మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో చారిత్రక మైలురాయి అని అభివర్ణించారు. ప్రాజెక్టు పునరుత్పాదక ఇంధనతో నీటిని ఎలక్ట్రాలిసిస్ చేసి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందని కర్బన ఉద్గారాలను క్లీన్ చేస్తుందని పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో కీలక అడుగు అని పేర్కొన్నారు.

ఏఎం గ్రీన్ సంస్థ జర్మనీ యూనిపర్ తో ఒప్పందం కుదుర్చుకుని ఏడాదికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా సరఫరా చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. భారతదేశం నుంచి యూరోపియన్ దేశాలకు తొలి శుద్ధ ఇంధన ఎగుమతి ఒప్పందం అని ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువు కావడం గర్వకారణం అని అన్నారు. గ్రీన్ అమ్మోనియా రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనలో బలమైన అడుగు అని వ్యవసాయం రవాణా రంగాల్లో ఉపయోగపడుతుందని క్రూడ్ ఆయిల్ వినియోగాన్ని తగ్గిస్తుందని కర్బన ఉద్గారాలను తగ్గిస్తుందని వివరించారు. ఎరువుల తయారీ ఫార్మా రసాయన ప్లాస్టిక్ పరిశ్రమల్లో ముడి పదార్థంగా ఉపయోగపడుతుందని వాతావరణ మార్పులను నిలవరిస్తుందని అన్నారు. భూతాపం వల్ల సముద్ర జలాలు ముందుకు వస్తున్నాయని ప్రపంచ దేశాలు గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. ప్రాజెక్టు రాష్ట్రానికి దీర్ఘకాలిక లాభాలు తెస్తుందని విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసి సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు సహకరిస్తుందని యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు.

Read More
Next Story