కర్ణాటక పట్ల కేంద్రం వైఖరిని బయటపెట్టిన సీఎం సిద్ధరామయ్య
x

కర్ణాటక పట్ల కేంద్రం వైఖరిని బయటపెట్టిన సీఎం సిద్ధరామయ్య

కరువు సహాయ నిధిని విడుదల చేయకుండా జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.


కరువు సాయాన్ని కేంద్రం కర్ణాటక రాష్ట్రానికి విడుదల చేయలేదు. అందుకు నిరసనగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం విధానసౌదా ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు బైఠాయించింది. బీజేపీ నేతృత్వంలో కేంద్రం ప్రభుత్వం కర్ణాటక ప్రజల పట్ల ఉన్న వైఖరిని ఎత్తిచూపేందుకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు సిద్ధరామయ్య తెలిపారు.

ఏ మొహంతో ఓట్లడుగుతారు?

‘‘ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కర్ణాటకను, రైతులను ద్వేషిస్తున్నారు. తీవ్ర కరువుతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏడు నెలలు గడుస్తున్నా.. కరువు సహాయ నిధులు విడుదల చేయలేదు.ఇంతటి తీవ్ర కరువు గతంలో ఎప్పుడూ చూడలేదు’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘రాష్ట్రంలోని 240 తాలూకాల్లో 223 కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తించారు. జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నిబంధనల ప్రకారం.. కరువు సాయంగా రూ. 18,171 కోట్లు ఇవ్వాలని కోరాం. కాని కేంద్రం స్పందించలేదు. పలుమార్లు వినతులు కూడా పంపాం. అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.’ అని సిద్ధరామయ్య చెప్పారు.

భారీ నష్టం..

వర్షాభావ పరిస్థితుల కారణంగా 48 వేల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.2 వేలు చొప్పున 34 లక్షల మంది రైతులకు రూ. 650 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. కేంద్రం నిధులు విడుదల చేయకపోవడాన్ని తప్పుబడుతూ.. ఏ మొహంతో ఓట్లు అడగటానికి రాష్ట్రానికి వస్తున్నారని మోదీ, షాను ప్రశ్నించారు సిద్ధరామయ్య.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కరువు పరిహారాన్ని కేంద్రం నుంచి ఇప్పించాలని సిద్దరామయ్య సుప్రీంకోర్టు తలుపుతట్టారు. కోర్టు జోక్యం చేసుకోవడంతో సిద్ధరామయ్య సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పించడంలో తమ ప్రభుత్వం చేస్తున్న పోరాటం విజయవంతమైందని చెప్పుకొచ్చారు.

నిరసన కార్యక్రమలో కర్నాటక ఇన్‌ఛార్జ్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా, మంత్రులు రామలింగారెడ్డి, కృష్ణ బైరేగౌడ, కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Read More
Next Story