చత్తీస్ గడ్  ఎన్ కౌంటర్ల వెనక ఇంత కథ ఉంది...
x

చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ల వెనక ఇంత కథ ఉంది...

భారత ప్రభుత్వం దేశ మూలావాసులైన ఆదివాసీలపై అతి క్రూరంగా మారణకాండను కొనసాగిస్తూన్నది.


చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఉన్న కోట్లాది విలువైన వనరులను బహుళ జాతి కంపెనీలకు, కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం భారత ప్రభుత్వం దేశ మూలావాసులైన ఆదివాసీలపై అతి క్రూరంగా మారణకాండను కొనసాగిస్తూన్నది. అదే విధంగా వారికి మద్దతుగా ఉద్యమిస్తున్న ఉద్యమకారులు కూడా అత్యంత కిరాతకంగా హత్య చేస్తూ దానికి ఆపరేషన్ కగార్ అనే పేరుతో వేలాది బలగాలతో మధ్య భారతాన్ని‘దేశసరిహద్దు ప్రాంతం’గా మారుస్తూ యుద్ధ స్థితిని కొనసాగిస్తుంది.

సెంట్రల్ ఇండియాలో పరిస్థితి గాజా, ఉ క్రేయిన్ల స్థితిని దాటిపోయింది. మన పక్కన ఉన్న చత్తీస్ ఘడ్ లో ఆదివాసీల జీవితంపై భారత సైన్యం తీవ్రంగా దాడి చేస్తున్న విధానాన్ని మానవత్వం గల మనుషులుగా ప్రజాస్వామ్యవాదులుగా అన్ని రాజకీయ పార్టీలు బిజెపి ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండను నిలదీయడానికి ముందుకు రావాల్సిందిగా, తెలుగు రాష్ట్రాల్లోని హక్కుల సంఘాలు పిలుపునిచ్చాయి.

ఈ మేరకు ఈ రోజు పౌరహక్కుల సంఘం, మానవ హక్కుల వేదిక (HRF),బప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ (OPDR), పౌర హక్కుల పరిరక్షణ కమిటీ, (PUCL), పౌర హక్కుల పర్యవేక్షణ కమిటి (CLMC) విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాయి.

తెలంగాణ ఉద్యమంలో ఏవిధంగానైతే సంబండ వర్గాలు కదిలి తెలంగాణను సాకారం చేసుకోగలిగామో, అదే విధంగా ఆదివాసీల హననాన్ని నిలువరించడానికి ఉద్యమాన్ని బతికించుకోవడానికి మన వంతు బాధ్యతగా ముందుకు రావాల్సిందిగా పౌరహక్కుల సంఘాలు పిలుపునిచ్చాయి.

అనంతరం విడుదల చేసిన ప్రకటన:

ఏడాది కాలంగా మధ్యభారత, గోదావరి తీర అరణ్యాలలో సాగుతున్న కగార్ మారణ కాండల్లో ఇప్పటికే మరణించినవారిని వ్యక్తులుగా చెప్పడం కష్టమై 300 సంఖ్యతో ఇప్పటికే ఎన్ కౌంటర్ పేరుతో హత్య గానించబడ్డారు. 1 జనవరి 2024 6 నెలల పాప నుంగ్లీ సోడితో ప్రారంభమైన కగార్ ఎన్ కౌంటర్ హత్యాకాండ గత ఏడాదితో 300 వరకు వస్తే, ఈ ఏడాది ప్రారంభంలో నెల పూర్తి కాకుండానే 50 సంఖ్యను దాటేసింది.

ఆపరేషన్ కగార్ అణచివేత చత్తీస్ఘడ్ అబూజ్మడ్ ప్రాంతంలో అందులో నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాలోని మొత్తం 4 వేల కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతంలో ఇది కొనసాగుతుంది. ఇందులో 237 గ్రామాల్లో గోండు, మోరియా, అబూజ్ మరియు హల్వా తెగకు చెందిన 35 వేల మంది ఆదివాసీలు జీవిస్తున్నారు. ఇక్కడ ఇనుప ఖనిజం, గ్రాఫైట్, సున్నపురాయి, యురేనియంతో పాటు 28 రకాల 70 కోట్ల టన్నుల ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పజెప్పడానికే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 104 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ ఎం.ఒ.యు. ల ఒప్పందాలు 2005 నుంచి కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడున్న ఆదివాసీలు జల్, జంగిల్, జమీన్పై ఆదివాసీలకే హక్కు ఉందని పోరాటం ద్వారా చేస్తున్నారు. రాజ్యాంగం, చట్టాలు కూడా వారికి అనుకూలంగానే ఉన్నాయి. 1996లో వచ్చినటువంటి పేసా చట్టం గ్రామ సభల తీర్మానమే అంతిమంగా చెబుతూ అడవిపై ఆదివాసీలదే హక్కు ఉందని బలంగా ప్రకటిస్తున్నది. కార్పొరేట్ల అభివృద్ధి కోసం దేశ మూలవాసులైన ఆదివాసీలను అదే విధంగా ప్రజాస్వామ్య విఫలతలోంచే తప్పనిసరై సాయుధ పోరాటం చేస్తున్న విప్లవకారులను పూర్తిగా అంతమోందించైనా సరే కార్పోరేట్లకు ఖనిజ సంపదను అప్పగించాలని ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో 650 పోలీసు క్యాంపులను 7 లక్షల పోలీసు బలగాలను 100లాది డ్రోన్లను పదుల సంఖ్యలో హెలికాప్టర్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగిస్తూ ఆదివాసీల హననానికి మావోయిస్టుల నిర్మూలనకు యుద్ధం కొనసాగిస్తున్నాయి. ఇది ప్రజాస్వామిక దేశంలో ప్రజలు ఉద్యమకారులు ఏ విధంగానైనా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే హక్కు అవకాశం ఉంది. ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించడం కన్నా ఉద్యమాల అణచివేతనే పరిష్కారంగా భావిస్తూ ఇప్పటికి 50 ఏళ్ళుగా ఇప్పటికీ అణచివేతనే కొనసాగిస్తూ ఉద్యమ చరిత్రలోనే ఇప్పటికే 20 వేలకు పైగా ఎన్ కౌంటర్ హత్యలను కొనసాగించాయి. కాని గతంలో ప్రభుత్వాలెప్పుడు కూడా అంతమొందిస్తాం హత్యలు చేస్తామని తేదీలు నిర్ణయించి బలగాలను దించి దాడి చేయడమనేది రాజ్యాంగ ప్రభుత్వాలుగా భావించలేము.

2005 నుండి సల్వాజుడుం పేరుతో వేలాది మంది ఆదివాసీలను రమణ్సింగ్ ప్రభుత్వం హత్య చేసింది. ప్రొ.నందిని సుందర్, జస్టిస్ సుదర్శన్ రెడ్డిప్రజాస్వామిక బాధ్యత వలన సల్వాజుడుం రద్దుకాబడింది. కాని అందులో పని చేసిన వారందరిని డిఆర్ బలగాల పేరుతో కొత్త ఫోర్సుగా ప్రభుత్వంలో చేర్చుకున్నారు. సల్వా జుడుం తర్వాత 2009 లో ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రకటించబడింది. దీనితో సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు డిఆర్ జి బలగాలు కూడా ఆదివాసులపై దాడులు చేస్తూ హత్యాకాండను కొనసాగించాయి. అందులో భాగంగానే 2012లో జరిగిన బాసగూడ హత్యాకాండ, 2013 లో ఎడిసిమెట్టలో కూడా ఇటువంటి మారణకాండనే కొనసాగించారు. ఒక్కక్క ఎన్ కౌంటర్ ఘటనలో 17 మంది ఆదివాసీలు మరణించారు. ఇందులో స్కూలుకు వెళుతున్న మైనర్ బాలురు 5గురు ఉన్నారు. దానిపై ఏర్పాటు చేసిన జస్టిస్ అగర్వాల్ ఏక సభ్య కమీషన్ కూడా ఇది ఎన్ కౌంటర్ కాదని స్పష్టం చేసింది. 2011 నుండి ఆపరేషన్ గ్రీన్లాంట్ రెండవ దశ అమలవుతూ వస్తుంది. ఈ కాలంలో ఆదివాసీల అక్రమ అరెస్టులు నిర్విరామంగా కొనసాగాయి. సుక్మా, దంతెవాడ, జగల్పూర్, రాయపూర్ జైళ్ళన్నీ ఆదివాసీలతో నింపబడ్డాయి. అందరిపై ఉపా కేసులు నమోదు కాబడ్డాయి. చత్తీస్ఫడ్ ప్రత్యేక భద్రతా చట్టం కేస్ కూడా మోపబడింది. 2017 నుండి ఆపరేషన్ సమాధాన్ పేరుతో డ్రోన్లతో దాడి ప్రారంభించారు. ఈ స్థితిలోనే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకు పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇది 1990లో అప్పుడున్న కలెక్టర్ ఎట్లయితే అడవిలోకెళ్ళి ఎవరు వార్తలు సేకరించినా గాని వారిని కాల్చి పారేయండని బహిరంగంగా మాట్లాడిన స్థితి నేడు అమలవుతున్నది. అందులో భాగంగానే చత్తీస్ ఘడ్లో జరిగిన రహదారి అవినీతి కేసును బయటకు తీసినందుకు ముఖేస్ చంద్రాకర్ అనే యువ జర్నలిస్టును అత్యంత కిరాతకంగా గుండెను బయటకు తీసి కాలేయం నాలుగు ముక్కలుగా నరికి హత్య చేయడం అక్కడ ఎవరూ కూడా న్యాయం గురించి మాట్లాడొద్దని హెచ్చరించినట్లుగానే మనకు అర్థమవుతుంది. ఇది ఒక వైపు గతంలో ఉన్న ఐజి ఎస్ఆర్పి కల్లూరి కొనసాగించిన దాడినే నేడు ఉన్న ఐజి సుందర్ రాజ్ కొనసాగిస్తున్నాడు. కల్లూరి కాలంలో బిబిసి కాని అమ్నెస్టీ కాని చత్తీస్ ఘడ్ లో పర్యటించడానికి అవకాశం లేకుండా చేసి చత్తీస్ ఘడ్ ఆవలకు నెట్టేసిన చరిత్ర వారికుంది. అప్పుడే ఎడిటర్స్ గిల్ట్ అనే సంస్థ ఇక్కడ వార్తా సేకరణ అనేది పూర్తి ప్రమాదకరంగా మారిందని ప్రకటించారు. ఆ స్థితి నుండి చత్తీస్ఘడ్ ప్రాంతంలో బస్తర్ టాకీస్ పేరుతో, బస్తర్ జంక్షన్ల పేరుతో య్యూట్యూబ్ ఛానల్లు అక్కడ జరుగుతున్న ఎన్ కౌంటర్ దాడులను గాని హత్యాకాండలను గాని ప్రజలకు అందించడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్లకు పూర్తిగా కొమ్ము కాస్తున్న డబుల్ ఇంజన్ సర్కాల్లు ముఖేష్ చంద్రాకర్ను హత్య చేయించారు.

జనవరి 1, 2024 నుంచి ప్రారంబమైన ఆపరేషన్ కగార్ 6 నెలల పాప మంగ్లీ సోడి నుంచి ప్రారంభమైంది. ఆమె బీజాపూర్ జిల్లా మూద్దూం గ్రామానికి చెందిన పాప. పోలీసులు కాల్పులు జరిపి 6 నెలల పాపను చంపేసి ఎన్ కౌంటర్ ప్రకటిస్తారు. తల్లి ఎక్కడ నిజం చెబుతుందో అని బిడ్డ అంత్యక్రియలకు రానీయకుండా దూరం పెడతారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ యొక్క నిజ స్వరూపం, 7 ఫిబ్రవరి 2024 న గోందోడు గ్రామంలో ఎన్ కౌంటర్ ఒకరి మృతి, చంద్రన్ అనే వ్యక్తి గోందోడు గ్రామంలో ముందే పట్టుకొని అతనిని రాత్రంతా తీవ్ర చిత్రహింసలకు గురి చేసి ఉదయం 6 గంటలకే కాల్చి చంపేసి ఎన్ కౌంటర్గా ప్రకటించారు. 24 ఫిబ్రవరి 2024 సుక్మ జిల్లా బూర్గులంకలో ఎన్ కౌంటర్ ఒకరి మృతి చెందినట్లుగా ప్రకటించారు. ఇది సుక్మా జిల్లాకు చెందినవాడిగా అతన్ని కూడా ఇంటి దగ్గరే పట్టుకొని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి ఉదయం 6 గంటలకే కాల్చి చంపేసి ఎన్కౌంటర్ ప్రకటించారు. 19 మార్చి 2024 కోళ్ళమార్కలో జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు మరణించారని ప్రకటించారు. గడ్చిరోలి జిల్లా ఐరి తాలుకా కోళ్ళమార్క్ అడవిలో నలుగురిని పోలీసులు ప్రాణాలతో పట్టుకొని విషం పెట్టి క్రూరంగా హింసించి ఉదయం 6 గంటలకు కాల్చి చంపి ఎప్పటిలాగే ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లు ప్రకటించారు. శవాలను కూడా మాయం చేశారు. 27 మార్చి 2024 న బీజాపూర్ జిల్లా చీపురుబట్టి ఎన్ కౌంటర్ లో ఆరుగురు మరణించారు, అందులో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు. బీజాపూర్ జిల్లా చీపురుబట్టి గ్రామ సమీపంలో ఇద్దరు నిరాయుధంగా అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో వారిని పట్టుకొని తీవ్రంగా చిత్రహింసలు పెడుతుంటూ గ్రామస్తులు తిరగబడ్డందుకు అందులో నుండి ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి, నలుగురిని చంపి ఈ ఎన్ కౌంటర్ లో 6 గురి చనిపోయినట్లుగా చిత్రించారు. 2 ఏప్రిల్ 2024 బీజాపూర్ కోర్చిల్ ఎన్కౌంటర్ 13 మందిని ఎన్ కౌంటర్ చేశారు. ఇందులో ముగ్గురు మాత్రమే ఎదురుకాల్పుల్లో చనిపోయారు. మిగతావారు నిరాయుధంగా దొరికిన గ్రామస్తులు, మావోయిస్టులు. 6 ఏప్రిల్ 2024, బీజాపూర్ జిల్లా ఊసూర్ కర్రిగుట్ట ఎన్ కౌంటర్ లో ముగ్గురుమరణించినట్లుగా ప్రకటించారు. 16 ఏప్రిల్ 2024 కాంకేరి జిల్లా చోటా బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలో కల్పర్ అపటోలా అడవిలో జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి. అందులో 29 మంది మరణించారు. అందులో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు మరణించారు. పోలీస్ ఎదురు కాల్పులలో 12 మంది మరణించారు. గాయాలతో దొరికిన ఆరుగురిని పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. అంతేకాక మరో 11 మందిని వెంటాడి పట్టుకొని ఊళ్ళో ఉన్న అమరుల స్తూపం వద్దకు తీసుకెళ్ళి ఒక్కొక్కరిని కాల్చి చంపారు. 30 ఏప్రిల్ 2024 టెకేమెటా కాకూర్ ఎన్ కౌంటర్, 10 మంది హత్య. మే 10 న ఛత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూరులో ఎన్ కౌంటర్ - 12 మంది మృతి. వీళ్లందరూ గ్రామస్థులేనని ఆదివాసి హక్కుల కార్యకర్త సోనీసోరి బీజాపూర్ కలెక్టర్ వద్దకు ఆదివాసి మహిళలను తీసుకువెళ్లి నిలదీస్తున్న వీడియో మన ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇది బూటకపు ఎన్ కౌంటర్ గా భావిస్తున్నాం. మే 13 న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో 2 చిన్నపిల్లల మృతి. ఇంకా ఎన్ కౌంటర్ హత్యాకాండలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ కౌంటర్ అంటే గంటో రెండు గంటలు కాదు, రెండు నుంచి ఐదు రోజులుగా ఎన్ కౌంటర్ హత్యాకాండలు కొనసాగుతూనే ఉన్నాయి. 10 నుంచి ప్రారంబమవుతున్న హత్యాకాండలు 50 వరకు వెళుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రఘునాథపాలెంలె ఆరుగురు, ములుగు జిల్లా చల్పాక ఎన్కౌంటర్లో ఏడుగురుతో పాటు ఇప్పటికి తెలంగాణలో 26 మంది హత్యగావించబడ్డారు. ఇలా చత్తీస్ ఘడ్ ప్రాంతంలోనే కాక తెలంగాణ ప్రాంతంలో కూడా కగార్ హత్యాకాండ ఎన్ కౌంటర్ రూపంలో కొనసాగుతుంది. 50 ఏళ్ళుగా ఎన్ కౌంటర్ హత్యలు ప్రభుత్వ హత్యలుగానే హక్కుల సంఘాలు ప్రకటిస్తున్నాయి.. ఆ విధంగానే నిజనిర్ధారణ నివేదికలు కూడా ప్రజలకు అందిస్తున్నాయి. కానీ ఆపరేషన్ కగార్ హక్కుల సంఘాలను కగార్ హత్యాకాండలపై నిజ నిర్ధారణలు చేసే అవకాశం కల్పించకుండా పూర్తి నిర్బంధాన్ని అములు చేస్తూ ఏకపక్షంగా ఎనౌకౌంట్ల పేరుతో హత్యలను కొనసాగిస్తున్నారు. నిజమైన ఎన్కౌంటర్లయితే నిజనిర్ధారణలు చేయడానికి ఎందుకు ప్రభుత్వాలు భయపడుతున్నాయి. దీంతోనే మనకర్ధమవుతుంది ఆదివాసీలను ఉద్యమకారులను పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి ఎన్కౌంటర్లుగా ప్రకటిస్తున్నారు. అందు వలనే ఈ జరిగిన 300పైగా ఎన్కౌంటర్ హత్యలన్నింటిని కూడా ప్రభుత్వ హత్యలుగానే మనందరం పరిగణించాలని ఆపరేషన్ కగార్ను నిలిపివేయడానికి దాని పేరుతో జరుగుతున్న హత్యాకాండలను నిలువరించడానికి మన వంతుగా బాధ్యత పడదామని దీనికి ప్రజలు ప్రజాసంఘాలు ప్రజాస్వామిక వాదులు కలిసి రావాలని హక్కుల సంఘాలుగా పిలుపునిస్తున్నాం.

డిమాండ్స్:

ఆపరేషన్ కగారు వెంటనే ఆపివేయాలి

దేశ సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడం కోసం ఎంఒయులను కుదుర్చుకొని కొనసాగిస్తున్న హత్యాకాండలను వెంటనే నిలిపివేయాలి. ఎంఒయులను రద్దు చేయాలి.

ఏడాది కాలంగా జరిగిన, జరుగుతున్న అన్ని ఎన్కౌంటర్లపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి.

మానవ హక్కుల వేదిక (HRF),

ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ (OPDR),

పౌర హక్కుల పరిరక్షణ కమిటీ, (PUCL),

పౌర హక్కుల పర్యవేక్షణ కమిటి (CLMC)

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఘన స్వాగతం..

నాలుగు రోజుల దావోస్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం.

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

పలు కంపెనీల అధినేతలతో ముఖ్యమంత్రి రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చలు.

రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలు

దాదాపు 20 కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.

రు. 1.78 లక్షల కోట్ల పెట్టుబడుల హామీలతో ఎంవోయూ కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం.

Read More
Next Story