వరుసగా మూడో ఏడాది తగ్గిన చైనా జనాభా.. మరీ భారత్ పరిస్థితి?
కఠిన నిబంధనలతో చైనాలో తిరోగమనం
చైనా.. ప్రపంచానికి దాని పనితనం, ప్రత్యేకతల గురించి చెప్పాల్సిన పనిలేదు. దాని బలమే జనాభా.. తరువాత దాన్ని ఉపయోగించుకుని ప్రపంచ తయారీ రంగంగా ఎదిగింది. అయితే జనాభా విషయంలో ఆ దేశం అనుసరించిన విధానాలు తరువాత ప్రతికూల ఫలితాలు ఇవ్వడం ప్రారంభించింది.
తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం వరుసగా మూడో సంవత్సరం దాని జనాభా క్షీణించింది. కార్మికులు, వినియోగదారుల సంఖ్య క్రమంగా క్షీణిస్తుండటంతో దాని ఆర్థిక వ్యవస్థ మెల్లగా స్తబ్ధుగా మారుతోంది.
ఆ దేశంలో వృద్ధుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. దానితో పాటు పదవీ విరమణ చేసిన ప్రయోజనాలకు అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో ఇప్పటికే అప్పుల్లో ఉన్న స్థానిక ప్రభుత్వాలు మరింత ఒత్తిడిని అనుభవిస్తున్నాయని నిఫుణులు చెబుతున్నారు.
కొన్ని రోజుల క్రితం చైనాను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఆవిర్భవించింది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితిని నిశితంగా గమనించకుంటే భవిష్యత్ లో భారత్ కు ఇబ్బందులు తప్పవు. అక్కడ జనాభా పెరుగుతున్నప్పటికీ, జనాభా పెరుగుదల రేటులో తరగుదల నమోదవుతూ కంగారూ పుట్టిస్తోంది.
జననాలు.. మరణాల్లో వ్యత్యాసం
చైనా జనాభాను నియంత్రణ చేయడానికి 1980లోనే వన్ చైల్డ్ పాలసీని కఠినంగా అమలు చేసింది. దాన్ని విధిగా 2015 వరకు అమలు చేసింది. అయితే అందరూ మగ పిల్లలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఆడ పిల్లల నిష్పత్తి పడిపోయింది.
అలాగే వేగవంతమైన పట్ణణీకరమైన కారణంగా చైనా జననాల రేటు దశాబ్ధాలుగా క్షీణిస్తోంది. జననాలలో స్వల్ప పెరుగుదల కంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన వ్యక్తం అవుతోంది. బీజింగ్ లోని నిపుణులు ఇది రాబోయో సంవత్సరాల్లో మరింత దిగజారుతుందని హెచ్చరిస్తున్నారు.
దేశంలోని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. మొత్తం దేశం ప్రజల సంఖ్యలో 2023 లో 1409 బిలియన్లతో పోలిస్తే 2024 లో 1.39 మిలియన్లు జనాభా తగ్గి 1408 బిలియన్లకు పడిపోయింది. ఇదే సంవత్సరంలో చైనా మొత్తం జననాలు 2024 లో 9. 54 మిలియన్లు, 2023 లో 9.02 మిలియన్లు, జననాల రేటు 2024 లో 1000 మందికి 6. 77 జననాలకు పెరిగింది. 2023 లో 1000 మందికి 6.39 మరణాల సంఖ్య గా ఉంది.
జీవన వ్యయం
జపాన్, దక్షిణ కొరియాలాగానే మాదిరిగానే పెద్ద సంఖ్యలో చైనా ప్రజలు ఉపాధి, మెరుగైన ఆదాయాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వెళ్లారు. కానీ ఖరీదైన జీవన వ్యయాల కారణంగా చైనాలో పట్ణణాల్లో నివసిస్తున్న ప్రజలు పిల్లలను కనడం మానేశారు. ముఖ్యంగా పిల్లల సంరక్షణ, విద్యపై అధిక వ్యయం, సరైన ఉపాధి లేకపోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా చాలామంది వివాహం చేసుకోకుండా మిగిలిపోయేలా చేసింది.
భారత్ లో పరిస్థితి..
భారత్ లో జనాభా స్వరూపం 1975 నుంచి 2010 మధ్య రెట్టింపు అయి 120 కోట్లకు చేరింది. ఇప్పుడు భారత జనాభా 142 కోట్లకు అటుఇటూగా ఉంది. చైనా కంటే కనీసం 50 లక్షల జనాభా అధికంగా ఉంది. 2025 నాటికి దేశ జనాభా కనీసం 175 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నుంచి వచ్చిన డేటా ప్రకారం.. 2019 -2021 మధ్య కాలంలో దేశంలో సంతానోత్పత్తి రేటు 2.0 కి పడిపోయింది. ఇది నిజంగా ఆందోళన కలిగించే పరిణామం అని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఇది 2.1 శాతంగా ఉండేది.
అయితే మనం చైనా లాగా కఠినమైన నియంత్రణ లేకుండానే జనాభాను తగ్గించేశాం. అయితే తగినంత సంఖ్యలో జననాల రేటు లేకపోవడంతో భవిష్యత్ లో కచ్చితంగా వృద్ధుల రేటు పెరగడానికి దారి తీస్తుంది. ఇది ఉపాధి సమూహాలను ప్రభావితం చేస్తుంది.
భారత్ - చైనా మధ్య అంతరాలు..
సంతానోత్పత్తి రేటు విషయంలో చైనాలో ఏం జరుగుతుందో కచ్చితంగా బయట ప్రపంచానికి తెలియవు. కానీ మన దేశంలో మాత్రం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యోగాలు దొరకడం కష్టం గా ఉన్న కారణంగా పట్టణాలకు యువత వలస పోతున్నారు. ఈ సంఖ్య ఈ శతాబ్దానికి 80 కోట్లకు చేరుకుంటుందని ఒక అంచనా. ఇక్కడ ఉన్న అధిక జీవన వ్యయం కారణంగా పిల్లలను పెంచడం ఇబ్బంది కాబట్టి.. సంతానోత్పత్తి రేటు తగ్గే ప్రమాదం కనిపిస్తోంది.
అందుకే దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎక్కువగా పిల్లలను కనాలని సూచిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ మధ్య మాట్లాడుతూ జనాభా తగ్గిపోవడం వలన కలిగే నష్టాలను వివరించారు. దక్షిణ కొరియా పరిస్థితిని ఇక్కడ తీసుకురావద్దని కోరారు.
జనాభా వృద్దిరేటు
దేశంలో జనాభా వృద్ధిరేటు 2010 లో 1. 47 శాతం నుంచి 2024 నాటికి 0.89 శాతానికి పడిపోయింది. ఈ అంతరం ఇంకా పెరుగుతూనే ఉంది. ఇందుకు జనాభాను పున: పంపిణీ చేయాలని ఓ సిద్దాంతం తెరపైకి వచ్చింది. కానీ ఇది సరైన పద్దతి కాదు. మెట్రో సిటీలపై భారం పడకుండా టైర్ 2, 3, 4 నగరాల్లో సౌకర్యాలను విస్తరించి పథకాలను ఏకీకృతం కావడం వల్ల జనాభా రేటును కొంతవరకూ పెంచవచ్చు.
Next Story