ఉగాది వేళ పేదల ఫైలుపై చంద్రబాబు తొలి సంతకం
x

ఉగాది వేళ పేదల ఫైలుపై చంద్రబాబు తొలి సంతకం

ముఖ్యమంత్రికి TTD ,కనకదుర్గమ్మ ఆలయ వైదిక కమిటీ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు.


తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) దస్త్రంపై ఏడాది తొలిరోజే ఆయన సంతకం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పేద ప్రజల ఆరోగ్యం, అవసరాలే ప్రథమ ప్రాధాన్యతని ఆయన మరోసారి నిరూపించుకున్నారు.

6,787 మందికి అందిన ఊరట

తాజాగా ముఖ్యమంత్రి సంతకం చేసిన ఫైలు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6,787 మంది లబ్ధిదారులకు రూ.55.63 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. పండుగ రోజున తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
21 నెలల పాలన.. రూ.1,241 కోట్ల ఆసరా
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 21 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇప్పటివరకు 1,36,240 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి చేకూర్చారు. వైద్య సాయం, ఎల్ఓసీ (LOC) , నేరుగా ఆర్థిక సాయం రూపంలో మొత్తం రూ.1,241 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

ఆధ్యాత్మిక ఆశీర్వచనం

ఉగాది పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ వైదిక కమిటీ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పేదల కష్టాలు తీరాలని వారు ఆకాంక్షించారు.
Read More
Next Story