అవినీతి విశ్వవిద్యాలయానికి మోదీ చాన్స్‌లర్‌: తమిళనాడు సీఎం స్టాలిన్
x

అవినీతి విశ్వవిద్యాలయానికి మోదీ చాన్స్‌లర్‌: తమిళనాడు సీఎం స్టాలిన్

ప్రధాని మోదీపై తమిళనాడు సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. కళంకిత నాయకులను పార్టీలో చేర్చుకోవడాన్ని తప్పుబడుతూ.. బిజెపిని వాషింగ్ మెషిన్‌‌తో పోల్చారు స్టాలిన్.


తమిళనాట డీఎంకే, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల రాష్ట్రంలో వంశపారంపర్య రాజకీయాలు, అవినీతిపై ప్రధాని మోదీ విమర్శనాస్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయనపై విరుచుకుపడ్డారు. ‘అవినీతి విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్’ కావడానికి మోదీ సరైన వ్యక్తి అని అన్నారు. అందుకు ’ఎలక్టోరల్ బాండ్లు, PM కేర్స్ ఫండ్’ సమాధామని చెప్పారు. కళంకిత నాయకులను పార్టీలో చేర్చుకోవడాన్ని తప్పుబడుతూ బిజెపిని వాషింగ్ మెషిన్‌‌తో పోల్చారు స్టాలిన్.

స్టాలిన్ 'వెండం మోడీ' సందేశం

తమిళ సంస్కృతికి డిఎంకె విరుద్ధమని ప్రధాని చేసిన ఆరోపణపై స్టాలిన్ "ప్రధాని నరేంద్ర మోడీ అవర్గాలే , దయచేసి వాట్సాప్ యూనివర్శిటీలో చదవకండి. మన తమిళ సంస్కృతి యాదుం ఊరే, యావరుం కేళిర్ (మనకు అన్ని పట్టణాలు ఒకటే. , అందరూ మా బంధువులే)." అని పేర్కొన్నారు.

గెలిపించారో..ఇక నియంతృత్వమే..

మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయితే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని పేర్కొన్నారు. తిరిగి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం అంటే నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమేనన్నారు. పార్లమెంటులో ఎలాంటి చర్చలు ఉండవు. ఎన్నికలు ఉండవు. రాష్ట్ర అసెంబ్లీలు కనిపించవు. ఒకే భాష, ఒకే విశ్వాసం, ఒకే సంస్కృతి ఉంటుంది. అతను (ప్రధాని) సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తాడు" అని స్టాలిన్ పేర్కొన్నారు. దేశమంతటా "వెండం (ఇక వద్దు) మోడీ" సందేశాన్ని పంపాలని స్టాలిన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

'ఎంతమంది మోదీలొచ్చినా..

ఎంతమంది మోడీలు అయినా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోలేరని స్టాలిన్ అన్నారు. తేని నియోజకవర్గంలో తన పార్టీ అభ్యర్థి తంగ తమిళ్‌సెల్వన్‌ తరుపున ప్రచారంలో పాల్గొన్న సీఎం స్టాలిన్..

’’వేలూరు సమావేశంలో మోదీ హిందీలో ప్రసంగించారు. ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. సమావేశానికి ఉత్తర భారతదేశం నుంచి ప్రజలను తీసుకొచ్చారు’’ అని ఆరోపించారు.

విభజన రాజకీయాలు..

తమిళనాడును అభివృద్ధి చేస్తానని ప్రధాని మోదీ హిందీలో హామీ ఇచ్చారని చెబుతూ..అయితే తమిళనాడు తప్పక అభివృద్ధి చెందుతోందని అది ద్రవియన్ మోడల్ పాలనలో అని చెప్పారు. ప్రధాని ప్రజలను మత ప్రాతిపదికన విభజించారని స్టాలిన్ ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్ ఎన్నికల మేనిఫెస్టో అని మోదీ పేర్కొనడం విభజన, మతతత్వ రాజకీయాలకు అద్దం పడుతుందన్నారు. కేంద్రంలో తన దశాబ్దపు పాలనలో సాధించిన విజయాల ఆధారంగా మోదీ ఓట్లు అడగలేకపోతున్నారని స్టాలిన్ అన్నారు.

Read More
Next Story