
తమిళనాడులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ
తమిళనాడును అభివృద్ధి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రధాని..
ప్రధాని మోదీ ఆదివారం తమిళనాడులో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. మరక్కనం-పుదుచ్చేరి, పరమకుడి- రామనాథపురం నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ, తమిళనాడులో 8 రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణకు శంకుస్థాపన చేశారు. చెన్నై బీచ్-చెన్నై ఎగ్మోర్ మధ్య నాల్గో రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేశారు. తమిళనాడును అభివృద్ధి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఆదిచనల్లూరు వంటి ప్రదేశాలను ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తించి అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో మెరుగైన ప్రసార సేవల కోసం కుంభకోణం, యెర్కాడ్, వెల్లూరు ప్రాంతాల్లో మూడు కొత్త FM రిలే ట్రాన్స్మిటర్లను ప్రారంభించారు. ఇది స్థానిక ప్రజలకు FM ప్రసారాలను నిరంతరాయంగా అందిస్తాయి.
Next Story

