
బాలికలకు ఉచిత సింగిల్-డోస్ HPV టీకా డ్రైవ్..
గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల అమ్మాయిలకు దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్‌ను ప్రారంభించనున్న కేంద్రం..
దేశంలో పెరిగిపోతోన్న గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా 14 ఏళ్లలోపు బాలికలను సింగిల్-డోస్ HPV టీకా డ్రైవ్‌ను త్వరలో ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం కింద క్వాడ్రివాలెంట్ గార్డసిల్-4 అనే టీకా ఇవ్వడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాను ఉచితంగా వేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సరైన వయస్సులో ఒక్క మోతాదు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. గార్డసిల్-4 టీకా 2006 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగంలో ఉంది. ఈ టీకా వంద శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాల్లో తేలిందని చెప్పారు.
భారతదేశ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. ఏటా సుమారు 80వేల కొత్త కేసులు, 42వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ డ్రైవ్ ప్రారంభమయిన వెంటనే తల్లిదండ్రులు తమ 14 ఏళ్ల కూతుర్లకు టీకా వేయించాలని కోరుతున్నారు.

