సంగీత విడాకుల పిటిషన్‌ను విజయ్ ఎలా డీల్ చేస్తారు?
x

సంగీత విడాకుల పిటిషన్‌ను విజయ్ ఎలా డీల్ చేస్తారు?

విజయ్ వ్యక్తిగత విషయాలపై ఎవరూ వ్యాఖ్యానించకూడదన్న నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్. వ్యక్తిగత క్రమశిక్షణ ఎప్పుడూ చర్చనీయాంశం కాలేదని రాజకీయ విశ్లేషకుడు


Click the Play button to hear this message in audio format

తమిళనాడులోని ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు, టీవీకే చీఫ్ విజయ్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితం‌లో అత్యంత సున్నితమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఆయన భార్య సంగీత విడాకుల కోరుతూ సోర్నలింగం చెంగల్పట్టు కుటుంబ కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అయితే విజయ్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మహిళా ఓటర్ల మద్దతు దెబ్బతీసేందుకు డీఎంకే, బీజేపీ పన్నిన కుట్ర అనే పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

‘సంయమనం పాటించాలి’

సీనియర్ జర్నలిస్ట్ సావిత్రి కన్నన్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. ఈ అంశం విజయ్ రాజకీయ అవకాశాలను నష్టం కలిగించదన్నారు. "ఇది అతని పార్టీ ఓటు బ్యాంకుపై పెద్దగా ప్రభావం చూపదు" అని పేర్కొన్నారు. రాజకీయ విశ్లేషకుడు కన్నియప్పన్ ఎలంగోవన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో వ్యక్తిగత క్రమశిక్షణ ఎప్పుడూ చర్చనీయాంశం కాలేదని అన్నారు. విజయ్ వ్యక్తిగత విషయాలు రాజకీయాల్లో ప్రతిధ్వనించని అన్నారు. జీవనశైలి అనుకూలంగా లేనప్పుడు విడాకులు ఆమోదయోగ్యమైన పద్ధతి అని ఎలంగోవన్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. అతని ప్రస్తుత భార్య రష్యన్ జాతీయురాలు అని గుర్తుచేశారు. యువ ఓటర్లు విడాకులను సర్వసాధారణంగా చూస్తారని ఎలంగోవన్ పేర్కొన్నారు. ఆయన వివాహ సమస్యను విజయ్ ప్రత్యర్థులు రాజకీయం చేయడానికి దిగజారిపోతున్నారని పేర్కొన్నారు.

ఈ విషయంపై నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్ తటస్థ వైఖరి కనపర్చారు. "ఇది విజయ్ సర్ వ్యక్తిగత విషయం. దీనిపై ఎవరూ వ్యాఖ్యానించకూడదు. ఇది భార్యాభర్తలు చర్చించుకుని నిర్ణయించుకోవాల్సిన విషయం. బయటి వ్యక్తుల జోక్యం అనవసరం" అని అన్నారు.

సోషల్ మీడియా విస్తృత ప్రచారం జరుగుతున్నా, సంగీత పిటిషన్‌పై విజయ్ లేదా టీవీకే ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

Read More
Next Story