జీఎస్టీని క్రమబద్దీకరించాలని, మరింత సమర్థవంతమైన నియంత్రణ ప్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. కొన్ని రోజుల్లో మోదీ 3.0 ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతోంది. ఈ సందర్భంగా కార్పొరేట్ ఇండియా తమ కోరికల చిట్టాను ప్రభుత్వం ముందుంచింది. ఆర్ధిక వివేకాన్ని ప్రదర్శించడం, ద్రవ్యలోటు తగ్గించడం, మౌలిక సదుపాయాలను పెంచడం, ప్రయివేట్ పెట్టుబడులు పెంచడానికి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న మూలధన వ్యయాలను ఇప్పుడు కొనసాగించాలని అవి కోరుతున్నాయి.
ద్రవ్య లోటు
ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యం ఇప్పటికే జీడీపీలో 5.8 నుంచి 5.6 శాతానికి సవరించారు. దీనికి కారణం ఊహించని స్థాయిలో ఎక్కువ పన్ను వసూళ్లు కారణంగా చెప్పవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 5.1 గా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఇలాంటి ఆర్థిక ఏకీకరణ వృద్ధి ఆధారిత వ్యయాన్ని నిరోధిస్తుందని ఆందోళనలు సైతం వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంరక్షించాలంటే సమతుల్య విధానం అవసరం.
ప్రజాకర్షక చర్యలు
ఆర్థిక ఏకీకరణను అడ్డుకోవాలంటే ఎలాంటి ప్రజాకర్షక చర్యలు చేపట్టాకూడదని కార్పొరేట్ ప్రపంచం కోరుకుంటోంది. వీటితో పాటు జీఎస్టీని మూడు పన్నురేట్ల స్లాబులోకి మార్చాలని కోరుతున్నాయి. మరో నాలుగు నెలల్లో మహారాష్ట్ర, తరువాత ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజాకర్షక విధానాలకు బడ్జెట్లో పెద్ద పీట వేసే అవకాశం కనిపిస్తోంది.
కార్పోరేట్ ఇండియా ప్రభుత్వం క్యాపిటల్
వ్యయం (క్యాపెక్స్)పై కనీసం 20 శాతం పెరుగుదలతో వాటిని రూ.12 లక్షల కోట్లకు పెంచాలని, దీనివల్ల వూహన్ వైరస్ కంటే ముందున్న వృద్ధిరేట్ సాధ్యం అవుతుందని సూచిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రభుత్వ మూలధన వ్యయం రూ.9.49 లక్షల కోట్లుగా ఉంది.
పెట్టుబడి కొరత
అయితే , దేశంలో అనుకూలమైన పన్ను వాతావరణం ఉన్నప్పటికీ మూలధన ప్రాజెక్టులలో కార్పొరేట్ ఇండియా పెట్టుబడి తక్కువగా ఉందని విమర్శకులు గణాంకాలతో సహ వివరిస్తున్నారు. చాలా కంపెనీలు తమ లాభాలను డివిడెండ్ రూపంలో వాటాదారులకు ఇచ్చాయి కానీ, భవనాలు, ప్లాంట్లు, మెషీనరీ లాంటి స్థిరమూలధనంలోకి మార్చడానికి ఇష్ట పడలేదు.
నాన్-ఫైనాన్షియల్ ప్రైవేట్ కంపెనీల ఆర్థిక బలం
పోస్ట్ టాక్స్ కోతలను మెరుగుపరిచింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వీటి లాభాలు రూ. 4,00,00 కోట్లు-5,00,000 కోట్లకు పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో గత కాలాల్లో రూ. 1,00,00 కోట్లు-2,00,000 కోట్లు. అయితే ఈ లాభాలు మూలధనం లోకి మాత్రం కలపలేదు. పన్ను తరువాత లాభాలు FY22లో 63 శాతానికి చేరాయి, ఇది ఒక దశాబ్దంలో అత్యధికం, అయినప్పటికీ రుణ-ఈక్విటీ నిష్పత్తి క్షీణిస్తూనే ఉంది, FY22లో 0.71కి చేరుకుంది.
కార్పొరేట్ పన్ను
ఆర్థిక కార్యకలాపాలను పెంచే ప్రయత్నంలో, భారత ప్రభుత్వం 2019లో కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించింది. చట్టబద్ధమైన కార్పొరేట్ పన్ను రేటు 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది ,ఈ చర్య ఇతర ఆసియా దేశాలతో మన దేశం పోటీ పడేలా చేసిందని చెప్పవచ్చు. ఉదాహారణకు ప్రస్తుత కార్పొరేట్ పన్ను రేట్లు మయన్మార్‌లో 25 శాతం, మలేషియాలో 24 శాతం, ఇండోనేషియా, దక్షిణ కొరియాలో 25 శాతం, శ్రీలంకలో 28 శాతంగా ఉన్నాయి. చైనీస్ కంపెనీలు కూడా 25 శాతం కంటే అధిక పన్ను రేటును ఎదుర్కొంటున్నాయి. బ్రెజిల్‌లో ఇది 34 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా, సగటు కార్పొరేట్ పన్ను రేటు 23.79 శాతంగా ఉండగా, ఆసియా సగటు 21.09 శాతంగా ఉంది.
వినియోగదారుల వ్యయం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల డిమాండ్ మందగించడం వల్ల కంపెనీలు అన్ని కూడా తమ లాభాలను నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేశాయి. కోవిడ్ తరువాత ఇది మరింత క్షీణించింది. చాలా కంపెనీలు అప్పులు తగ్గించుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాయి. తమ కార్యకలాపాలను విస్తరించడానికి బదులు తగ్గించుకోవడానికి మొగ్గు చూపాయి.
ప్రైవేట్ తుది వినియోగదారు వ్యయం (PFCE) వృద్ధి కూడా FY23లో 7.5 శాతం నుంచి FY24లో 4.4 శాతానికి పడిపోతుందని అంచనా , ఇది వినియోగదారుల వ్యయంలో గణనీయమైన మందగమనాన్ని సూచిస్తుంది. ప్రభుత్వ తుది వినియోగ వ్యయంలో వృద్ధి మందగించడం దీనికి కారణం , ఇది మొదటి అర్ధ భాగంలో 5.1 శాతం నుంచి FY2024 రెండవ భాగంలో 3.1 శాతానికి తగ్గుతుందని అంచనా . సేవల రంగంలో కూడా ఒక మోస్తరు వృద్ధి ఉంది, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ సేవలు అంతకుముందు సంవత్సరం 14 శాతంతో వృద్ధి చెందగా, FY2024లో 6.3 శాతం మాత్రమే వృద్ధి చెందుతాయని అంచనా .
కార్పొరేట్ల కోరిక
కేంద్ర బడ్జెట్ కోసం కార్పొరేట్ ఇండియా కోరికల జాబితా ఇలా ఉంది : ఫిస్కల్ కన్సాలిడేషన్ ఆర్థిక వృద్ధి : ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందిస్తూ, ఆర్థిక లోటు లక్ష్యాన్ని FY24కి GDPలో దాదాపు 5.9 శాతంగా ఉంచడం, FY25కి దానిని 5.4 శాతానికి తగ్గించాలి.
GST సంస్కరణ: నిత్యావసరాలకు తక్కువ రేటు, చాలా వస్తువులకు ప్రామాణిక రేటు, లగ్జరీ/డెమెరిట్ వస్తువులకు అధిక రేటుతో GSTని మూడు-రేటుల స్లాబుకి మార్చాలి.
.క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పై ఫోకస్ : కనిష్టంగా 20 శాతం పెరుగుదలతో దాదాపు రూ.12 లక్షల కోట్లకు పెంచాలి. చైనా వైరస్ కంటే ముందు వృద్ధి రేటును అధిగమించడానికి మూలధన వ్యయంపై దృష్టి పెట్టడం అవసరం.
తక్కువ-ధర గృహాలు: ప్రస్తుతం గృహ పథకాలకు అందిస్తున్న రూ. 25 లక్షల రుణ పరిమితిని, రూ. 35 లక్షలకు పెంచాలి. దీని కోసం వడ్డీ రాయితీ పథకాన్ని కొనసాగించాలి.
కార్మిక-ఇంటెన్సివ్ రంగాలకున.. : దుస్తులు, పాదరక్షలు, బొమ్మలు, పర్యాటకం వంటి రంగాల కోసం పట్టణ ఉపాధి హమీ కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుద్యోగాన్ని తగ్గించాలి.
వ్యవసాయం- గ్రామీణాభివృద్ధి: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, MGNREGA కోసం నిధుల కేటాయింపులను పెంచండి.
స్ట్రీమ్‌లైన్ రెగ్యులేటరీ ఆమోదాలు: నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వ్యాపార నియంత్రణ ఆమోదాలను క్రమబద్ధీకరించడానికి రాష్ట్రాలను ప్రోత్సహించండి .
MSMEలకు మద్దతు: MSME మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేకమైన మైక్రో ఎంటర్‌ప్రైజ్ వర్టికల్‌ను ఏర్పాటు చేయండి. MSMEలకు ప్రయోజనం చేకూర్చడానికి PLI పథకాలను సవరించాలి.
దిగుమతి సుంకాలను హేతుబద్ధీకరణ : ముడి పదార్థాలపై సున్నా లేదా తక్కువ సుంకాలతో మూడు-స్థాయిల సుంకాలను అమలు చేయాలి.
తుది వస్తువులకు దాదాపు 7.5 శాతం ప్రామాణిక రేటు, ఇంటర్మీడియట్ వస్తువులకు మధ్యస్థ రేటు అమలు చేయడం.
హెల్త్‌కేర్- ఎడ్యుకేషన్‌పై ఖర్చు పెంపు : డిజిటల్, AI నైపుణ్యాల శిక్షణపై దృష్టి సారించి, ఉమ్మడి ఆరోగ్య సంరక్షణ, విద్య ఖర్చులను GDPలో వరుసగా 2.5-3 శాతం నుంచి 6 శాతానికి పెంచాలి.