హిండెన్ బర్గ్ నివేదికతోనే బలంగా ఎదిగాము: అదానీ
x

హిండెన్ బర్గ్ నివేదికతోనే బలంగా ఎదిగాము: అదానీ

అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ ఇచ్చిన తప్పుడు నివేదికలతో అదానీ గ్రూప్ బలంగా ఎదిగిందని కంపెనీ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు.


హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ పట్టుదలతో బలంగా ఎదిగిందని అదానీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. న్యూ ఢిల్లీలో జరిగిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో అదానీ మాట్లాడుతూ, " విపత్తులో మనం చూపిన పట్టుదల, సామర్థ్యమే విజయానికి నిజమైన కొలమానం’’ అని అన్నారు. అదాని కంపెనీ తన స్టాక్ విలువను పెంచుకునేందుకు షార్ట్ సెల్లింగ్ వంటి స్టాక్ మానిపులేషన్ కు పాల్పడుతుందని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ ఆరోపించింది. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలనీ తరువాత తేలింది.

పోరాటం
గత సంవత్సరం మనం చూపించిన పట్టుదల ఇంతకుముందెన్నడూ చూపలేదు అని హిండెన్ బర్గ్ పేరు తీసుకోకుండానే వ్యాఖ్యానించారు.
“అదానీ గ్రూప్ సమగ్రత, విదేశీ షార్ట్ సెల్లర్ల ప్రతిష్టపై దాడులకు వ్యతిరేకంగా పోరాడింది. అదానీ గ్రూప్ పునాదులను ఏ సవాళ్లూ బలహీనపరచలేవని నిరూపించబడింది, అని ”అన్నారాయన. "మా దశాబ్దాల కృషిని ఓ విదేశీ షార్ట్ సెల్లర్ ప్రశ్నించింది. ఈ నిరాధారమైన ఆరోపణలు మనల్ని ఏమీ చేయలేకపోయాము "
చిత్తశుద్ధి, కీర్తి
తమ బృందం పెద్ద తుఫానును ఎదుర్కొందని, అయితే మా సమగ్రత, ప్రతిష్టను కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడమని అదానీ చెప్పారు. అదానీ గ్రూప్ పునాది బలాన్ని ఏ సవాళ్లూ దెబ్బతీయలేవని ఇది రుజువు చేసిందని ఆయన అన్నారు. షార్ట్ సెల్లర్ ఆరోపణలతో ప్రజల్లో ఆన్ పాపులర్ చేయడానికి బలమైన ప్రయత్నాలు జరిగాయని అన్నారు.
పెట్టుబడిదారులకు..
ఆరోపణలపై విచారణ మధ్య, గ్రూప్ FPO ద్వారా సేకరించిన రూ. 20,000 కోట్లను పెట్టుబడిదారులకు తిరిగి ఇచ్చింది. FPO ఆదాయాన్ని తిరిగి ఇచ్చే నిర్ణయం పెట్టుబడిదారులకు మా నిబద్ధత, అంకితభావాన్ని తెలియజేస్తోంది," అని అదానీ చెప్పారు . "మమ్మల్ని పరీక్షించిన సవాళ్లు చివరికి మమ్మల్ని బలమైన సంస్థగా, భవిష్యత్తు కోసం బలంగా సిద్ధం చేశాయి." అని వ్యాఖ్యనించారు.
ఆరోపణలు
ఈ ఏడాది ప్రారంభంలో, సుప్రీంకోర్టు అదానీ గ్రూప్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) అధికారంపై విశ్వాసం ఉంచుతూ అన్ని ఆరోపణలను కొట్టివేసింది. హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ పన్ను స్వర్గధామాలను ఉపయోగించిందని ఆరోపించింది. కంపెనీలో అప్పుల గురించి ఆందోళనలను వ్యక్తం చేసింది. కంపెనీ స్టాక్ మానిప్యులేషన్ కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించింది. అదానీ గ్రూప్ ఆరోపణలను "నిరాధారమైన ఊహాగానాలు"గా పేర్కొంది.


Read More
Next Story