బడ్జెట్ ప్రసంగం: నైపుణ్యానికి పెద్ద పీట.. పద్దు లక్ష కోట్ల పై మాటే..
x

బడ్జెట్ ప్రసంగం: నైపుణ్యానికి పెద్ద పీట.. పద్దు లక్ష కోట్ల పై మాటే..

దేశంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం నేడు లోక్ సభ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతోంది. నిన్న సభ లో ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేలో పలు..


ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించారు. మౌలిక సదుపాయాలు, నిర్మాణం, తయారీ, గ్రీన్ ఎనర్జీతో సహా అనేక రంగాలలో మూలధన పెట్టుబడులను విస్తరించడంపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని నిపుణులు తెలిపారు. బడ్జెట్‌కు ముందు, ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్, అతని బృందం రచించిన ఆర్థిక సర్వే 2023-24ను సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ఆర్థికమంత్రి యువత నైపుణ్యాభివృద్ది కోసం 1. 48 లక్షలను కేటాయించారు. బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది.

2024-25లో భారతదేశ జిడిపి 6.5 నుంచి 7 శాతానికి పెరుగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠ స్థాయి 8.2 శాతంగా ఉంది. అదే సమయంలో భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు పెరగడం వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపుతుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది.
నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. కావున ప్రజలందరూ దీనిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. NDA ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన ఆరు వారాల తర్వాతమహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ- కాశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలకు బడ్జెట్ లో వరాలు ప్రకటించే అవకాశం ఉంది.
Read More
Next Story