లౌకిక వాదానికి ప్రాణం పోసిన గాంధీ
x
"లౌకిక భారతం కోసం గాంధీ" పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖ గాంధేయ వాది చంద్రశేఖర కల్కూర

లౌకిక వాదానికి ప్రాణం పోసిన గాంధీ

‘రాజ్యం పూర్తిగా లౌకికంగా ఉండి తీరాలి,రాజ్యం అంటే గాంధీ దృష్టిలో లౌకిక ప్రజాతంత్ర రాజ్యమే’


లౌకికత్వానికి పునాదులు వేసి, లౌకిక రాజ్య స్థాపనకు నిరంతరం కృషి చేసిన మహోన్నతుడు మహాత్మా గాంధీ అని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ అన్నారు. కర్నూల్ నగరంలోని కార్మిక కర్షక భవన్లో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ప్రజాశక్తి బుక్ ప్రచురించిన "లౌకిక భారతం కోసం గాంధీ" అనే పుస్తకం పరిచయసభ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ పుస్తకాన్ని కర్నూలుకు చెందిన ప్రముఖ గాంధేయవాది గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు కురాడి చంద్రశేఖర కల్కూర ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జేఎన్టీయూ ప్రొఫెసర్ బిపిన్ చంద్ర రాసిన వ్యాసం గూర్చి మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న మొదటి వ్యక్తి గాంధీజీ అని గాంధీజీ సనాతన వాదే కానీ, మహిళల స్వేచ్ఛను కోరుకోవడం, కుల వివక్షను అంతం చేయడం, కులదోపిడీని అడ్డుకోవడం, హిందూ ముస్లింల ఐక్యతకు కట్టబడిన వ్యక్తి గాంధీజీగా ఈ పుస్తకంలో కనబడతాడని కల్కూర అన్నారు.

గాంధీజీ సత్యాన్వేషణపై అనేక ప్రయోగాలు చేశారనీ, ఇందులో భాగంగా కుల వ్యవస్థ నిర్మూలన, కులాంతర మతాంతర భోజనాలు, కులాంతర పెళ్లిళ్లు, భూస్వామి రైతు సంబంధాలు, పెట్టుబడిదారి వ్యవస్థ సోషలిజం పార్లమెంటరీ వ్యవస్థ మతానికి రాజకీయాలకు సంబంధం యాంత్రికరణ వీటన్నింటిపై గాంధీజీ విస్తృతంగా వ్యాసాలు రాశారనే విషయం చాలామందికి తెలియదని అన్నారు. గాంధీజీకి మతంపై నిర్దిష్టమైన అభిప్రాయం ఉందని, మనుషులను మతం ప్రాతిపదికన విభజించడం తప్పని, మెజార్టీ మతస్తులు, మైనార్టీ మతస్తులు అనే విభజన చేయకూడదని ఆయన న్నారు.

హిందువు ఒక బెంగాలీ ముస్లిం అని, ఒక్క రకమైన ఆచార సాంప్రదాయాలు పాటిస్తారని అన్నారు.ప్రాథమిక హక్కులను ప్రాణాలు వడ్డేనా కాపాడుకోవాలని గాంధీజీ పిలుపునిచ్చారని అన్నారు.పత్రికా స్వేచ్ఛపై గాంధీజీకి స్పష్టమైన వైఖరి ఉందని, పత్రికలు విమర్శ రాయాలని, రాస్తేనే వాక్ స్వాతంత్రం ఉన్నట్లని మనుషులను సమాజాన్ని విషపూరితం చేయకూడదన్నారు.

1947లో ఆయన ఒక ప్రకటన చేస్తూ హిందువులను వధించడం ద్వారా ముస్లింలు ఇస్లాం మతానికి సేవ చేయడం లేదనీ వారు ఇస్లాంను ధ్వంసం చేస్తున్నారనీ, ఇక హిందువులు ముస్లింలు మతాన్ని అంతం చేయగలం అనుకుంటే వారు హిందూ ధర్మాన్ని ధ్వంసం చేస్తున్నట్లేనని లౌకిక వాదం మతతత్వవాదం బొమ్మ బొరుసువంటివనీ గాంధీజీ ఆనాడే పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రాజ్యం పూర్తిగా లౌకికంగా ఉండి తీరాలని,రాజ్యం అంటే మన దృష్టిలో లౌకిక ప్రజాతంత్ర రాజ్యమని అన్నారు.

1942 ఆగస్టు 9న స్వతంత్ర భారతదేశంలో హిందూ రాజ్యం కాదు అది భారత రాజ్యం అవుతుందనీ, మత లేదా జాతి ఆధారంగా రాజ్యం ఉండకూడదనీ, మతంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే పాలన కావాలన్నారు.మతానికి సంబంధించి నాలుగు కీలక విషయాలు మతం రాజకీయాలలో చొరబడకూడదని అది పూర్తిగా వ్యక్తిగతమని, రాజ్యం అన్ని మతాలకు దూరంగా ఉండాలనీ, అన్ని మతాల పట్ల తటస్థ వైఖరి ఉండాలన్నారు.

మతం పౌరుల పట్ల వివక్ష చూపరాదనీ, దేశంలో అన్ని మతాల వారిని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబెట్టాలన్నారు. మతం కంటే సత్యమే ముఖ్యమని, రాజకీయాలు నైతికంగా ఉండాలి. దేవుడంటే సత్యం, ప్రేమ, నిజాయితీ, నైతికత, మనస్సాక్షి అని గాంధీజీ రచనల వల్ల అర్థమవుతుందని అన్నారు. మతం అంటే సహనం అని, మత విద్యాసంస్థలు ప్రభుత్వ ప్రయోజనాలు పొందకూడదనీ, పాఠ్యాంశాలలో మతాన్ని ఒక అంశంగా చేర్చకూడదనీ, చట్టానికి, విధానాలకు, నైతికతకు లోబడి మతాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు.

అయితే అన్ని మతాల్లో ఉన్న నైతికతలను పాఠ్యాంశాలలో బోధించాలని స్వాతంత్రం కంటే పూర్వమే గాంధీజీ పిలుపునివ్వడం గొప్ప విషయమని అన్నారు. మనిషి హేతువాదానికి తప్ప దేనికి లొంగకూడదనీ గాంధీజీ జీవిత సారమని 1925లో ఆఫ్ఘనిస్తాన్లో ఉరిని గాంధీజీ వ్యతిరేకించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆధునిక, లౌకిక, ఆర్థిక, రాజకీయ, నైతిక సూత్రాలనే తప్ప మతం ఆధారంగా రాజ్యం ఉండకూడదనీ, రామరాజ్యం గూర్చి 1920లోరామరాజ్యమని నేను అనడాన్ని ముస్లిం సోదరులు తప్పుగా అవగాహన చేసుకున్నారనీ, రామరాజ్యం అని అన్నానంటే అది హిందూ రాజ్యం కాదనీ, రామరాజ్యం అంటే దేవుని రాజ్యమని, రాముడు రహీం ఇద్దరు ఒక్కటే ఆ ఇద్దరూ సత్యం న్యాయం అని రామరాజ్యం అంటే నిజమైన ప్రజాస్వామ్యం అని గాంధీజీ పిలుపునివ్వడం గొప్ప విషయమని అన్నారు.

రామరాజ్యంలో అత్యంత పేదవాడు, అత్యంత ధనికుడు, సమాన హక్కులు కలిగి ఉంటాడనీ, నైతికత, అధికారం ఆధారంగా ప్రజలకు సార్వభౌమాధికారం ఉండాలని ఈ పుస్తకం నొక్కి వక్కా నుంచి చెబుతుందని అన్నారు.

గాంధీ ఆధునిక బూర్జువాగా రూపాంతరం చెందిన ఇండియా అనే వ్యాసంలో రవీందర్ కుమార్ గాంధీని తొలి సహస్రాబిలో శాక్యముని, గౌతమ బుద్ధుడు వీరిరువురిని యుగపురుషులుగా పరిగణిస్తారో గాంధీ కూడా అదే కోవకు చెందిన వారిని నిర్ధారించారనీ అన్నారు. శాక్య ముని వలె మహాత్మా గాంధీ కూడా తన కాళ్లకు వేదనలను శోభలను సున్నితంగా ప్రతిఫలించాడనీ ఆధునిక యుగపు సమస్యలు ఎన్నో సమగ్ర అవగాహనతో పరిష్కారం కోరుతూ గాంధీకి ఎదురయ్యారనీ, కానీ గాంధీ వీటన్నింటికీ సంతృప్తికరమైన పరిష్కారాలు కనుగొనలేక పోవడం కనిపిస్తుందని అన్నారు

సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు సభాధ్యక్షతన జరిగిన ఈ సభలో యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్ కుమార్ ఈ పుస్తకంలోని మూడు వ్యాసాలను పరిచయం చేశారు. కర్నూలుకు చెందిన ఆర్థికవేత్త డా. మన్సూర్ రెహమాన్ సందేశం ఇచ్చారు. సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆహ్వానంతో జరిగిన ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు హాజరయ్యారు.

Read More
Next Story